Sunday, January 30, 2022

మనం అందరం ఏది జరిగినా దేవుడి ప్రసాదమని స్వీకరించగలిగే ప్రవర్తన కలిగి వుండాలి

నా జీవితంలో ఎన్నో సందర్భాల్లో అనుభవ పూర్వకంగా తెలుసుకున్న సత్యం.

ఒక రాజు గారికి భీముడు అనే అంగ రక్షకుడు వుండేవాడు.వాడు నిజాయితీగా పనిచేసేవాడు.అందుకని రాజుగారికి అతడంటే చాల యిష్టం.అతనెప్పుడు తేది జరిగినా అది అంతా మన మంచికే అని అన్తూందే వాడు.
ఒకసారి రాజుగారి పాదానికి గాయమైకాలి బొటనవేలు తీసేయాల్సి వచ్చింది. రాజు బాధపడుతూంటే భీముడు
దిగులెందుకు మహారాజా! ఏది జరిగినా మన మంచికే జరుగుతుంది అన్నాడు. రాజుకి చాలా కోపం వచ్చింది
నా వేలు పోయి నేను బాధ పడుతుంటే నీకు ఎగతాళిగా వుందా?అంటే భీముడు మరీ అదేమాట అన్నాడు ఏది జరిగినా మన మంచికే అని. రాజుకు కోపం వచ్చి అతన్ని చెరసాలలో పెట్టమని ఆజ్ఞాపించాడు.అతన్ని చెరసాలలో పెట్టేటప్పుడు కూడా అతను యిదీ మన మంచికే అంటూ లోపలి వెళ్ళాడు.కొన్నాళ్ళ తర్వాత రాజు వేటకి వెళ్ళాడు..అక్కడ దారి తప్పి అడవిలో చాల దూరం వెళ్ళిపోయాడు.అతని సైనికులూ,అంగ రక్షకుడూ
యేవరూలేరు.అక్కడికి కొంత మంది ఆటవికులు వచ్చి అతన్ని బంధించి తీసుకొని వెళ్ళారు.వారి నాయకుడి ముందు నిలబెట్టారు.అతడు ఇతన్ని మన దేవతకు బలి యిచ్చేద్దాం అని అన్నాడు. సరే అతనికి స్నానం అదే చేయించి దేవత దగ్గరికి తీసుకని రండి అని ఆజ్ఞాపించాడు.వారు అతనికి స్నానం చేయించేటప్పుడు అతని కాలికి బొటనవేలు లేక పోవడం గమనించారు.నాయకుడి దగ్గరకు వెళ్లి యితనికి అంగ వైకల్యం వుంది ఇతను బలి యివ్వటానికి పనికి రాడు. అన్నారు. సరే అయితే అతన్ని వదిలి వేయండి అని ఆజ్ఞాపించాడు. రాజు బ్రతికి జీవుడా నాయి తన గుర్రం యెక్కితిరిగి తిరిగి ఎలాగో ఒకలాగా తన రాజ్యానికి
చేరుకున్నాడు.అప్పుడు అతనికి తన కాలికి బొటనవేలు లేకుండా వుండడం వల్ల తను బ్రతికి బయట పడ్డాడు కదా! మరి భీముడు చెప్పింది నిజమే కదా!తనకు వేలు లేక పోవడ వల్ల తనకు మంచే జరిగింది అని అతన్ని చేరసాలనుంచి విడిపించి అతన్ని క్షమాపణ కోరాడు.భీముడు క్షమాపణ యెందుకు మహారాజా యిది కూడా నామంచికే గదా జరిగింది.అన్నాడు.అదెలా? అని రాజు అడిగాడు.నేను చెరసాల లో వుండకుడా వుంటే నేను మీ వెంట వేట కు వచ్చేవాడిని.
. అడవిలో మీ అంగ రక్షకుడిగా నా ధర్మం నిర్వర్తించేందుకు మీ వెంటే వుండేవాడిని.
అప్పుడు ఆ ఆటవికులు మిమ్మల్ని వదిలేసి బాగున్న నన్ను బలి యిచ్చేవారు కదా! మీరు నన్ను చెరసాలలో పెట్టి నందున నాకు మేలే జరిగింది.మీరు నా ప్రాణం కాపాడినట్టే కదా! నాకు మేలే జరిగింది.
మీరేమీ బాధపడకండి. ఏది జరిగినా మన మంచికే అని నేనందుకే చెప్తూ వుంటాను.అన్నాడు.రాజు అతనికి
మంచి బహుమానం యిచ్చి జీతం ఎక్కువచేసి గౌరవించాడు.దీని వల్ల నీతి యేమంటే. మనం అందరం ఏది జరిగినా దేవుడి ప్రసాదమని స్వీకరించగలిగే ప్రవర్తన కలిగి వుండాలి

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment