Tuesday, December 28, 2021

✍️...నేటి చిట్టికథ

✍️...నేటి చిట్టికథ

గంగలో స్నానమాచరిస్తున్న లక్షలాది మందిని చూసిన ఒక ఋషి కి ఒక సందేహం వచ్చింది!

వెంటనే గంగానదినే అడిగాడట!

అమ్మా! ఎందరో ఎన్నో పాపాలు చేసి నదిలో మునకలేస్తున్నారు. వారి వారి పాపం వదిలేస్తున్నారు. మరి ఇందరి, ఇంత పాప భారం ఎలా మోస్తున్నావు? తల్లీ! అని.

అందుకా తల్లి "నాయనా నేనెక్కడ ఆ పాపభారం మోస్తున్నాను? అవి అన్నీ తీసుకెళ్ళి ఎప్పటికప్పుడు సముద్రంలో కలిపేస్తున్నాను" అని బదులిచ్చిందట.

అయ్యో అన్ని పుణ్య నదులు ఇంతేకదా! పాపా లన్నీ సముద్రంలోనే కలిపేస్తే ఆ సముద్రుడు ఎలా భరిస్తున్నాడో?అనుకొని!

సముద్రాన్నే అడిగాడు!

ఎలా మోస్తున్నావు? ఈ పాపభారాన్ని!?! అని!

దానికా సముద్రుడు!

నేనెక్కడ భరిస్తున్నాను?! ఆ పాపాలను వెంట వెంటనే ఆవిరిగా మార్చి, పైకి మేఘాల లోనికి పంపిస్తున్నాను' అని బదులిచ్చాడట.

అరే!!! ఎంతో తేలికగా కదిలి పోయే మేఘాలకు ఎంత కష్టం వచ్చింది! అని అనుకుంటూ!

ఓ మేఘ మాలికల్లారా ఎలా భరిస్తున్నారు? ఈ పాప భారాన్ని! అని అడగగా!!!

అవి పకపకా నవ్వి! మేమెక్కడ భరిస్తున్నాం? ఎప్పటి కప్పుడే మీ మీదే కురిపించేస్తున్నాం వర్ష రూపేణా'! అని బదులివ్వగా...

ఓహో!!!
ఆ పాపాలన్నీ మన మీద పడి మనమే అనుభవిస్తున్నా మన్నమాట!

అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా! ఎవరూ కూడా! కర్మ ఫలితాలు వదిలించు కోలేమని!!!! గ్రహించాడు అక్కడ స్నాన మాచరిస్తున్న ఋషి!

ఇదం తీర్ధమిదం తీర్ధం భ్రమన్తి తామసా జనాః ఆత్మతీర్ధం నజానన్తి కధం మోక్షః శృణు ప్రియే.

పరమశివుడు పార్వతీ దేవికి ఉపదేశించిన శ్లోకమిది!.

ఈ తీర్ధంలో స్నానమాచరించిన పుణ్యం కలుగును! ఆ తీర్ధంలో స్నానమాచరించిన మోక్షం కలుగును!
అని... తీర్ధ స్నానమునకై పరుగు లెత్తెడు మానవులు "భ్రమకు లోబడిన వారు"!

ఆత్మ జ్ఞాన తీర్ధంలో స్నాన మాచరించని వారికి మోక్ష మెటుల కలుగును?!? అని ఈ శ్లోకం అర్థం.

కర్మ కర్మణా నశ్యతి కర్మ!

అంటే ..
కర్మ అనేది కర్మతోనే నశిస్తుంది.

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment