Sunday, January 30, 2022

సనాతన ధర్మం* - _ఖాలిద్ ఉమర్_

 _Forwarded_


*సనాతన ధర్మం*

- _ఖాలిద్ ఉమర్_


సనాతన ధర్మం లేదా హిందూ ధర్మం ఒక నిర్దిష్ట వ్యక్తి చే సృష్టించబడలేదు. ప్రకృతి నుండి ఉద్భవించిన ఏకైక విశ్వాసం హిందూ ధర్మం.. అలాగే హిందువులు ఆరాదించే దేవీ దేవతలు, ఆనందంగా జరుపుకునే పండుగలు వండే వంటలు తినే ఆహారం, ఆచారాలు అన్నీ కూడా ప్రకృతి నుండి ప్రేరణ పొందాయి.


జననం నుంచీ మరణం వరకు పుడమి తల్లి తన ప్రాణులను ఎంత ప్రేమగా చూసుకుంటుందో అంతే ప్రేమగా ఈ భూమిని ప్రకృతిని.. తనను పోషించే ప్రతి జీవినీ చెట్టునూ పుట్టనూ ఆఖరకు సర్పంలో సైతం  తన మాతృమూర్తిని దర్శించుకునే అత్యంత సంస్కార జీవన విధానం సనాతన ధర్మానిది..


సనాతన ధర్మం కొన్ని పరిమితులకు లోబడి లేదా జీవుల మీద పరిమితులను విధించే 'బొన్సాయ్' మతం కాదు.. హిందూధర్మం  అన్నిరకాల ఫల పుష్పాలకు  తననుంచి జన్మనిచ్చింది.. నిజానికి హిందూ ధర్మం ఒక పురాతన మహా వృక్షం, దాని కొమ్మలు చాలా విశాలంగా  వ్యాపించి మధుర రసాలను ఇచ్చే  పండ్లు, సువాసన గల పుష్పాలను కలిగి ఉండే శాశ్వత కల్పవృక్షం..


ఆ మహావృక్షం  అనేక జాతులకు సురక్షితమైన ఆశ్రయం అవుతుంది, అలసిపోయిన పాదచారులపై చల్లని నీడను వేస్తుంది. హిందూ ధర్మం తన  స్వభావంలో ఉదాత్తమైనది.. దాని ఆత్మలో లౌకికమైనది.


ప్రకృతిలో మనం చూస్తున్నట్లుగా జీవితం అనేది జనన మరణాల చక్రం అని హిందూ ధర్మం మనకు ఉద్బోధిస్తుంది, గొప్ప పనులు లేదా తప్పుల ద్వారా జీవులకు పాఠాలు నేర్పే వ్యవస్థ సహజంగా హిందూ ధర్మం లో ఉంటుంది.. దీని వలన జీవుల సర్వతోముఖాభివృద్దికి ఆ లక్షణాలన్నీ దోహదం చేస్తాయి..


ప్రకృతిలోని ఈ సహజ పరిణామం చెందిన సమాజం వేలాది సంవత్సరాలుగా  ఈ భూమండలాన్ని సుసంపన్నం చేసింది.


హిందూ ధర్మంలో మానవ నిర్మిత మతాల వలే ఏదో ఒక  ప్రవక్తకు కేంద్ర అధికారం లేదు. అలాగే వేలాది సంవత్సరాలుగా సహజంగా వచ్చిన పరిపూర్ణత యొక్క అహం లేదు.. సత్యం.. శివం.. సుందరం మాత్రమే చివరి, నిత్య నూతన సనాతన సత్యం అని హైందవం నమ్ముతుంది..


అన్ని ఇతర మానవ నిర్మిత విశ్వాసాలు మానవుని యొక్క దూకుడు, నీచమైన, అహంకార, కుత్సితమైన, సంకుచితమైన,  శిక్షాత్మక స్వభావం యొక్క భారాన్ని మోస్తున్నాయి.


దురదృష్టవశాత్తూ హిందువుగా జన్మించినందుకు విశ్వం తమకు ప్రసాదించిన అనుగ్రహాన్ని గుర్తించలేని హిందువులు అందమైన సాక్షాత్కారాన్ని కోల్పోతున్నారు.


సనాతన ధర్మం అంటే ప్రకృతికి మరొక పేరు.. అందుకే ఇది శాశ్వతమైనది, అత్యంత శక్తివంతమైనది. ప్రకృతికి అనుగుణంగా విశ్వం యొక్క దైవిక మార్గదర్శకాల క్రింద పనిచేసే ధర్మంతో పోలిస్తే, మానవ నిర్మిత మతాల యొక్క కఠినమైన మాన్యువల్‌ల క్రింద ఉండవలసిన భారం దురదృష్టవశాత్తూ ఆ మతాలలో జన్మించిన వారికి ఒక శాపం..


ప్రకృతి తన కనికరంలేని జీవిత చక్రం నుండి తనను తాను పోషించుకోవడం..అలానే సమస్త జీవజాతులనూ పోషించడం  ఎప్పటికీ ఆగిపోదు లేదా లొంగిపోదు.. హైందవం లో మరణం కూడా ఒక కొత్త ప్రారంభం.. మరో జన్మకు ఇది శ్రీకారం.. మీరు చేసిన పాప పుణ్యాల ఫలితంగా మరు జన్మలో మీరు కర్మఫలాన్ని అనుభవించాల్సి వస్తుంది.. ఎంత అద్భుతమైన వివరణ!!..


కోట్ల సందేహాలకు ఒకేఒక్క సమాధానం 'కర్మఫలం ', 'పునర్జన్మ', చివరకు 'కైవల్యం', ఇంతకంటే శాస్త్రీయమైన ధర్మం ఈ భూమి మీద మరెక్కడ??..

లక్షలాది సంవత్సరాలుగా..కోట్లాది మునుల తపఃఫలం.. తాము దర్శించిన సత్యాన్ని సామాన్యులకు నిష్కామంగా అందించడం.. ఇదే కదా మానవాళికి హైందవం ఇచ్చిన అమృతగుళిక.. ధన్యోస్మి శివా.. ధన్యోస్మి..  


మానవ నిర్మిత వస్తువులు అనివార్యమైన నశించకుండా ఉండేందుకు స్థిరమైన నిర్వహణ అవసరం.. ఆ నిర్వహణ ధర్మాచరణ ద్వారా సిద్దిస్తుంది.


వివాహాలు విఫలం కావొచ్చు.. కానీ ప్రేమ ఎప్పుడూ విఫలం కాదు!! హిందూ ధర్మంలో మీకు కాంట్రాక్ట్ వివాహాలు ఉండవు.. ప్రేమ ద్వారా ఏర్పడే బంధం ఉంటుంది.. కుటుంబం పట్ల.. కుటుంబ వ్యవస్థ పట్ల బాధ్యత ఉంటుంది..

మరణానంతర జీవితం కంటే ఇప్పటి జీవితాన్ని  సుఖమయమూ..మంగళకరంగా ఎలా చేసుకోవాలని అనే విషయం పట్ల మిమ్మల్ని కార్యోన్ముకులను చేస్తుంది హిందూ ధర్మం.. మానవ నిర్మిత మతాలు  ప్రకృతి యొక్క ప్రయాణంతో పాటు తననుతాను ఏర్పాటు చేసుకున్న సహజసిద్ద వ్యవస్థలకు ఎలా పోటీ కాగలవు?? 


అవి దేవునికి భయపడేవి.. నమ్మకపోతే నరకానికి పంపుతాను అనేవి.. 

మరొకటి హైందవం భగవంతుడిని ప్రేమించేది.. భగవంతుడితో పాటు ప్రయాణం చేయించేది..

ఇప్పుడు ప్రపంచానికి రెండే రెండు అవకాశాలు..

ఒకటి ప్రకృతిని ప్రేమిస్తూ జీవనాన్ని సాగించడం..

రెండోది అన్నిటినీ ద్వేషిస్తూ జీవితాన్ని నరకప్రాయం చేసుకోవడం..

జై శ్రీరాం..


(పాక్ లోని లాహోర్ లో నివసించే జన్మతః హిందూ..ప్రమాదవశాత్తూ ముస్లిం..

గతంలో బలవంతంగా మతం మార్చబడ్డ ముస్లిం శ్రీ ఖాలిద్ ఉమర్ గారి వ్యాసానికి స్వేచ్చానువాదం..)

No comments:

Post a Comment