Saturday, January 1, 2022

సెయింట్ రబియా (ప్రేమతో నిండిన హృదయం యొక్క గొప్పతనం)

365 రోజులు✈️హార్ట్ ఫుల్ నెస్🌍కథ తో

♥️ కథ-22 ♥️

అనుభూతి - నా హృదయం అనంతమైన శక్తితో నిండి ఉంది,
దానికి నేను కృతజ్ఞతతో ఉంటాను.

సెయింట్ రబియా (ప్రేమతో నిండిన హృదయం యొక్క గొప్పతనం)


హృదయంలో ప్రేమ ఉంటే దుష్టులలో కూడా ద్వేషం కలుగదు.

రబియాను ఇస్లాంలో గొప్ప సాధువు అని అంటారు. ప్రపంచంలోని మహిళా సాధువులలో చరిత్రలో కూడా ఆమెకు ప్రత్యేక స్థానం ఉంది.
రబియా వల్లనే సూఫీ సిద్ధాంతం వెలుగులోకి వచ్చిందని, ప్రపంచం ఆమెను ఎంతో గౌరవప్రదంగా స్మరించుకుంటుంది.

ప్రతిరోజూ భగవంతుని ప్రేమ, స్మరణలో జీవించిన అత్యంత గౌరవనీయమైన మహిళా సాధువు ఐన ఆమె సుమారు 717 AD లో జన్మించింది, 84 సంవత్సరాల వయస్సులో 801 AD లో మరణించింది.

ఆమె తన తల్లిదండ్రులకు నాల్గవ సంతానం, రబియా చాలా పేద కుటుంబంలో జన్మించింది. ఆమె చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో తల్లి ప్రేమ, ఆప్యాయతలకు దూరమై ఒంటరిగా బాల్యాన్ని గడిపింది.

కానీ దురదృష్టవశాత్తు, ఆమె కష్టాలు ఇక్కడితో ఆగలేదు.

ఆమె దేశంలో భయంకరమైన కరువు, క్షామం వచ్చింది, ఆమె కుటుంబ సభ్యులందరూ ఒకరికొకరు చెల్లాచెదురై, విడిపోయారు.
చిన్నారి రబియా అపహరించబడి, కేవలం 6 దిర్హామ్‌లకు (అరబ్బుల నాణెం) బానిసగా విక్రయించబడింది.

ఆమెను కొనుగోలు చేసిన యజమాని హృదయం లేని ఒక క్రూరమైన వ్యక్తి.

ఆమెయందు చాలా అమానవీయంగా వ్యవహరించేవాడు. ఆమె రోజంతా పని చేయాల్సివచ్చేది, తరచుగా తినడానికి ఏమీ ఉండేది కాదు.
అటువంటి పరిస్థితులలో శారీరక శ్రమ చేయడమే చాలా కష్టంగా ఉండేది, ఐనప్పటికీ ఆమె హృదయం ఎల్లప్పుడూ భగవంతుని స్మరణలో మునిగిఉండేది.

ఆమె అర్థరాత్రి వరకు మెలకువగా ఉండి, ఎక్కువ సమయం ఆయనను ప్రార్థిస్తూ, ధ్యానిస్తూ గడిపేది .

ఒక రోజు, ఆమె యజమాని రాత్రికి ఆలస్యంగా ఇంటికి తిరిగి వచ్చాడు.
యాదృచ్ఛికంగా రబియా నివసించే గదిని దాటగా, గదిలోంచి ఏవో మాటలు, గుసగుసలు వినిపించాయి.

వెంటనే అతని మనసులో అనుమానం వచ్చింది: నా దాసీ ఇంత రాత్రి వరకు మెలకువగా ఉండి ఎవరితో మాట్లాడుతోంది?
గదిలోంచి వినిపించిన దానికీ, కిటికీలోంచి చూసిన ఆ దృశ్యానికి అతను ఆశ్చర్యపోయాడు.

పూర్తిగా భక్తిలో మునిగిపోయిన చిన్నారి రబియాను చూసాడు.
దేవదూతలా మోకాళ్లపై కూర్చుని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్న ఆమెను ఒక దివ్యమైన వెలుగు ఆవరించింది ఉంది.

ఆమె, "ఓ ప్రభూ, నా యజమానిని క్షమించి, అతనిని ఆశీర్వదించండి." అని గుసగుసలాడుతూ ప్రార్థిస్తోంది.
రబియా నిజానికి అతని కోసం ప్రార్థిస్తోంది! ఆమె పట్ల చెడుగా ప్రవర్తించిన, పదే పదే కొట్టి, చెప్పలేనంతగా హింసించిన అదే యజమాని కోసం;
ఐన కూడా అతను ఆశీర్వదించబడాలని, క్షమించబడాలని కోరుకుంటోంది !

" అల్లా! నా యజమానిని కరుణించి, అతనికి శ్రేయస్సు ప్రసాదించు, అతని తప్పులను క్షమించి, సన్మార్గంలోకి తీసుకురండి, మీ వద్దకు వచ్చేలా ఏదైనా చేయండి ప్రభూ. మీరు ఎల్లప్పుడూ ప్రేమతో నిండి ఉంటారు, దయచేసి అతనికి మీ హృదయంలో స్థానం ఇవ్వండి. !"

ఆ ప్రార్థన విని యజమాని సిగ్గుతో, అపరాధభావంతో వణికిపోయాడు. తిరిగి తన గదిలోకి వెళ్ళాడు.
రబియాకు చాలా అన్యాయం చేశాడని, ఘోరమైన నేరానికి పాల్పడ్డాడని గ్రహించి అతను రాత్రంతా నిద్రపోలేకపోయాడు.

ఆమె సాధారణ బానిస కాదని, నిజంగా భగవంతుని ఆశీర్వాదం పొందిన బిడ్డ అని, దివ్యమైన ఆత్మ అని, అలాంటి ఆమెను బానిసగా ఉంచి, పని చేయించుకుంటున్నాడని అర్థం చేసుకున్నాడు.

అతను మరుసటి రోజు ఉదయం రబియా గదికి వెళ్లి, ఆమె పాదాలపై పడి క్షమాపణ చెప్తూ : " తల్లీ ! నీవు భగవంతుని పుత్రికవు. నేను నీకు,అల్లాకు చేసిన తప్పుకు నన్ను క్షమించు.

ఈ రోజు నుండి నువ్వు నా ఇంట్లో ఒక బానిసలా కాకుండా గౌరవనీయమైన అతిథిగా ఉండు, దయచేసి నాకు కూడా ఆ గొప్ప అల్లాకు సేవ చేసే అవకాశం ఇవ్వు." అని అభ్యర్ధించాడు.

♾️

ధ్యానం చేసే హృదయంలో ప్రేమ మహోన్నతంగా ప్రకాశించినప్పుడు, అది దేనిని తాకినా అది అద్భుతంగా మార్పుచెందుతుంది. 🌼
దాజీ

హార్ట్ ఫుల్ నెస్ ధ్యానం

అనువాద బృందం
ఆంధ్రప్రదేశ్

సేకరణ

No comments:

Post a Comment