Sunday, February 13, 2022

నేటి జీవిత సత్యం. ఆధ్యాత్మిక సాధనలో ఓర్పు చాల అవసరం.

నేటి జీవిత సత్యం.

ఆధ్యాత్మిక సాధనలో ఓర్పు చాల అవసరం. ఈ రోజు జపం లేదా పూజ చేసి భగవంతుడు కనపడలేదు లేదా నా పూజ కి ఫలితం రాలేదు అనుకోవడం తప్పు .

మనం ఒక పరీక్ష రాసి వాటి ఫలితాలు కోసం ఎంత నిరీక్షణ గా ఉంటామో భగవంతుని విషయం లో కూడా అంతే నిరీక్షణ గా ఉండాలి అంటారు పెద్దలు.

అసలు భగవంతుని గురుంచి మాట్లాడాలి అన్న లేదా ఒక చర్చ జరగాలి అన్న మనకి ఎంతో పూర్వజన్మ సుకృతం ఉండాలి . మనచుట్టూ ఎంతో మందిని చూస్తూ ఉంటాము అన్ని విషయాలు మాట్లాడతారు కానీ భగవంతుడు / ఆధ్యాత్మికత గురుంచి ఎత్తగానే వారికే ఆ విషయం మీద ఆసక్తి ఉండదు లేదా అక్కడ ఉండరు .

ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతుంటే వాళ్ళకి చాల విసుగువస్తుంది . దానికి పూర్వజన్మ వాసనలు / సుకృతం ఉండాలి.

ఒక బీజాక్షర మంత్రం జపం లేదా ఒక సుందరకాండ పారాయణ చేసినా దాని ఫలితం మనకి వెంటనే కనపడవచ్చు లేదా మన పాపారాసి భస్మం అయ్యేదాకా దాని ఫలితం మనకి రాకపోవచ్చు. మన పాపరాసి ఆ పారాయణ తో భస్మం కావచ్చు . అది మన కంటికి కనపడదు.

ఉదాహరణకి ఒక వంద శాతం పాపం ఉంటె అందులో 80 శాతం భస్మం అయ్యీ 20 శాతం మాత్రమే మన కర్మ మనం అనుభవించవచ్చు . ఆ 20 శాతం అనుభవవిచడానికీ మనం ఆమ్మో ఎంత కష్టం వచ్చిందో అనుకుంటాము . కానీ భగవంతఁడు మనకి మంచి చేసాడు అనుకోము. మన పాపపుణ్యాలను మనం చూడలేము.

మన నిత్యఅనుష్ఠానం చేసుకుంటూ వెళ్లడమే, అన్ని ఆ ఈశ్వరుడు చూసుకుంటాడు అన్న భరోసాతో ముందుకు వెళ్ళాలి . మనం ఒక మీట (బటన్ ) నొక్కితే ఎలా అయితే లైట్ వెలుగుతుంది అన్న నమ్మకంతో ఉంటామో అలాగే మనకి తప్పకుండ అమ్మవారు - అయ్యవారు తప్పకుండ మనకి దర్శనం ఇస్తారు.

మనకి కావాల్సింది నమ్మకం. ఎంత పెద్ద మంత్రాలూ లేదా ఎన్ని సంవత్సరాలు చేశామా అన్నది కాదు. ఎంత భక్తి గా చేసాము అనేది భగవంతుడు చూస్తాడు. ఆర్భాటం చెయ్యవలసిన అవసరం లేదు. డంబాచారాలు అంతకన్నా అవసరంలేదు.

ఏది ఏమయినా ప్రతిమనిషిలో జీవుడు ఎలా ఉన్నదో అలాగే దేముడు కూడా ఉన్నాడు.

అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభా - మన లోపల ఉన్న అమ్మని చూస్తే చాలు.

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment