Saturday, January 29, 2022

మంచి మాట.. లు

ఆత్మీయ బంధుమిత్రుల భోగభాగ్యల భోగి సుఖసంతోషాలసంక్రాంతిమరియు శుక్రవారపు శుభోదయ శుభాకాంక్షలు 💐🌹 లక్ష్మి దుర్గ గాయత్రీ సరస్వతి అమ్మవార్ల అనుగ్రహంతో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ....
శుక్రవారం --: 14-01-2022 :--
కళలకు సంక్రాంతి పండుగ ప్రతీక భోగి మంటలు, రంగ వల్లులు , హరిదాసుల కీర్తనలు , గంగిరెద్దుల ఆటలు , గాలి పటాల సందళ్ళు, గోబ్బేమ్మ లు.. కొత్త అల్లుళ్ల బావ మరదళ్ళ సరస సరదా సంభాషణలు పట్టు పరికిణిల రేపరేపలు పైరు పచ్చల కళకళలు. కోడి పందేలు గ్రామాల్లో సంక్రాంతి శోభను తీసుకువచ్చాయని , భోగి సంక్రాంతి కనుమ పండుగలను ప్రతి ఊరిలో ఉన్న ప్రతి నా ఆత్మీయ కుటుంబం సంతోషంగా జరుపుకోవాలని .కోరుకుంటూ. అందరికి భోగిసంక్రాంతి పండుగ శుభాకాంక్షలు 🙏
ఈ రోజు AVB మంచి మాట.. లు
మన భోగి మంటల్లో పనికిరాని సామానులతో పాటుగా కంటికి కనిపించకుండా అంతులేని నష్టాన్ని కలగచేస్తున్నా కొరోనా ను కూడా దహనం చేద్దాం.. కరోనా కన్నా ప్రమాదమైన మానవుడి దృష్ట ఆలోచనలు.. ఈర్ష.. ద్వేషo.. కుళ్ళు.. కుతంత్రం.సోమరితనం..నిర్లక్ష్యం . లంచగొండి తనం.. స్వార్థం.. వీటిని కూడా భోగి మంటలల్లో దహనం చేద్దాం

జీవితంలో ఓడిపోవడం తప్పు కాదు ఓటమితో జీవితాన్ని ఆపేయడం తప్పు , నీతో ఉన్నవారు నిన్ను ఎందుకు కలిసామా అనేలా బ్రతకకూడదు నిన్ను విమర్శించిన వారు కూడా నిన్ను ఎందుకు వదులుకున్నామా అనేల బ్రతకాలి ఒక వ్యక్తి గురించి కథలు వినాలంటే వారితోనే మాట్లాడాలి జీవితంలో నువ్వు గెలువబోతున్నా వని అర్థం .

నీవు మెట్లు చూస్తూ ఉండిపోతే మేడ ఎక్కలేము ప్రణాళికలు వేస్తూ ఉండిపోతే విజయం సాధించలేము ఆకాశమంత ఎత్తు ఎదిగిన తర్వాత ఎవరైనా గౌరవిస్తారు మనం నేలమీద ఉన్నప్పుడు కూడా గౌరవించినవారు మనవాడు .

సేకరణ ✒️మీ ..AVB.సుబ్బారావు 🙏💐

సేకరణ

No comments:

Post a Comment