Tuesday, December 14, 2021

భగవద్గీత ఎందుకు చదవాలి?

📖 భగవద్గీత ఎందుకు చదవాలి?

కృష్ణం వందే జగద్గురుమ్

సంతోషంగా ఉన్నావా ...
భగవద్గీత చదువు.

బాధలో ఉన్నావా ...
భగవద్గీత చదువు.

ఏమీ తోచని స్థితి లో ఉన్నావా ...
భగవద్గీత చదువు.

ఏదో గెలిచినావా ...
భగవద్గీత చదువు.

ఏదో ఓడిపోయినావా ...
భగవద్గీత చదువు.

నువ్వు మంచి చేసినావా ...
భగవద్గీత చదువు.

నువ్వు చెడు చేసినావా ...
భగవద్గీత చదువు.

నువ్వు ఏదో సాధించాలి అనుకుంటున్నావా...
భగవద్గీత చదువు.

నువ్వు ఏది సాధించ లేక పోతున్నావా...
భగవద్గీత చదువు.

నువ్వు చాలా ధనవంతుడవా...
భగవద్గీత చదువు.

నువ్వు చాలా బీద వాడివా ...
భగవద్గీత విను.

నువ్వు సమాజాన్ని బ్రతికించాలని అనుకుంటున్నావా...
భగవద్గీత చదువు.

నువ్వు ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటున్నావా...
భగవద్గీత చదువు.

నువ్వు మోసం చేసినావా ...
భగవద్గీత చదువు.

నువ్వు మోసపోయినావా...
భగవద్గీత చదువు.

నీకు అందరూ ఉన్నారా...
భగవద్గీత చదువు.

నీవు ఒంటరివా....
భగవద్గీత చదువు.

నీవు చాలా ఆరోగ్యంగా ఉన్నావా...
భగవద్గీత చదువు.

నీవు వ్యాధిగ్రస్తుడవయ్యావా...
భగవద్గీత చదువు.

నీవు చాలా విద్యావంతుడవా...
భగవద్గీత చదువు.

నీవు విద్యా హీనుడవా ...
భగవద్గీత చదువు.

నీవు పురుషుడవా...
భగవద్గీత చదువు.

నీవు మహిళవా...
భగవద్గీత చదువు.

నీవు ముసలివాడివా ...
భగవద్గీత చదువు.

నీవు యవ్వనస్తుడివా ...
భగవద్గీత చదువు.

దేవుడు ఎక్కడ ఉన్నాడో నీకు తెలుసుకోవాలి అని ఉందా ...
భగవద్గీత చదువు.

దేవుడు లేడు అని అనుకుంటున్నావా ....
భగవద్గీత చదువు.

ఆత్మ అంటే ఏమిటి? తెలుసుకోవాలని అనుకుంటున్నావా...
భగవద్గీత చదువు.

పరమాత్మ తత్త్వం ఎలాంటిదో తెలుసుకోవాలని అనుకుంటున్నావా...
భగవద్గీత చదువు.

మనిషి జీవితం ఎందుకో తెలుసుకోవాలని అనుకుంటున్నావా ...
భగవద్గీత చదువు.

కర్మ అంటే ఏమిటో తెలుసుకోవాలని ఉందా... భగవద్గీత చదువు.

ఈ సృష్టి ఎలా వచ్చిందో తెలుసుకోవాలని వుందా...
భగవద్గీత చదువు.

పుట్టకముందు మనం ఎవరో తెలుసుకోవాలని వుందా...
భగవద్గీత చదువు.

చనిపోయిన తర్వాత మనం ఏమవుతామో తెలుసుకోవాలని వుందా...
భగవద్గీత చదువు.

దేవుడంటే అసలు ఎవరో తెలుసుకోవాలని వుందా...
భగవద్గీత చదువు.

నీలో కామం, క్రోధం, లోభం, మొహం, మధం, మాత్సర్యము వంటి అరిషడ్వర్గాలు ఉన్నాయా...
భగవద్గీత చదువు.

నీవు ప్రేమిస్తున్నావా...
భగవద్గీత చదువు.

నీవు ద్వేషిస్తున్నావా...
భగవద్గీత చదువు.

నీలో వైరాగ్యం ఉందా...
భగవద్గీత చదువు.

జ్ఞానం మరియు అజ్ఞానం అంటే ఏమిటో తెలుసుకోవాలని వుందా...
భగవద్గీత చదువు.

బంధాలు, అనుబంధాలు ఎలా ఉండాలో తెలుసుకోవాలని వుందా...
భగవద్గీత చదువు.

ధర్మం అంటే ఏమిటో తెలుసుకోవాలని వుందా...
భగవద్గీత చదువు.

మోక్షం అంటే ఏమిటో, స్వర్గం అంటే ఏమిటో, నరకం అంటే ఏమిటో తెలుసుకోవాలని ఉంటే ...
భగవద్గీత చదువు.

పంచ భూతాలు అంటే ఏమిటి, అవి ఎందుకు ఉన్నాయి? తెలుసుకోవాలంటే....
భగవద్గీత చదువు.

ప్రకృతి, పురుషుడు, భగవంతుడు అనే వాటి యొక్క సంబంధం ఏమిటో తెలుసుకోవాలంటే...
భగవద్గీత చదువు.

ఇక చివరగా...
నీవు ఎవరు,

ఎక్కడ నుండి వచ్చావు,
ఎక్కడికి పోతావు,

నీవారు ఎవరు,
నీ అసలు గమ్యం ఏమిటి

అని తెలుసుకోవాలి అంటే....

*భగవద్గీత చదువు...

సేకరణ

No comments:

Post a Comment