Friday, December 31, 2021

అవేర్నెస్*🌟 ✍️ *రచన: ఓషో*

🌸🌿🍎🌺🍃🍏🌹☘️🍓

🌟📚 అవేర్నెస్🌟

✍️ రచన: ఓషో

భాగం-36

✨ ఏ సమస్య క్లిష్టమైనది కాదని మీరు చెప్పిన తక్షణమే ఆ సమస్య 99% నిర్జీవమైపోయినట్లే. ఆ సమస్య గురించి మీ యొక్క పూర్తి దృష్టి మారిపోతుంది. ఆ సమస్యలో మీరు తాదాత్మ్యం చెందుతున్నారు కాబట్టి, సమస్య ఉన్నట్లు కనిపిస్తోంది; అనిపిస్తుంది. ఆ సమస్యకి గతంతో సంబంధం లేదు. చరిత్రతో సంబంధం లేదు. మీరు ఆ సమస్యతో తాదాత్మ్యం చెందారు. అదీ యదార్థమైన విషయం ఆ తాదాత్మ్యం లేకుండా ఉండటమే సమస్యల్ని పరిష్కరించడానికి అసలైన కిటుకు.
✨ ఉదాహరణకి మీరొక కోపిష్టి మనిషి అనుకోండి. ఒకవేళ మీరు మానసిక పరిశోధకుని దగ్గరకు వెళితే అతడు అంటాడు"గతంలోకి వెళ్ళు. ఆ కోపం ఎలా వచ్చింది?ఏ పరిస్థితులలో అది ఇంకా ఎక్కువ ఎక్కువ నిబంధనలకు, షరతులకు లోబడి, నీ మనస్సులోకి అచ్చులా నాటుకుపోయింది? మనం ఆ ముద్రలన్ని అలా కడిగిపారేయాలి. మనం అన్నింటినీ తుడిచి పెట్టేయాలి మనం ఆ గతాన్ని పూర్తిగా శుభ్రంగా తీసివేసెయాలి."
✨ ఒకవేళ మీరు తూర్పు మార్మికుడైన జ్ఞానోదయం పొందిన వ్యక్తి దగ్గరికి వెళ్తే, అతడు అంటాడు "నువ్వే కోపం" అని నువ్వు ఆలోచిస్తే, నువ్వు ఆ కోపంతో తాదాత్మ్యత చెందితే అక్కడే విషయాలు తప్పుదారి పట్టినట్లు. ఇంకోసారి కోపం వస్తే, మీరొక గమనించేవారిలా, సాక్షిలా ఉండండి. ఆ కోపంతో తాదాత్మ్యం చెందకండి. "నేనే కోపాన్ని"అని అనకండి. నేను కోపంగా ఉన్నాను అని అనకండి. ఆ కోపాన్ని కేవలం టీ.వీ. తెరపై జరిగే విషయంలా చూడండి. మిమ్మల్ని మీరు వేరే వ్యక్తి వైపు ఎలా చూస్తారో అలా చూడండి. ✨మీరు శుద్ధమైన, నిర్మలమైన చైతన్యం. కోపం అనే మబ్బు మీ చుట్టూ కమ్మినప్పుడు, దాన్ని కేవలం అలా పరిశీలించండి. దానితో తాదాత్మ్యత చెందకుండా జాగ్రత్తగా ఉండండి. సమస్యతో ఎలా తాదాత్మ్యత చెందకుండా ఉండాలో అదే మొత్తం విషయమంతానూ. దాన్ని ఒకసారి మీరు నేర్చుకుంటే అప్పుడింకచాలా సమస్యలు ఉన్నాయి అన్న ప్రశ్నే లేదు. ఎందుకంటే ఆ ఉపాయమే, ఆ తాళం చెవియే అన్ని తాళం కప్పుల్ని తెరుస్తుంది. కోపంతోనూ, దురాశతోనూ, కామంతోనూ, అన్నింటికీ - తాదాత్మ్యత చెందకుండా ఉండటమే ఒక కిటుకు. ఒక మనస్సు చేయగలిగే ప్రతి విషయానికి ఇదే ఉపాయం.
(సశేషం)
💠💠💠💠💠💠💠💠

సేకరణ

No comments:

Post a Comment