Friday, February 18, 2022

భగవంతుని దర్శనం!

భగవంతుని దర్శనం!
➖➖➖✍️

”భగవంతుని చూడాలంటే రోజూ ఎంత సమయం పూజ, జపం, చేయాలి, ఎన్ని సంవత్సరాలు చేయాలి, ఏ మంత్రాన్ని ఎంత సాధనచేయాలి” అని కొంతమంది అడుగుతూ ఉంటారు.

మరికొంతమంది దేవుడుంటే చూపించండి, దాని కోసం మీరు చెప్పినంత సాధన చేస్తాం, చూపించగలరా అనికూడా ప్రశ్నిస్తుంటారు.

ఇలా ప్రశ్నించే వారికి మహాత్ముల సమాధానం గమనిద్దాం…

ఒకసారి వివేకానంద స్వామి తన గురువు అయినట్టి రామకృష్ణ పరమహంసను కూడా ఇలాగే "దేవుడున్నాడా....?" అని మనకంటే తలతిక్కగా ప్రశ్నించాడు.

దానికి రామకృష్ణ పరమహంస గారు "దేవుడు వున్నాడు!" అంటూ ప్రశాంతంగా సమాధానమిచ్చారు.

దానితో వివేకానందుల వారికి సంతృప్తి కలగపోవటంతో “మీరు చూశారా..?” అంటూ మరొక మొండి ప్రశ్న వేశారు.

అప్పుడు రామకృష్ణ పరమహంస గారు “చిరునవ్వుతో దేవుడిని చూశాను. చూస్తున్నాను. నిన్నెలా చూస్తున్నానో ఆయననూ అలాగే చూస్తున్నాను,”అన్నారు.

దానికి వివేకానంద గారు “మరి నేనూ చూడాలంటే ఏమిచేయాలి?” అని అడిగారు గురుదేవులను.

గురుదేవులు వెంటనే వివేకానందుని మెడపట్టి పక్కనున్న నీటి తొట్టి లో ముంచి ఒక నిమిషం పాటు గిలగిలా కొట్టుకున్న తరువాత వదలి పెట్టారు.

తర్వాత ప్రశాంతంగా వివేకానంద ను చూస్తూ “నీకు ఇప్పుడేమనిపించింది?”అంటూ అడిగారు.

”గురుదేవా! మీరు నీటి తొట్టిలో నన్ను ముంచినప్పుడు ‘ఇంకొక్క క్షణం గాలి లేకుంటే నేను బ్రతకలేనని భయం వేసింది, ఒక్క శ్వాస తప్ప ఇంకేమీ అవసరం లేదనిపించింది" అన్నారు వివేకానందులు.

వెంటనే గురుదేవులు వివరిస్తూ “శ్వాస కోసం నువ్వు ఆ క్షణం పడిన అదే ఆరాటం నీలో కలిగి, ‘నీవు లేకుంటే నేను బ్రతకలేన’నే ఆర్తి నీలో కలిగిన మరుక్షణం ఆయన దర్శనమవుతుంది.”వివరించారు పరమగురువు.

అంత సాధన చేయాలి భగవద్దర్శనం కోసం! కానీ మనమేమో కొబ్బరికాయ కొట్టగానే ఆయన కనపడాలంటే ఎలా..?

”స్వామీ నేను ఒక ఐదు గంటల పాటు నిన్ను తప్ప మరొకటి తలవకుండా ధ్యానిస్తాను. మిగతా సమయంలో నాబుద్ధి అలా..అలా.. గాలికి తిరిగి చెత్త విషయాలు ఆలోచించుకుంటుంది, మరినువ్వు నాకు కనపడతావా, అంటే ఆయన నీకెలా కనపడతారు.

నీకు భగవద్దర్శనం కావాలంటే ప్రతీ క్షణం ఆయన యందే నీ మనసు లగ్నం అయిఉండాలి! నువు భౌతికంగా ఏ పనిలో ఉన్నా నీ చిత్తమంతా అతని స్మరణలోనే ఉండాలి.

అప్పుడే సర్వవ్యాపి అయిన జగద్రక్షకుడు ప్రతీ క్షణం నీతోనే ఉన్న భావన ఏర్పడేందుకు అవకాశం ఉంటుంది. నీ సాధన సమయానికి లోబడి కాకుండా ప్రతిక్షణం ఆయన నీకు ప్రసాదించిన భిక్ష అనే విషయాన్ని నీ మనసు అంగీకరించిన మరుక్షణం నీవు ఏ ధ్యానం పూజ చేయనక్కర లేకుండానే దర్శన భాగ్యం కలుగుతుంది.

అందుకే …వివేకానందులవారంటారొకచోట…

’నీ పూజలు జపతపాలు, సాధనలూ ఏవీ..ఏవీ.. భగవంతుని దర్శింప జేయలేవు, కేవలం ఆయన కరుణ తప్ప!’అని కనుక మనం చేసేవి బుద్ధిగా సక్రమంగా చేస్తూ వుంటే. మన మనస్సు పవిత్రమై, ఆయనను వదలి వుండలేని ఆర్తి మనలో కలుగుతుంది.

అప్పుడు లేగదూడ పిలుపువిన్న గోమాతలా పరుగుపరుగున ఆయనే వస్తాడు మనకేంటి తొంద..
🌷🙏🌷
🙏🙏🌹🍁🕉️🍁🌹🙏🙏

సేకరణ

No comments:

Post a Comment