Wednesday, December 8, 2021

మంచి మాట..లు

ఆత్మీయ బంధుమిత్రులకు సోమవారపు శుభోదయ శుభాకాంక్షలు 🤝మీకు మీ కుటుంబసభ్యులకు అది దంపతులు పార్వతి పరమేశ్వరుల అనుగ్రహంతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ
ఆదివారం --: 06-12-2021 :-- ఈరోజు AVB మంచి మాట..లు
అందరి కన్నీళ్లు మనం తుడవకపోయినా పర్లేదు కానీ! ఏ ఒక్కరి కన్నీళ్లకు మనం కారణంగా ఉండకూడదు

మనం కంటితో చూడనివి చెవులతో విననివి ఎప్పుడూ నమ్మవద్దు . ఇతరులకు చెప్పవద్దు ఎందుకంటే కొంతమంది చెప్పేమాట వల్ల కొన్ని స్నేహాలు చెడిపోతాయి కుటుంబ బంధాలు తెగిపోతాయి .

మనిషి అందంగా కనపడాలంటే ఎన్నో రకాల తెరలు తొలగించాలి , కానీ మనసు అందంగా కనపడాలంటే మాత్రం అహం , అసూయ , ఈర్ష్య , ద్వేషం అనే అడ్డు పొరలను తొలగిస్తే చాలు .

మన వ్యక్తిత్వానికి మించిన అందం లేదు , మనలో సాధనకు మించిన అదృష్టం లేదు , నీ ప్రేమకు మించిన తోడు లేదు , నీల్లో ప్రతిభకు మించిన ధనం లేదు , మన విజయానికి మించిన ఆనందం లేదు , నీ ధైర్యానికి మించిన శక్తి లేదు , మన త్యాగానికి మించిన గొప్పతనం లేదు .

నాదే కరెక్ట్ అనుకోవడం అహంకారం ఎదుటివారు ఎందుకూ పనికి రాని వారు అనుకోవడం అవివేకం తనవైపు నుంచే ఆలోచిస్తూ ఎదుటి వారి గురించి పట్టించుకోక పోవడం స్వార్థం .

మీ ... AVB సుబ్బారావు

సేకరణ

No comments:

Post a Comment