Thursday, January 27, 2022

నేటి జీవిత సత్యం. 🔥పాప పుణ్యల🔥

నేటి జీవిత సత్యం. 🔥పాప పుణ్యల🔥

నువ్వు చూస్తున్న విశాల భూభాగమంతా నేను సంపాదించినదే. ఇదికాక నావద్ద అపారమైన ధనరాసులు, బంగారం, వెండి, రత్నాలు, వజ్రాలు ఉన్నాయి' అన్నాడు ధనికుడు ఎంతో గర్వంగా తన మిత్రుడితో.
' వీటిలో నీ వెంట తీసుకుపోగలవి ఒక్కటీ లేదు కదా? ' అన్నాడు మిత్రుడు.
'వెంట తీసుకుపోగలవి ఏముంటాయి?' ఆశ్చర్యంగా అడిగాడు. 'పుణ్యరాసులు!' అన్నాడు మిత్రుడు. చాలామంది పాపపుణ్యాల గురించి ప్రస్తావిస్తారే తప్ప ఆచరణలో వాటిపట్ల శ్రద్ధచూపరు. పాపపుణ్యాల జాబితా చేత పుచ్చుకొని ఎవరూ మంచి చెడు
పనులు ఆ చెయ్యలేరు. కానీ, ఇతరులకు మేలు కలిగించేది
మంచి, కీడు వాటిల్లజే నేది చెడు అనే స్పృహతో వ్యవహరించడం కష్టమేమీ కాదు.
కొందరు గొప్పగొప్ప ఆధ్యాత్మిక విష యాలు మధురంగా బోధిస్తారు. 'అహం' ఆధ్యాత్మిక శత్రువు అన్నవాళ్లే, తమంత వారు తామే అనే ధోరణి కన బరుస్తారు. అసలైన ఆధ్యాత్మికత భగ వాన్ రమణులలో గోచరిస్తుంది. కౌపీనం ధరించిన ఆయనలో
కొండంత వినయం కొలువుండేది. సముద్రమంత సహనం ఆచ్చాదనగా ఉండేది. క్యాన్సరు వ్యాధి బాధను వ్యక్తం చేసే వారే కాదు. అన్నింటికీ అతీతంగా నిత్యానందులై ఉండేవారు. ఇవన్నీ సాధకులకు మౌన ఆధ్యాత్మిక సందే శాలు. ఆధ్యాత్మిక
సందేశాలన్నీ మౌనం ద్వారానే లభిస్తాయి. మౌనం అంటే మాట్లాడకపోవడం కాదు. మనసులోని ఆలోచనలు, అలజడులన్నీ ఒక్కోటిగా బయటకు నెట్టివేస్తూ అంతరంగ వేదికను పరిశుభ్రం చేసుకోవడం.
అప్పుడు అంతరంగం పూజా మందిరంగా మారిపోతుంది. అంత ర్యామి దరహాసం చిందిస్తూ ప్రత్యక్ష మవుతాడు. కళ్లు మూసుకోగానే మనం అంతర్యామి సన్నిధిలో ఉన్న అనుభూతి కలుగుతుంది. మనసు ధ్యానంలో స్థిరపడుతుంది. ధ్యానం
ఆధ్యాత్మిక ధనం ఆర్జించగల ఏకైక
సాధనం .
తిరస్కరిస్తుంది.వలంటే అష్టసిద్ధులు లేని అనుబంటూ
సాధకులు తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలు సాధించాలంటే ఉత్తమ మార్గం ఇప్పుడు మనం చెప్పుకొన్నదే.
ఆధ్యాత్మిక ఆకాంక్షలు ఉత్తమంగా ఉంటే చాలదు. అవి ఆచరణగా రూపుదిద్దుకోవాలి.
సాధనలన్నీ ఇష్టంగా ఉండు చెయ్యాలి. కష్టంగా చేస్తే ఫలితాలు దక్కవు.
శరీరసుఖాలకు ప్రాధాన్యం ఇస్తే అన్నీ కష్టంగానే అనిపిస్తాయి. నాలుక రుచిని, శరీరం సౌఖ్యాన్ని, బుద్ధి గౌరవాన్ని అపేక్షిస్తాయి. ఆధ్యాత్మికత వీటిని నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తుంది. వీటికి అతీతంగా వ్యవహరిస్తుంది.
ఆధ్యాత్మిక ఫలాలంటే అష్టసిద్ధులు కావు. సద్బుద్ధి, సద్భక్తి, అంతర్యామితో అవాంతరాలు లేని అనుబంధం మాత్రమే! అసలు అంతర్యామితో అనుబంధమంటూ ఏర్పడాలేగాని, ప్రపంచాధిపత్యం సైతం గడ్డిపోచకన్నా హీనమనిపిస్తుంది.
మన ఆకాంక్షలన్నీ 'అంతర్యామి'తో అనుబంధానికి అంకి తమై ఉండాలి. మన ఆచరణలన్నీ అందుకు అనుబంధంగా ఉండాలి. అప్పుడు మనం ఆత్మభావనతో జీవిస్తాం. ఆ క్షణం నుంచి మనం ఎటు చూసినా ఆనందమే. ఏమి చేసినా భగవంతుడి
సేవే!
- కాటూరు రవీంద్ర త్రివిక్రమ్*

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment