Sunday, February 13, 2022

ప్రేమ -- అహంకారం (సంభోగం నుండి సమాధి వైపు (ఓషో))

🌺 సంభోగం నుండి సమాధి వైపు (ఓషో) 🌺
🌹 ప్రేమ -- అహంకారం 🌹
🌷 Part -- 1 🌷

🔶 గొప్ప అన్నది కేవలం అహంకారానికి మాత్రమే పరిమితం - 'ప్రేమకు' మాత్రం పెద్దా చిన్నా తేడాలుండవు! తనను ఆశ్రయించిన వాళ్ళనందరినీ ప్రేమ సముదృష్టితోనే ఆప్యాయంగా స్వీకరిస్తుంది!

🌴 ప్రేమ ఎప్పుడూ వినయంగా క్రిందికి వంగేందుకు సిద్ధంగానే ఉంటుంది "అహంకారం" క్రిందికి ఏ మాత్రం వంగేందుకు ఒప్పుకోదు.

🌳 తనను తాను అర్పించుకోవడానికి "ప్రేమ" సంతోషంతో సిద్ధపడుతూనే ఉంటుంది. అన్నింటినీ లాక్కుంటున్నప్పుడు మాత్రమే "అహంకారానికి" సంతోషం లభిస్తూ ఉంటుంది.

🌼 "ప్రేమ అనే పుష్పాల కిరీటం" ధరించిన వాడు ఎప్పుడూ రాజులాగే ఉంటాడు. కానీ, "అహంకారం" అనే ముళ్ళ కిరీటాన్ని" తలకు చుట్టుకున్న వాడు ఎప్పుడూ దరిద్రంతో దీనంగానే ఉండక తప్పదు.

🌸 తన వల్ల ఎవరికైనా సుఖం లభిస్తే "ప్రేమ" ఎంతో సంతోషిస్తుంది! తన వల్ల ఎవరికైనా ఇబ్బంది, దుఃఖము కలుగుతూంటే అహంకారానికి ఆనందం కలుగుతుంటుంది!

🍁 "ప్రేమ" నిరంతరం ఎదురు చూస్తునే ఉంటుంది. తనను ఎవరితోనూ పంచుకోలేకపోతే, తను ఇవ్వలేకపోతే "ప్రేమ" దిగులు చెందుతుంది. తనను తాను పంచుకోగలిగితే "ప్రేమ" సంతోషంతో కృతజ్ఞతా భావాన్ని పొందుతుంది. తన సర్వస్వాన్ని సమర్పించుకోగలిగినప్పుడు "ప్రేమ" బ్రహ్మనందాన్ని అనుభవిస్తుంది! "అహంకారానికి" ఎప్పుడూ దేన్నో ఒక దాన్ని సాధించాలనే తీవ్ర ఆకాంక్ష ఉంటుంది. ఏదో ఒకటి నేరవేరే అవకాశం కన్పిస్తేనే అహంకారం ముందుకు నడుస్తుంది. కానీ, "ప్రేమ" కు ఇంకో దాన్ని పోందాలన్న తలంపు కూడా ఉండదు. ప్రేమకు తనకు తానే ఓ బహుమానం.

Part -- 2

🍀 ఉన్నదాన్ని దాచి ఉంచుకోవడం "ప్రేమ" స్వభానం కాదు. ఏ ఆంక్షలూ లేకుండా సర్వస్వాన్ని అర్పిస్తుంది. అహంకారం అన్నింటినీ ప్రోగు చేసుకుంటూ ఉంటుంది.

☘️ తను ముక్కలై పోయినా ప్రేమకు ఆనందంగానే ఉంటుంది. "అహంకారం" ధనాన్ని కోరుతుంది - ఎందుకంటే డబ్బుతో దానికి శక్తి లభిస్తుంది. కనుక అనుకున్న దాన్ని పొందినా "అహంకారానికి" సంతోషం కలుగదు. అహాంకారానికి అత్యాశ అధికం.

🌲 ఇష్టమైన వారి కోసం తన అంగాల్ని తెగగొట్టుకోవడానికి కూడా అది సిద్దమే. "ప్రేమ" అంటే ఇవ్వడం: ఇచ్చేందుకు "ప్రేమ" ఎప్పుడూ సంసిద్ధంగానే ఉంటుంది. అహంకారానికి ప్రేమ ఓ 'పిచ్చి' లాగా మాత్రమే కనిపిస్తుంది.

🌻 ప్రేమ నిరంతరంగా సాగే విరాళం. ప్రేమ ఎప్పుడూ ఓ రాజుగా, రారాజుగానే ఉంటుంది! ప్రేమ కంటే గొప్ప చక్రవర్తి ఎవరున్నారు? "అహంకారం" ఎప్పుడూ ఏదయినా ఎక్కడయినా లభ్యమౌతుందని తెలిస్తే దాని కోసం పరుగులు పెడుతూనే ఉంటుంది. ఏమీ లభించని చోట్లకు "అహంకారం" పోనే పోదు "అహంకారం" నిరుతరం బిచ్చమెత్తుకుంటూనే ఉంటుంది. ప్రతిదీ దానికి కావాలి.

🏵️ "అహంకారానికి" 'స్వీకరించే భాష' మాత్రం వచ్చు. 'సమర్పించే భాష' ప్రేమది.

🔺 ప్రేమకు మూల గ్రంథాలు లేవు. ప్రేమను వివరించగలిగే సూత్రాల పట్టికలు లేవు. ప్రేమకు నిఘంటువులు లేవు. ప్రేమకు ఆనుసరించాల్సిన విధుల క్రమాలు లేవు. ప్రేమను గురించి నేను మీకు ఎలా చెప్పాలి - ఎంత చెప్పగలనోననే విస్మయ, విచిత్ర ఆలోచన నాలోనూ కలిగింది. ప్రేమను మాటలతో వర్ణించడం ఎంతో కష్టతరమైన విషయం.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

🔹 సంభోగం నుండి సమాధి వైపు మరియు ఇతర ఆధ్యాత్మిక పుస్తకాలు కావాలి అనుకునేవాళ్ళు 9032596493 no కి whatsapp కి msg చేయగలరు.


👍 VicTorY oF LiGhT🎇

💚🔆 Light Workers---- 🔄♻🔁 Connected with Universe💓🌟🌕✨💥☣

No comments:

Post a Comment