Wednesday, February 16, 2022

మానసిక ధైర్యం

🙏 మానసిక ధైర్యం 🙏
🎊💦🦚🌼🌈💞

📚✍️ మురళీ మోహన్

🤔మార్పును అవలంబించడం ద్వారా మనలను అణగదొక్కే నిర్బంధాలను, మనకు కలిగే ప్రతిబంధకాలను చేదించడమే మానసిక ధైర్యం.

సమస్యలు, చీకు - చింతలు విభిన్న వ్యక్తులకు విభిన్నంగా ఉంటాయి.

ఈ పరిస్థితుల నుండి మానసిక ధైర్యం మనలను ఆవలకు ఈడ్చగలదు.

"మానసిక ధైర్యం" మన భావాలకు రూపురేఖలు దిద్ది, మన ఆలోచనా సరళిని తీర్చిదిద్ది మనలో మార్పు తీసుకు వస్తుంది.

ద్వేషం, వ్యతిరేక భావాలు మానసిక ధైర్యానికి శత్రువులు.

ఎందుకంటే వీటి వల్ల మనకు ఒరిగేదేమీ లేకపోగా, మనల్ని ఇంకా హీన దిశలోకి దిగజారుస్తాయి.

మన జీవితాలను నియంత్రించే సూక్ష్మ ధర్మాలపై విశ్వాసం మానసిక ధైర్యానికి కుడి భుజం లాంటిది.

అందువల్ల కష్టాల నుండి కడతేరటానికి దానికి తగిన మార్పును మన పద్ధతుల లో తీసుకురావాలి.

పద్ధతుల్లో మార్పు - మానసిక ధైర్యానికి ఆయువుపట్టు.

మనసు సమస్యలను సృష్టించడానికే కాక, వాటి పరిష్కారానికి కావాల్సిన సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటుంది.

మనలో చెలరేగే ఆలోచనలు, హావభావాలు, దృఢ నిశ్చయాలు, ఊహల సముదాయమే మనస్సు.

మనస్సు మన వ్యక్తిత్వానికి రూపురేఖలు దిద్దే శిల్పి.

లక్ష్య సాధన ఆలోచనా సరళిపైన, భావోద్వేగాల పైన ఆధారపడి ఉండటం వల్ల, మనస్సును కావలసిన దిశలో తిప్పటం మానసిక ధైర్యానికి కీలకమైన ఆధారం.

" మానసిక ధైర్యం" పెంపొందించుకునేందుకు ఈ క్రింది అంశాలు చాలా అవసరం.

1. పరిస్థితులను తట్టుకొని నిలబడేందుకు మన పద్ధతులలో మార్పు తీసుకు రావటం.

2 . పాత దురలవాట్లను, మూఢాచారాలను విసర్జించడం.

3 ప్రస్తుత పరిస్థితులలో ఉన్న అవకాశాలను తెలివిగా వినియోగించుకోవడం*.


🎊💦🦚💞🌼🌈👍

సేకరణ

No comments:

Post a Comment