Saturday, January 1, 2022

మంచి మాట...లు

ఆత్మీయ బంధుమిత్రులకు గురువారపు శుభోదయ శుభాకాంక్షలు.. పూజ్య గురుదేవులు పరమ పూజ్యులు శంకరచార్య పరంపర, గురు దత్తాత్రేయ స్వామి వారు మరియు గురు రాఘవేంద్ర స్వామి వార్ల అనుగ్రహం తో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ... గురుదేవులను ప్రాదిస్తూ..
రావటానికి ఎందుకు తొందర పోవటానికి ఉండాలి తొందర.. మన కోచ్చే ప్రాబ్లమ్స్ అన్ని కూడా మన కర్మ నుండి విముక్తులం కావటానికే అని మనం గ్రహించాగలిగితే చాలు అంత ఆనందమే గా సంతోషం గా ఉంటాం.. కాదు పోతాం 💐🤝
గురు వారం --: 23-12-2021 :--ఈరోజు AVB మంచి మాట...లు

మనషికి ఆశకు అంతముండదు పైసాకు పద్దతుండదు ఈ రెండిటి వెనకాల పరిగెత్తేటోడికి మనః శాంతి ఉండదు ఇది గుర్తుపెట్టుకో నేస్తమా ! మనం సంపాదన వేటలో పడి జీవితాన్ని ఆనందంగా గడపడం మరిచిపోతున్నాం జరిగిన కాలాన్ని కొనలేం తరిగిన వయస్సును తిరిగి పొందలేం అందుకే ప్రతి క్షణంఆస్వాదిస్తూ సంతోషంగా గడపడానికి ప్రయత్నిద్దాం మనస్తత్వo కలిసిన వారిని వదులు కోకూడదు మానవత్వం తెలియని వారిని కలుపుకోకూడదు అనుభవం నేర్పిన పాఠాలకు విలువ ఎక్కువ ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ ఎదుటి వారిలో మంచినే చూసే మనసుకు ప్రశాంతత ఎక్కువ .

దీపం విలువ చీకట్లో తెలుస్తుంది డబ్బు విలువ పేదరికంలో తెలుస్తుంది కుటుంబం విలువ ఒంటరితనంలో తెలుస్తుంది , ఏ జన్మలోపాపం చేసావో తెలియదు కానీజన్మలో ఎంత ఓర్పు సహనంతో అన్నింటిని సహించుకుపోతున్న కష్టాలు మాత్రం తప్పడం లేదు , సంతోషం గా అనుభవిద్దాం

జీవితం ఎవరికి శాశ్వతం కాదు ఈ ప్రపంచంలోప్రాణానికి గ్యారంటే లేదు మనం జీవించే కొంత కాలానికి ఎన్నో బాధలు బంధాలు బాధ్యతలు ఎవరై్నా చనిపోతే పాపం పోయాడు అంటాము బతికి ఉంటే ఇంకా పోలేదా అంటాము రేపు అనేదాని చూస్తామో చూడమో తెలియని మన బతుకులకు పగలు కక్షలు పంతాలు ఎందుకు నేస్తామా ! ఎవరూ ఉండి తినేది లేదు ఎవరూ పోయి సాధించేది లేదు ఉన్నంత కాలంలో అందరితో కలిసి సంతోషంగా జీవిద్దాం .

సేకరణ ✒️మీ... AVB సుబ్బారావు ..

సేకరణ

No comments:

Post a Comment