Saturday, January 29, 2022

అవేర్నెస్, రచన : ఓషో

☘️🌷☘️🌷🍀🌷🍀

💫📚 అవేర్నెస్💫

✍️రచన: ఓషో

భాగం-52


మనసు కేవలం ఒక జరిగే కార్యక్రమం.వాస్తవానికి మనసు అన్నది లేదు.ఆలోచనలు మాత్రమే ఉన్నాయి. ఆలోచనలు ఎంత వేగంగా కదులుతాయీ అంటే మీరు నిరంతరం అక్కడ ఏదో ఒకటి ఉందని అనుభూతి పొందుతారు. ఒక ఆలోచన వస్తుంది, ఇంకొకటి వస్తుంది. మళ్ళీ ఇంకొకటి.... అలా ఆలోచన వస్తూనే ఉంటాయి. ఆలోచన మధ్య అంతరం ఎంత చిన్నదీ అంటే మీరు ఒక ఆలోచనకి మరొక ఆలోచనకీ మధ్య విరామాన్ని చూడలేరు. కనుక రెండు ఆలోచనలు చేరి ఉంటాయి.అవి అవిచ్ఛిన్నంగా, తెంపులేకుండా అవుతాయి. ఆ ఎడతెగని కదలిక వలన మీరు అక్కడ ఒక మనసు ఉందని అనుకుంటారు.

అక్కడ ఆలోచనలు ఉన్నాయి కానీ - మనసు లేదు. ఎలక్ట్రాన్లు, ఎలా ఉంటాయో అలాగే పదార్ధం లేకుండా ఆలోచనలు ఉంటాయి. ఆలోచనలు మనసు యొక్క ఎలక్ట్రాన్లు.ఓ గుంపు ఉన్నట్లు తోస్తుంది ... కానీ ఇంకోరకంగా గుంపు అన్నది ఉండదు. వ్యక్తులు మాత్రమే ఉంటారు. కానీ చాలామంది వ్యక్తులు కలిసి ఉండటంతో, వాళ్లంతా ఒక గుంపుగా అనిపిస్తారు. ఒక జాతి ఉంది మరియు లేదు. వ్యక్తులుమాత్రమే అక్కడ ఉంటారు . వ్యక్తులు జాతి యొక్క,సంఘం యొక్క, గుంపు యొక్క ఎలక్ట్రాన్లు.

ఆలోచనలు ఉన్నాయి - మనసు లేదు.మనసు ఒక ఆకారంలా కనిపిస్తుంది. మీరు ఎప్పుడైతే మనసులోకి లోతుగా, గాఢంగా చూస్తారో అప్పుడు అది మాయమవుతుంది. అప్పుడు ఆలోచనలు ఉంటాయి కానీ మనస్సు మాయమైనప్పుడు, వేరుగా, విడివిడిగా ఆలోచనలు మాత్రం ఉంటాయి.అప్పుడు చాలా విషయాలు వెంటనే పరిష్కారం అవుతాయి. మొట్టమొదటి సంగతి తత్ క్షణమే తెలిసేది ఏమిటంటే ఆలోచనలు మబ్బులు లాంటివి అని. అవి వస్తూ ఉంటాయి మరియు పోతూ ఉంటాయి. మరియు మీరే అవకాశం. మనసు లేనప్పుడు వెనువెంటనే ఆలోచనలు ఇంక చుట్టుకోలేదన్న గ్రహింపు కలుగుతుంది.ఆలోచనలు ఉన్నాయి. అవి మీలోంచి - ఆకాశంలో మబ్బులు వెళుతున్నట్లుగా వెళ్తున్నాయి లేక చెట్ల లోంచి గాలి వెళుతున్నట్లు వెళుతున్నాయి. ఆలోచనలు మీలోంచి వెళ్తున్నాయి. అవి అలా వెళ్లగలవు - ఎందుకంటే మీరొక విస్తారమైన శూన్యం కాబట్టి .అక్కడ ఆటంకాలు, అడ్డంకులు లేవు.ఆలోచనల్ని వెళ్లకుండా నివారించడానికి ఏ గోడలూ లేవు.మీరు ఒక గోడ లాంటి దృగ్విషయం కారు .మీ ఆకాశం అనంతంగా తెరుచుకొని ఉంది. ఆలోచనలు వస్తున్నాయి మరియు పోతున్నాయి అని భావన కలడం మొదలైతే - అప్పుడు మీరు ఒక కావలివారు - ఒక సాక్షి -అప్పుడు మనసుపై యాజమాన్యం సాధించినట్లే.
(సశేషం)
🌸🌹🌸🌹🌸🌹🌸🌹

🌸🌿🍎🌺🍃🍏🌹☘️🍓

🌟📚 అవేర్నెస్🌟

✍️ రచన: ఓషో

భాగం-53

✨ మనస్సు సామాన్యమైన అర్థంలో అదుపులో పెట్టపడదు. మొట్టమొదట మీరు ఎలా దాన్ని అదుపులో పెడతారు? ఎందుకంటే అది లేదు కనుక, రెండవది- మనస్సుని అదుపులో పెట్టేది ఎవరు? ఎందుకంటే ఎవ్వరూ కూడా మనస్సుకి ఆవల లేరు. అంటే నేను మనస్సుకు వెనకాల ఎవ్వరూ లేరని అన్నాను అంటే మనస్సుకి అవతల ఏమీ లేకపోవడమే ఉంది అని అర్థం. మనస్సుని వశంలో ఉంచేది ఎవరు? ఒకవేళ ఎవరైనా మనస్సుని హద్దుల్లో ఉంచితే- అప్పుడు అది కేవలం ఓ భాగం, మనస్సులో ఓ భాగం, మనస్సులో ఇంకో భాగాన్ని అదుపులో ఉంచుతోంది అన్నమాట. దాన్నే "అహంకారం" అని అంటారు.
మనస్సు ఆ రీతిగా అదుపులో పెట్టబడదు. అది అసలు లేదు. మరియు అక్కడ మనస్సుని అదుపులో పెట్టడానికి ఎవ్వరూ లేరు. అంతరమైన శూన్యత చూడగలదు కానీ అదుపులో పెట్టలేదు. అది చూడగలదు. వశంలో పెట్టలేదు. కానీ ఆ చూపే ఒక అదుపు. గమనించడం, సాక్షితత్త్వం, అనే దృగ్విషయమే యజమానత్వం అవుతుంది ఎందుకంటే మనస్సు మాయమవుతుంది కాబట్టి.
మనస్సు అంటే ఏమీ కాదు. కానీ మీ యొక్క హాజరు లేకపోవడమే- నిశ్శబ్దంగా మీరు కూర్చున్నప్పుడు, మనస్సులోకి లోతుగా, గాఢంగా చూసినప్పుడు మనస్సు అలా మాయమవుతుంది. ఆలోచనలు వస్తుంటాయి. ఉనికిని కలిగి ఉంటాయి. కానీ మనస్సుని అక్కడ కనుక్కోలేరు.

(సశేషం)
💠💠💠💠💠💠💠💠

సేకరణ

No comments:

Post a Comment