*🙏🌷శ్రీ గురుభ్యోనమః 🌷🙏*
*🕉సనాతన ధర్మం అంటే ఏమిటో ఒక్క మాటలో చెప్పగలిగే నిర్వచనం కాదు.🕉*
*https://t.me/+5gVEZGFAscQ3N2Fl*
*సనాతన అంటే ఎప్పుడూ వుండేది అని అర్థం, ఇంచుమించు శాశ్వతానికి పర్యాయపదం.*
🌹🚩🌹
*ధర్మం అంటే సత్యాన్ని కాపాడుకుంటూ వుండే ఒక జీవనశైలి (ఇంచు మించు నాగరికత అని అనవచ్చు). మరి సత్యం అంటే ఏమిటి అని అడుగుతారేమో…*
🌱🌸🌱
*నారదుడు ఇంద్రుడి చెరనుండి ప్రహ్లాదుడి తల్లిని (ప్రహ్లాదుడు గర్భంలో వున్నప్పుడు) విడిపించి తనకు సత్యం అంటే ఏమిటో ఇలా చెప్తాడు.*
*సత్యస్య వచనం శ్రేయః సత్యాదపి హితం వదేత్*
*యావత్భూతానాం హితం ఏతత్ సత్యం మతం మమ.*
*నిజం మాట్లాడటం మంచిది, నిజం కన్నా హితం మాట్లడటం అలవాటు చేసుకోవాలి. యావత్ భూతానాం అంటే సకల చరాచర జగత్తుకు హితం చేసేది సత్యం అని నా అభిమతం అంటాడు.*
*వ్యక్తి స్వేచ్ఛ విశృంఖలతగా మారి ప్రమాదంగా పరిణమించకుండా ,నియంత్రించడానికి చట్టాలు,సంస్కారం సహకరిస్తాయి. భారతదేశంలో చట్టాలకంటే సంస్కారానికే ప్రాధాన్యత ఎక్కువ. మతము ,సంస్కృతి ,సాంప్రదాయం ,కళలు, వేదాంతం ఇవన్నీ సంస్కారాన్ని పెంపొందించడానికే ఉన్నాయి. చట్టాలకు ప్రాధాన్యత ఇచ్చే పాశ్చాత్యులు ఈ దేశాన్ని పరిపాలించడం వల్ల , ఇప్పటి పాలకులు పాశ్చాత్య పద్ధతికే ప్రాధాన్యత యిస్తూ స్వేచ్ఛను నియంత్రించడానికి, ప్రత్యేక చట్టాలను రూపొందించడం, చట్టాల పట్ల అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఈ దేశ సాంప్రదాయం కాకపోవడంతో ఆశించిన ఫలితాలు రావడంలేదు. దేశం(వ్యక్తి) ఆత్మ పరిశీలన చేసుకుని మళ్ళీ సాంస్కృతిక పునరజ్జీవనాన్ని పొందితే , అపుడు చట్టాలు చేసే పనిని సంస్కారం చేస్తుంది .*
*గురువు లేకపోయినా ఏకలవ్యుడు విలువిద్యను సాధించినట్లు, సంస్కారాన్ని పెంపొందించే పరిస్థితులు సమాజంలో లేకపోయినా, స్వయంసంస్కారాన్నిసాధించవచ్చు. అలా సంస్కృతి ఫై నమ్మకముంచి స్వయం సంస్కారాన్ని సాధిస్తున్నవారికి, నాస్తికవాదులు, హేతువాదుల్లోని అతివాదులు అడుగడుగునా అడ్డుతగులుతూ ఉంటారు. వీరికి నిర్మూలించడమే గానీ , నిర్మాణం చేసే శక్తి లేదు. కొండనాలుక్కి మందేయ్యమంటే ఉన్న నాలుకను ఊడగోడతారు. మూఢనమ్మకాలను పోగట్టవలసిన హేతువాదంతో ,ఏకంగా నమ్మకాలనే నిర్మూలించే ప్రయత్నం చేస్తారు . ఇది అయ్యే పని కాదని చరిత్ర పరిశీలిస్తే తెలుస్తుంది .*
*భారతీయ సంస్కృతిలో జీవం ఉంది. అందుకే తరతరాలుగా ఎవరెన్ని దండయాత్రలు చేసినా ప్రతిఘటించి నిలబడుతోంది. హేతువాదులు ప్రజల విశ్వాసాలను ప్రశ్నించే బదులు అసలు ఈ నమ్మకాలు తరతరాలుగా నిరాటంకంగా కొనసాగుతూ రావడంలోని అంతర్యం ఏమిటి? అని ప్రశ్నించుకుంటే బావుంటుంది.*
*నేటి పరిస్థితుల్లో , సాంకేతిక విప్లవంతో సమానంగా సాంస్కృతిక విప్లవం సాగాల్సిన అవసరాన్ని గుర్తించి ఈ రచన చెయ్యడం జరిగింది*
*https://www.facebook.com/groups/638078683192004*
No comments:
Post a Comment