Thursday, November 25, 2021

నేటి మంచిమాట.

నేటి మంచిమాట.

ఒక ఊళ్లో రాజయ్య తన కుటుంబ సభ్యులు కూతురు చిన్నారితో కలిసి జీవించేవారు, చిన్నారి రెండవ తరగతి, రాజయ్య రూపాయి ఆదాయం ఉంటే వంద రూపాయలు ఖర్చు చేసి ధనాన్ని దుర్వినియోగం చేసుకోవడం వలన పేదవాడు అయినాడు, జీవనం గడపటానికి పెద్ద ఆధారాలేమీ లేవు, వాళ్ళ ఇంట్లో ఉన్న కరివేపాకు చెట్లు తప్ప ...

రోజూ రాజయ్య చిన్నారి ఇద్దరూ కలిసి కరివేపాకు చెట్టు నుండి కరివేపాకును తెంపుకొని, ఊళ్లో వీధి వీధినా తిరిగి అమ్ముకునేవాళ్ళు, అలా వచ్చిన డబ్బుతో, తమకు అవసరమైన సరుకులు తెచ్చుకుని జీవించే వారు ..

ఒకరోజున, చిన్నారికి ఒక సందేహం వచ్చింది, కరివేపాకు చెట్టుకు కూడా ప్రాణం ఉంది కదా? దాని కొమ్మలు విరిస్తే దానికి బాధ కలుగుతుంది గదా ? మరి మనం ఇలా రోజూ కరివేపాకు కోసుకుంటుంటే ఎలాగ అని ..?

ఆపైన ప్రతిరోజూ చిన్నారి తన తల్లిదండ్రులు ఇదే ప్రశ్న అడిగేది, వాళ్ళకు ఏమి జవాబివ్వాలో తెలిసేదికాదు, నన్నుడిగితే నేనేం చెప్పాలి తల్లీ! నువ్వడిగేదేదో ఆ కరివేపాకు చెట్టునే అడుగు ! అన్నారు చివరికు...

చిన్నారి కరివేపాకు చెట్టు దగ్గరకు వెళ్లి చెట్టూ, చెట్టూ, రోజూ నీ కొమ్మలు విరుస్తున్నాం, నీకు బాధ కలగటం లేదా ? అని అడిగింది ..

బాధగానే ఉంటుంది చిన్నారీ! కానీ నన్ను జాగ్రత్తగా చూసుకునే మీరు కూడా బ్రతకాలి గదా? నేను కొంచెం కష్టపడినాగానీ, మీరు సుఖపడుతున్నారు, నాకు తృప్తి, సంతోషంగా కలుగుతుంది, అందుకే మీరు నా కొమ్మ ఒకటి విరిస్తే నేను నాలుగు కొమ్మలు వేసి అందిస్తున్నాను

చిన్నారికి పెద్దగా అర్థం కాలేదు కానీ, ప్రక్కనే నుంచి వింటున్న రాజయ్యకు తన కుటుంబం కోసం ఎలా కష్టాలు సహించాలో ధనాన్ని ఎలా పొదుపు చేయాలో అంటే ఒక రూపాయిని పది రూపాయలుగా చేసుకునేందుకు ఎలా ప్రయత్నం చేయాలో అర్థం అయ్యింది ..

ఉషోదయం తో మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment