Thursday, January 27, 2022

జప, ధ్యాన, తత్వ దర్శనములలో ఏవి గొప్పవి ?

జప, ధ్యాన, తత్వ
దర్శనములలో ఏవి గొప్పవి ?
మానవునకు రోగం
కలిగించేది పాపం.
మానవునకు భోగం
కలిగించేది పుణ్యం.
మానవుని భవిష్యత్తు
నిర్ణయించేది కర్మ.
మానవునకు లాభం
కలిగించేది సేవ.
మానవునకు సంపాదన
నిలిపేది పొదుపు.
మానవుని విలువ
పెంచేది దానం.
మానవునకు నష్టం
కలిగించేది హింస.
మానవునకు అశాంతి
కలిగించేది ఆశ.
మానవునకు శాంతి
కలిగించేది తృప్తి.
మానవునకు దుఃఖం
కలిగించేది కామం.
మానవుని పతనం
చేసేది అహంకారం.
మానవునకు అందరిని
దగ్గర చేసేది ప్రేమ.
మానవునకు అందరినీ
దూరం చేసేది అసూయ.
మానవుని స్థితిని
సూచించేది గుణం.
మానవుని దైవంగా
మార్చేది దయ.
మానవుని ఆత్మస్థితి
తెలిపేది వాక్కు.
మానవునకు విజయం
చేకూర్చేది ధర్మం.
మానవుని గొప్పవాడిగా
చేసేది తత్వజ్ఞానం.
మానవునకు ముక్తిని
ఇచ్చేది సత్యం.
మానవుని అన్ని రకాలుగా సంస్కరించేది ధ్యానం.
అందుకే ధ్యానం
అన్నింటి కంటే గొప్పది.

శుభ సాయంత్రం తో మీ మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment