Tuesday, November 30, 2021

నేటి జీవిత సత్యం.

నేటి జీవిత సత్యం.

మానవుడు మాధవుని అనుగ్రహానికి నోచుకోవాలంటే తన మనస్సును కోరికల కొంపగా కాక ప్రేమ, భక్తి, విశ్వాసాల గంపగా చేసుకోవాలి.

ఒకసారి రుక్మిణి కృష్ణుని చేతిలోని వేణువును చూసి ఇలా అడిగింది…"విడవకుండా కృష్ణుడు ఎప్పుడూ నిన్ను తన చేతుల్లోనే ఉంచుకుంటాడు కదా! పూర్వజన్మలో నువ్వు ఏం పుణ్యం చేసావు? ఆ రహస్యం నాకు దయచేసి చెప్పు!" అని.

అందుకు వేణువు నవ్వి ఇలా అన్నది, "నాలోపల డొల్లతప్ప ఏంలేదు. ఆ ఏమీ లేకపోవడమే నన్ను ఆ ఆనంద కిషోరునికి దగ్గర చేసింది" అని చెప్పిందట.

ఎవరైతే ప్రాపంచిక విషయాలను మనసులోంచి పూర్తిగా తొలగించుకొని మనసుని ఖాళీగా ఉంచుకుంటారో వారు సర్వాంతర్యామి అయిన ఆమాధవునితో సదా ఉండగలుగుతారు. ఆయన అనుగ్రహానికి నోచుకుంటారు.

మనం ఈ ఆధ్యాత్మిక రహస్యాన్ని తెలుకుని ఆచరిస్తే చాలు ఇంకా ఎటువంటి సాధన అవసరం లేదు!✍️

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment