Sunday, January 30, 2022

మెరిసేదంతా బంగారం కాదు ..తృప్తితో కూడిన సామాన్య జీవితం ఎంతో ఉత్తమం

 *⚛‼️మెరిసేదంతా బంగారం కాదు ..‼️⚛*


*https://chat.whatsapp.com/DnuAsVF1UnTJNC3k7yo3yp*


*తృప్తితో కూడిన సామాన్య జీవితం ఎంతో ఉత్తమం*


*https://t.me/joinchat/5gVEZGFAscQ3N2Fl*


*ఎవరైతే దుర్బుద్ధి,  అక్రమ సంబంధం (స్త్రీ వ్యామోహం), అసత్యం, అవినీతి (ధనాశ), అధర్మం, అన్యాయం, మోసం, జూదం, మద్యపానం, ద్వేషం (క్రోధం - హింస) కలిగియుంటారో వారిని పాపకూపంలోకి లాగుతాడు కలిపురుషుడు.*


*వారిని చూస్తే భోగములతో వైభవంగా ఉన్నట్లనిపిస్తుంది. ఇది సరిగా అర్థంచేసుకోలేక, సామాన్యులు కొంతమంది "మనకి మాత్రమే ఈ పేదరిక బాధలు, కష్టాలు ఎందుకు? " అని చాలా మంది భగవంతుడిని దూషిస్తూ ఉంటారు.*


*నిజానికి భగవంతుడు పరీక్షించేది వీరిని కాదు, పైన చెప్పిన వారిని.*


*కలి ప్రభావానికి లోనైనవారు మాత్రం తమ భోగాలు చూసి మురిసిపోతుంటారు కాని ఇది ముందు ముందు జన్మలకి ఎంత ప్రమాదమో గ్రహించలేరు.*


*తద్విరుద్ధంగా, నిత్యం భగవన్నామ స్మరణ, సత్యం, ధర్మాచరణతో, పరోపకారంతో సరళమైన జీవితం గడిపేవారికి ప్రశాంతమైన జీవితంతో పాటు, ముందు ముందు ఉత్తమ జన్మ లభిస్తుంది.*


*ఈ సూత్రం ఎవరికైనా, ఎంతటి వారికైనా, ఆధ్యాత్మిక వ్యాపారం చేసే వారికైనా ఒక్కటే.*


*ఎక్కడి నుండి వచ్చామో, ఏ రూపాంతరం చెందామో ఎవరికీ తెలియదు.*


*ఒక్కటి మాత్రం సత్యంగా కంటిముందే సాక్ష్యం.*


*ఎన్నో జీవరాసులు, చీమలు, వానపాములు, కుక్కలు, పాములు, పులి, పంది, పక్షులు, పురుగులు మరెన్నో లక్షల జీవులు. వాటికి ఆ జీవితం, మనది మనుష్య జన్మ. ఎలా ? ఇదే అలోచిస్తే జ్ఞానం. నిర్లక్ష్యిస్తే అజ్ఞానం.*


*కనుక, మెరిసేదంతా బంగారం కాదు. ఆ భోగాలకి తాపత్రయపడి ఆర్భాటాలకి, కట్టడాలకి, దైవం ముసుగులో లౌకికులకి లొంగి అసూయలో పడి నీచజన్మకి లోనుకాకూడదు.*


*ఆధునిక  ఆధ్యాత్మికం అత్యంత ప్రమాదకరం, మహాపాపం.*


*గరుడపురాణం చదవండి. మన జీవిత లక్ష్యాన్ని, ఫలితాలను తెలియచేస్తుంది.*


*తృప్తితో కూడిన సామాన్య జీవితం ఎంతో ఉత్తమం*


*https://www.facebook.com/groups/638078683192004*

No comments:

Post a Comment