Tuesday, December 14, 2021

నేటి జీవిత సత్యం. *మ ని షి వి లు వ !!

నేటి జీవిత సత్యం.
మ ని షి వి లు వ !!

ఒక కోటీశ్వరుడు నడుచు కుంటూ వస్తూఉండగా ఒక ఇంటి ముందుకు రాగానే తన కాలి చెప్పులు తెగిపోయాయి !
ఆ ఇంటిలోని యజమానిని పిలిచి
నా చెప్పులు తెగిపోయాయి ఇక్కడ వదిలి వెళ్తానండి
పారేయొచ్చు కానీ కొత్తవి ! అందుకే మనసు రావట్లేదు
రేపు పనివారిని పంపించి తీసుకువెళతాను అని అడిగాడు !

అందుకు ఆ ఇంటి యజమాని
అయ్యా మీరు ఎంత పెద్ద కోటీశ్వరులు మీ చెప్పులు మా ఇంటి ఆవరణలో ఉంటె మాకే గౌరవం అని చెప్పాడు !

ధనవంతుడు తన పనిలో పడి ఆ విషయాన్నీ మరిచిపోయాడు !!

ఒకరోజు హఠాత్తుగా ఆ ధనవంతుడు చనిపోయాడు !

అయన శవం ఊరేగింపు జరుగుతున్నది భారీ వర్షం మొదలయింది !
ఎవరూ అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి !

అయన ఆరోజు చెప్పులు వదిలిన ఇంటి ముందు శవాన్ని తీసుకొచ్చి ఆపి ఆ ఇంటి యజమానిని పిలిచారు !!

వర్షం ఎక్కువగా ఉందండి !
వర్షం ఆగే వరకు శవాన్ని
మీ ఇంటి ముంగిట కాసేపు ఉంచుకుంటాం అని అడిగారు !

అందుకు ఆ ఇంటి యజమాని కోపం కట్టలుతెంచుకున్నాయి !!

మొదట శవాన్ని తీయండి ! ఎవరి ఇంటి శవాన్ని ఎవరింటి ముందు ఉంచేది మీరు
అని కసురుకున్నాడు !!

అంతే అండి ప్రాణం ఉన్నంత వరకు చెప్పుల కున్న విలువకూడా
ప్రాణం పోయాక ఉండదు !

నీ వెనుక ఎంత డబ్బు ఉన్నా ......!!

అంతే..

డబ్బుకు విలువ ఎక్కువ అనుకుంటారు కానీ నిజానికి ప్రాణంకే విలువ ఎక్కువ !

ప్రాణం పోయాక
కోట్లుఉన్నా వృధానే !!

తెగిన చెప్పుకున్నవిలువ
మనిషికిలేదా !!😢


మనిషికే ... విలువిద్దాం !

మానవత్వం నిలబెడదాం*

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment