Friday, February 18, 2022

ఓ టీచర్ కన్నీటి వ్యధ* వి.న్యూస్ ప్రత్యెక కధనం:(లెటర్ ను డైరెక్ట్ గా పోస్ట్ చేస్తున్నాను)

ఓ టీచర్ కన్నీటి వ్యధ
వి.న్యూస్ ప్రత్యెక కధనం:(లెటర్ ను డైరెక్ట్ గా పోస్ట్ చేస్తున్నాను)

తానొక టీచర్ !
తన వృత్తి అంటే తనకు ఎంతో ఇష్టం !

తన పిల్లలు అంటే తనకు ఎంతో ప్రేమ !!

తన పిల్లలకు తనంటే ఎంతో గౌరవం !

కానీ ఇప్పుడదంతా గతం !

ప్రతి రోజు తనకిప్పుడు భయం భయం !

టీవీ లు, ఇంటర్నెట్ , బిజీ లైఫ్ తల్లితండ్రులు ,అంత కలిసి తెలిసో తెలియకో పిల్లల మనసు కల్మషం చేసేసారు !

ఇప్పుడు నాకు స్కూల్ కు పోతున్నట్టు లేదు !
పాఠం చెబుతుంటే నా నడుము వైపు హై స్కూల్ పిల్లాడి చూపు !
డస్టర్ కోసం వంగి తీసే లోపే ఏదో పది కళ్ళు నన్ను తినేసేలా చూశాయని ఫీలింగ్!

క్లాస్ లో అమ్మాయిలు అబ్బాయిలు ఏదో లోకంలో వుంటారు !
ఆరవ తరగతి నుంచే జంటలు జంటలు !
మొన్న బాత్ రూమ్ లో ఇద్దరు పిల్లలు ముద్దులాడుకొన్నారని మా సోషల్ టీచర్ చెబితే మనకెందుకు తెలిస్తే గొడవలవుతాయని ప్రిన్సిపాల్ దాపరికం !

15 ఏళ్ళలో నా పాఠాన్ని పిల్లలు ఎంతో శ్రద్ధగా వినేవారు !ఇప్పుడు పరిస్థితి వేరు.లెసన్ ఎంత ఇంటరెస్టింగ్ గా చెప్పినా వినని పిల్లలు !హోమ్ వర్క్ గా కనీసం పాఠం చదువుకొని రమ్మంటే పట్టించుకోని పిల్లలు !
అర్ధరాత్రి దాకా మొబైల్ ఫోన్ లో గేమ్స్ ఆడిన వారు , నీలి చిత్రాలు చూసిన వారు..చాటింగ్ చేసిన వారు ..
క్లాస్ రూమ్ లో అధిక శాతం పిల్లలు అదో లోకంలో ఉంటున్నారు.అదేమని అడిగితే నువ్వు తిడుతున్నావని మా నాన్నకు చెబుతా
ఆయన మీడియాకు చెబుతాడు అని పిల్లాడి బెదిరింపు !
మొన్న పక్క స్కూల్ లో ఇదే జరిగింది ! పిల్లల ప్రవర్తన శృతి మించితే టీచర్ కాస్త గట్టిగా కోప్పడి కాసేపు నిల్చోమంటే !మరుసటి రోజు టీవీ లో బ్రేకింగ్ వార్తలు ! టీచర్ ను రాక్షసుడిగా చిత్రీకరణ !
ఒక రోజు జైలులో గడిపిన ఆ టీచర్. రెండు నెలల జీతం ఖర్చు పెడితే కష్టం మీద బెయిల్
మరో పక్క ప్రిన్సిపాల్ ను స్కూల్ లోనే చంపిన వార్తలు !
నా భవిష్యత్తు తలచుకొంటే నాకే భయం !
నాకు ఒక కుటుంబం వుంది !
ఇంట్లో భర్త పిల్లలు వున్నారు !
ఇంట్లో నుంచి స్కూల్ కు వచ్చినప్పుడు ఇంటికి క్షేమంగా తిరిగి పోతానని గారెంటీ లేదు !
జైలుకే పోతానో .. నా శవమే తిరిగి పోతుందో ..

బాలలోకాన్ని అందరు కల్మషం చేసారు
బాగు చెయ్యాల్సింది టీచర్ లే నట !
ఈ ముళ్ళ కిరీటం మాకెందుకు !
పరీక్ష వస్తే తల్లితండ్రులకు మార్కులు కావాలి .
లేదంటే PTA మీటింగ్ లో పిల్లల ముందే బూతులు.
పిల్లాడు చదువుపై శ్రద్ధ చూపడం లేదంటే
నీకేం చేత కాదు అని అవహేళన .
సపోర్ట్ కోసం ప్రిన్సిపాల్ వైపు చూస్తే తలదించుకొని ఆయన!
తరగతి గదుల్లోనే దేశభవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది
ఇది నాటి నానుడి.
కాని నేటి విధ్యార్థుల తీరుతో ఓటీచర్ అంతఃర్మదనం.
నేడు ఈ వృత్తికి గౌరవం లేదు .
నేడు ఈ వృత్తికి ఆదరణ లేదు
బతికుంటే బలుసాకు తినొచ్చు
బతక లేక పోయినా బడి పంతులుగా
రావొద్దు !

సేకరణ

No comments:

Post a Comment