టీచర్ తిట్టినా, కొట్టినా బాగానే ఉంటుంది: పూరీ జగన్నాధ్
టీచర్‌పై ఫిల్మ్ డైరెక్టర్ పూరీజగన్నాథ్ విశ్లేషణ
ఉపాధ్యాయులంటే మన రక్త సంబంధీకులని.. వాళ్లను గౌరవించకపోతే మన మీద మనకు గౌరవం లేనట్లేనని పూరీ జగన్నాథ్ అన్నారు. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా పాఠాలు చెప్పేందుకు టీచర్లు కూడా ప్రతి రోజూ సాధన చేస్తూనే ఉంటారన్నారు. తన వెబ్‌కాస్ట్. పూరి మ్యూజింగ్స్ లో భాగంగా ఈ సారి ‘టీచర్లు’ అనే అంశంపై ఆయన తన విశ్లేషణ పంచుకున్నారు. ఇంతకీ ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే మీ కోసం..
‘‘ జీవితంలో మీరు బాగుపడి ఉన్నత స్థానంలో ఉంటే.. మీ అమ్మానాన్న కంటే ఎక్కువ ఆనందపడేది మీ టీచర్. మనతో అ.ఆ.లు దిద్దించి.. అంకెలు నేర్పించి. రోజుకో పాఠం చెప్పే టీచర్ మన తల్లిదండ్రి కంటే ఎక్కువ . మన అందరికీ టీచర్‌తో ఒక తెలియని అనుబంధం ఉంటుంది. ఒకడు చదువులో శుంఠ కావచ్చు. పనికిమాలిన వెధవకావచ్చు. అలాంటి వాడికి మాస్టారును చూడగానే ఓ గౌరవం వస్తుంది. టీచర్‌తో ఉన్న బంధం లెక్చరర్‌తో, ప్రొఫెసర్‌తో కూడా ఉండదు. ఇది వేరే అది వేరే. టీచర్ అంటే కుటుంబం. మనల్ని పెంచారు వాళ్లు. ఎన్నో నేర్పుతూ పెంచారు. టీచర్లో ఎన్నో లక్షణాలు ఉంటాయి. కమ్యునికేషన్ స్కిల్స్, లిజనింగ్స్కిల్స్, ఫ్రెండ్లీగా ఉండటం, ఓపిక, క్రమశిక్షణ, EMPATHY.. ఇలా ఎన్నో. క్లాస్‌లో మీరే కాదు.. మీ టీచర్ కూడా రోజూ చదువుకుంటూ ఉంటారు. కష్టమైన విషయాలు మీకు సులభంగా చెప్పడం కోసం ప్రతిరోజూ సాధన చేస్తూ ఉంటాడు. నవ్వుతూ పాఠాలు చెప్తారు. అందుకే మంచి టీచర్ ఉంటే క్లాస్ మిస్సవ్వబుద్ధి కాదు. మనకు నచ్చిన టీచర్ తిట్టినా, కొట్టినా ఎంతో బాగుంటది’’ అని ఆయన పేర్కొన్నారు.
‘‘టీచర్ దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకుంటాం. అందుకే గురువుకు చాలా ప్రాధాన్యత ఇచ్చే దేశాల్లో ఉపాధ్యాయులకు భారీగా జీతాలు చెల్లిస్తారు. మన దేశంలో కూడా అలా జరగాలి. {స్విట్జర్లాండ్, లక్సంబర్గ్, కెనడా, జర్మనీ, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, యూనైటెడ్ స్టేట్స్, ఐర్లాండ్, డెన్మార్క్....Etc.} వాళ్లకు ఎందుకు ఎక్కువ ఇస్తారంటే.. ఒక టీచర్ వల్ల యువత, దేశం మారతాయని నమ్ముతాయి కాబట్టి. మనం పాస్ అయినా.. ఫెయిల్ అయినా టీచర్ దగ్గర చాలా నేర్చుకుంటాం. అందుకే రౌడీగా మారి పది హత్యలు చేసిన వాడు కూడా టీచర్ కనిపిస్తే లేచి నమస్కారం పెడతాడు. ఒక మంచి ఉపాధ్యాయుడు గుండెల్లోంచి పాఠం చెబుతాడు.. పుస్తకంలోంచి కాదు. మన పాఠశాల రోజుల తర్వాత మనం మన ఉపాధ్యాయులను కలవకపోవచ్చు.. మాట్లాడకపోవచ్చు. కానీ.. వాళ్లంటే మనందరికీ తెలియని గౌరవం ఉంటుంది. మన గుండెల్లో ప్రత్యేక స్థానం ఉంటుంది. దానికి నిదర్శనం టీచర్లను చూడగానే పాత విద్యార్థుల పెదాలపై చిరునవ్వు రావడం. ఆప్యాయంగా మాస్టారు అంటూ దగ్గరికి వెళతారు. నీ టీచర్ మీద నీకు గౌరవం లేకపోతే.. నీమీద నీక్కూడా గౌరవం లేనట్టే. అమ్మ, నాన్న, తాతయ్య, నానమ్మ, అన్నయ్య.. వీళ్లతో పాటు మన టీచర్ కూడా మన రక్త సంబంధీకులే. హ్యాట్సాప్ టు ది బ్యూటిఫుల్ టీచర్. గ్రేట్ టీచర్ ఆల్వేస్ ఇన్స్పైర్స్’’ అంటూ ముగించారు.
సేకరణ

No comments:
Post a Comment