ప్ర: "మాకిష్టమైన మతాలను మేము ఎందుకు ఎంచుకోకూడదు? మాకు ఇష్టమైన మతాలలోకి ఎందుకు మారకూడదు?" - అని చాలా మంది పిల్లలు ఇలా మాట్లాడుతున్నారు. "హిందూ ధర్మం అన్నిటిని కలుపుకుంటుంది, అన్నింటిలో భగవంతుని చూడమంటుంది..... అలాంటప్పుడు నేను ఇంకొక మతంలో మారితే మీకొచ్చే సమస్య ఏమిటి?" - అని పిల్లలు ప్రశ్నిస్తున్నారు. వారికి ఏమని సమాధానాం చెప్పాలి?
జ: ఇంకొక మతంలో ఎందుకు మారకూడదు? అని ప్రశ్నిచేటప్పుడు ఎందుకు మారాలి? అనే ప్రశ్న వేయాలి.
ఎందుకంటే అన్నీ ఇక్కడే ఉన్నప్పుడు ఇంకో దానిలో మారడం ఎందుకు? తాత్వికంగా అన్నింటిలో కొన్ని కొన్ని అంశాలు కలవచ్చేమో గానీ, ఏ ధర్మం పద్ధతి దానిదే.
మన సనాతన ధర్మం సంపూర్ణమైన ధర్మం. మన ధర్మంలో మనం జీవించాలి.
ఎందుకు చేయకూడదు? అని ప్రశ్నిస్తే ఎందుకు చేయాలి? అని వారికి ప్రశ్న వేయాలి. ఇక్కడి నుండి అక్కడకు వెళ్ళవలసిన అవసరం ఏమున్నది? ఇక్కడ లేనిది అక్కడ ఏమి దొరికింది నీకు? అన్నీ ఇక్కడే ఉన్నాయి అని నువ్వే చెప్పినప్పుడు అవి ఇక్కడే ఉండి ఇక్కడే పొందవచ్చు కదా? అని వారికి ప్రశ్న వేయాలి.
హిందూ ధర్మంలో లేని ఆలోచన లేదు. ఉదాహరణకి - ఇంత మంది దేవుడ్లను పూజించడం ఏమిటి? ఒక్కరిని పూజిస్తే చాలు కదా? అని ప్రశ్న వేస్తే - "ఇంత మంది ఉన్నారు కనుక ఇష్టమైన ఒక్కరిని ఎంచుకోవచ్చు". ఒక్కడే దేవుడిని పూజించే వారికి ఎన్నో దేవతలని పూజించాలి అనే బుద్ధి పుడితే ఆ మతంలో సమాధానం లేదు. కానీ ఎందరో దేవుడ్లని పూజించే వారిలో ఒక్క దేవుడినే పూజించుకోవాలనిపిస్తే వీరికి అవకాశం ఉంది. ఒక్కడినే ఎంచుకుంటాడు.
కనుక ఏది కావాలన్నా హిందూ ధర్మంలో కనబడుతూనే ఉంది. ఇక్కడ లేనిదేది అక్కడ లేదు.
కనుకనే స్వామి వివేకానంద హిందూ ధర్మం గురించి చెబుతూ - "The Mother Of All Religions" అని అన్నారు. అన్ని మతాల మధ్యలో విదేశాల్లోని ఆ మాట చెప్పగలిగారు. వాళ్ళూ అంగీకరించారు. ప్రపంచంలో కనబడుతున్న ప్రతీ మతము యొక్క భావము హిందూ మతంలో ఇప్పటికీ ఉన్నది.
"మరి ఇదే అక్కడ కూడా ఉన్నప్పుడు వాటిల్లోకి మారిపోతే సమస్య ఏమిటి?" - అని ప్రశ్నిస్తే - "వేరేవి కేవలం సనాతన ధర్మంలో నుంచి పుట్టిన ఒక చిన్న పాయ... సనాతన ధర్మం పెద్ద నది. కనుక సనాతన ధర్మంలో ఒక సమగ్రత ఉన్నది. సమగ్రతలో నుండి భాగంలోకి వెళ్లిపోకుండా సమగ్రతలోనే ఉండగలగాలి.
కనుకనే ఇతర మతస్థులు ఈ ధర్మం లోకి వస్తే తప్పకుండా మనం స్వీకరించవచ్చు. అక్కడి వారు ఇక్కడికి రావడమంటే వారి మూలాలకు వారు వస్తున్నారు.
"మత మార్పిడి" అనేది మతానికి సంబంధించిన సమస్య కాదు. అది సమాజానికీ, జాతికీ ప్రమాదహేతువు. ఏ మతమైన ఆ మతంలో ఉన్నవారితో నిలబడదు. ఆ మతాన్ని అనుష్ఠించేవారితో నిలబడుతుంది. ఎందరో హిందువులు ఉన్నారు.... కానీ హిందువుగా జీవిస్తున్న వారు ఎంతమంది? మతం మారడం వల్ల మతానికేమీ ప్రమాదం లేదు. అది దేశానికీ ప్రమాదం.
ఒక్కసారి ఈ మతం నుండి ఆ మతంలోకి మారితే వెంటనే తన పూర్వ మతంపై ఒక ద్వేషం భావం ఏర్పడుతుంది. ఆ పూర్వ మతంలో ప్రతీ దానిని చెడుగా చూడడం మొదలుపెడతాడు. ఇంక వాటిని విమర్శిస్తూ ఉంటాడు. దానితో ఘర్షణ ఏర్పడుతుంది.
అంతేకాకుండా ఈ దేశంతో అనుబంధం తెగుతుంది. ఇది ఎలాగో పరిశీలిద్దాం - ఇక్కడ పూర్వ మతంలో ఉన్నప్పుడు "తిరుపతికి వెళ్తున్నాను.....కాశీకి వెళ్తున్నాను....." అని అంటాడు. అంటే వాని విశ్వాసం ఈ దేశంతో ముడి పడి ఉంది. ఎప్పుడైతే వేరే మతాల్లోకి మారిపోతాడో ఆ మారిన మతం తాళుక పవిత్ర కేంద్రాలు ఉన్న దేశాలతో మమకారం ఏర్పడుతుంది. ఆ దేశాల సంస్కృతులపై గౌరవం ఏర్పడుతుంది. అప్పుడు ఈ దేశంతో అనుబంధం తెగుతుంది. ఈ దేశం పై ఒక హేళన భావం ఏర్పడుతుంది. మొత్తం దీని చరిత్ర మీద హేళన భావం ఏర్పడుతుంది. బొట్టు పెట్టుకోమన్నా.... తోరణం కట్టుకోమన్నా....గుమ్మానికి పసుపు రాసుకోమన్నా.....దీపం వెలిగించమన్నా ఈ దేశపు సంస్కృతిగా చూడడు. మతంగా చూసి వాటినీ హేళన చేస్తాడు.
కనుక మత మార్పిడి వలన ప్రజల మధ్య వైషమ్యాలు ఏర్పడుతాయి. దేశంతో అనుబంధం తెగడం వల్ల పై దేశాలు ఈ దేశం మీద దాడి చేయడానికి అవకాశం ఇచ్చిన వారమౌతాము.
కనుక దేశ భద్రత కోసమైనా మనం మత మార్పడిలు జరగకుండా చూసుకోవాలి.
అన్ని మతాలు ఒక్కటే అన్న మాట ఒక్క హిందువు తప్ప ఇంకోడు అనడు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి ప్రశ్నలు మన పిల్లలే అడుగుతారు!! వాళ్ళ పిల్లలు అడగరు... అన్ని మతాలు ఒక్కటే అన్నప్పుడు మేమెందుకు హిందువులుగా మారకూడదు? అని వాళ్ళ పిల్లలు అడగరు. మన పిల్లలే అడుగుతారు. అంటే మన హిందు ధర్మం పై వాళ్ళు వారి మతం పై కలిగించిన ప్రేమ మనం కలిగించట్లేదు.
నేను మా అమ్మని 'అమ్మ' అని పిలుస్తాను. మరి అందరూ ఆడవాళ్ళు అమ్మలే కదా!! ఎవరినైనా 'అమ్మ' అనే పిలువచ్చు కదా? అని అంటే - "కనిపించే ప్రతీ స్త్రీలో మాతృత్వాన్ని చూడడం సంస్కారమే. కానీ తనదైన తల్లిలో అసలు మాతృత్వం ఉంటుంది.
సేకరణ

No comments:
Post a Comment