Friday, February 11, 2022

వ్యాదులు....ఆధ్యాత్మిక చికిత్స

🌹వ్యాదులు....ఆధ్యాత్మిక చికిత్స :🌹

వ్యాధి రెండు రకాలు

1.వ్యసనం వల్లా వచ్చింది.

2.కర్మ వల్లా వచ్చింది.

...వ్యాధి రెండు స్థితులను కలిగివుంటుంది.

1.స్వభావ స్థితి
2.ప్రభావ స్థితి.

1.వ్యసనం వల్లా వచ్చిన వ్యాదులు :

...వ్యసనం వల్ల వచ్చింది ఆ వ్యసనాన్ని మానుకుంటే
సరిపోతుంది. నా మితృడు, మూర్తి వున్నాడు.
వాడు రోజూ తాగుతాడు. దానివల్ల కడుపునొప్పి అంటాడు...మరి తాగడం మానెయ్యొచ్చు గదా...
అన్నాను. మానెయ్యొచ్చు, కానీ నిన్న తాగానే అన్న బాధ తట్టుకోలేక ఇవ్వాళ తాగుతాను అంటాడు.
ఇతని కడుపునొప్పి ఎప్పుడు తగ్గుతుందంటారు ?
ఇలాంటి వ్యసనపరుల గురించి ఈ సలహా నేను ఇవ్వలేను. నిజంగా వ్యసనం వల్లా వచ్చింది అంటే వ్యసనం మానుకుంటే సరి.... అంతే....ఈ రకమైన జబ్బులు మనిషిలో చాలా తక్కువ...నూటికి 10
శాతమే...

2.కర్మ వల్లా వచ్చిన వ్యాధులు :

...మనిషిలో నూటికి 90 శాతము రోగాలు కర్మ వల్లా వచ్చినవే....ముఖ్యంగా మాంసాహారం తినడం అనే పాప కర్మ నుంచి వచ్చినవే...ఏదైనా ఒక జీవి ప్రాణం వదిలే ముందు తన శరీరంలో ఉన్న గ్రంథులనుంచి కోట్ల ""మైక్రో టెట్రియన్స్"" ను రక్తంలోకి రిలీజ్ చేస్తుంది..ఈ మైక్రో టెట్రియన్స్ ను సూర్యుడు దగ్గర ఒక అడుగు దూరంలో వుంచినా నాశనం కావు...అలాంటిది మన కడుపులో ఎలా
అరుగుతాయి... ఒక జీవిని కోసేటప్పుడు అది విపరీతమైన ప్రాణ భయంతో గింజుకునేటప్పుడు
అది తన ప్రాణమయ కోశంలోంచి భయానికి సంబంధించిన వైబ్రేషన్స్ ను తన కండరాలలోకి
రక్తంలోకి వదులుతుంది...ఆ జీవి యొక్క మాంసం తినడం వల్లా ఆ వైబ్రేషన్స్ మన శరీరంలోకి ప్రవేశపెట్టుకుంటాము...ఆ వైబ్రేషన్స్ మన ప్రాణమయకోశంలోకి ( ethiric body ) ప్రవేశించి అక్కడ blocks ను ఏర్పరుస్తాయి...ఇవి మన మానసిక భావావేశాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి...మాంసాహారం తినే జంతువులకు (అందులో మనుషులను కూడా కలిపి) మానసిక
భావోద్వేగాల్లో సమతుల్యత ఉండదు...ఆ జంతువులకు భయము కూడా ఎక్కువే.....
అందుకే మాంసాహారం మనిషికి ఏ మాత్రం
శ్రేయస్కరం కాదు....కాదు గాక కాదు....

మరి తెలియకో తెలిసో...ఎన్నో జన్మలుగా తినడం
వల్లా మన eheric body లో ఏర్పడ్డ blocks వల్లా
ఆయా శరీర భాగాలలో వ్యాదులు బయలుదేరతాయి.
అది ముందు ప్రాణమయకోశంలో ethiric లో
నొప్పిగానూ, ఇబ్బందిగానూ, మొదలవుతుంది..
అది ఏ blood test గానీ ఏ రకమైన భౌతికమైన
xrayకి గానీ,scaninnig లకి గానీ అందదు...
కానీ నొప్పి,,ఇబ్బంది మాత్రం తగ్గదు...pain killers
మింగుతూనే వుంటారు...కానీ ఏ రకమైన మందుల
వల్లా కూడా ప్రాణమయకోశంలోకి blocks ను తొలగించలేము...

...ఎందుకంటే వ్యాధికి కారణమైన block ప్రాణమయకోశంలో ఉంది. చికిత్స భౌతిక శరీరంలో
జరుగుతోంది...అంటే మీరు కొమ్మలను ఆకులను నాశనం చేస్తున్నారు..కానీ వేరును కాదు. వేరును నాశనం చెయ్యనంత వరకూ మళ్లీ మళ్లీ ఆకులు కొమ్మలు వస్తూనే ఉంటాయి...

మందు సూదులతో పోదు....
మరి ఏంటి దారి.........ఇక్కడే ధ్యానం లేదా ఆధ్యాత్మిక చికిత్స లేదా యోగాభ్యాసం మొదలవుతుంది...

ఎలా......

మైఖేల్ అనే meta physics శాస్త్రవేత్త ఒక
వినూత్నమైన అంశాన్ని ఆవిష్కరించాడు...

అదేంటంటే.....కాంతి ఏ వక్రీకరణ లేకుండా ప్రయాణించాలంటే దానికి ether అనే వాహకం
కావాలి అని నిరూపించాడు...దాన్నే ప్రాణం అంటాము...ఒక ప్రాణమయ కోశంలో అంటే etheric body లో మాత్రమే వక్రీకరణలేకుండా ప్రయాణం చేస్తుంది...

ఇప్పుడు Etheruc body ని కాంతి వంతం చేస్తే అది
etheric ని శక్తితో నింపుతుంది...చిన్నపైపులో ఏదైనా అడ్డంకి ఉంటే గట్టిగా ఊదినా,, లేదా force గా నీటిని పంపినా ఆ అడ్డంకి ఆ force ని తట్టుకోలేక బయటికి నెట్టబడుతుంది...అలాగే
etheric body లో శక్తియొక్క force ఎక్కువగా వుండేటప్పటికి దాని తాకిడికి తట్టుకోలేక మాంసాహారం తినడం వల్లా ఏర్పడ్డ blacks అన్నీ
కూడా etheric body నుండి బయటికి నెట్టబడతాయి...అప్పుడు భౌతిక శరీరంలోంచి
వ్యాధి నిర్మూలింపబడుతుంది......ఈ పద్ధతి కొమ్మలు ,,ఆకులు కొట్టడం లాంటిది కాదు..వేరుని
నాశనం చేసే పద్ధతి....

మరి ఎలా.....మరి ఎలా eheric body ని
కాంతితో నింపాలి...నింపితేనే ఆ కాంతి
etheric body ని శక్తివంతం చేస్తుంది...

ఇక్కడే మనస్సుకు శ్వాసను సంబంధం ఏర్పడుతోంది....మనస్సు శాంతిగా ఉంటే
కాంతి etheric body లోకి నేరుగా ప్రవేశిస్తుంది...
అది ఆలోచనలతో ఉంటే కాంతి సరిగా ప్రవేశించలేదు....కాబట్టి మనస్సుకు ఆలోచనా రహితంగా చెయ్యాలి...అప్పుడే కాంతి, ఈథరిక్ లోనికి
ఆవాహన జరిగి అది శక్తిగా రూపాంతరం చెందుతుంది..మనస్సును శూన్యం చేయాలి అంటే
శ్వాసను తన వేగాన్ని లయబద్దించాలి.. అందుకే
శ్వాస మీద మీ ధ్యాస లేదా తత్సమానమైన ధ్యాన పద్ధతులను ప్రయోగించడం వల్ల ఆలోచన,
చేసే మీ ధ్యాస అనబడే మనస్సు ఇప్పుడు ఆలోచించాలి అనే పని నుంచి తప్పుకుని గమనించాలి అనే పని పెట్టుకుంటుంది....అప్పుడు
ఆలోచించేవాడు ఎవ్వడు..?అప్పుడు మనస్సు
శాంతి అయినట్లే....అప్పుడు కాంతి ప్రవేశిస్తుంది....
etheric body శక్తితో నింపబడుతుంది...blocks
తొలగించ బడతాయి...

ఎంత ధ్యానం చేసినా వ్యాధి నిర్మూలన కాలేదు..
అంటే ఇక్కడ వ్యాధి

స్వభావ స్థితి...
ప్రభావ స్థితి ....అని రెండు రకాలుగా ఉంటుంది.

ధ్యానం చేస్తున్నా వ్యాధి నిర్మూలన కాలేదు అంటే
దానర్థం block తొలగించడానికి కావలసిన శక్తి సమీకరణ ఇంకా జరగలేదు అని అర్థం...సమీకరణ
కానంతవరకూ వ్యాధి స్వభావ స్థితిలో లోనే
ఉంటుంది ..అంటే రోగంగా మారదు... స్వభావాన్ని
మాత్రమే చూపిస్తూ ఉంటుంది..దీన్నే కర్మను కేవలం
స్వభావ స్థితిలో అనుభవించడం అంటారు...

అదే ధ్యానం చెయ్యలేదు అంటే అదే వ్యాధి స్వభావస్థితిలోనుండి ప్రభావ స్థితిలోకి మారి
రోగంగా పరిణమించి బాధిస్తుంది......

ఈ ధ్యాన చికిత్స, ప్రక్రియ చేస్తున్నప్పుడు
మాంసాహారం మానేయ్యాలి....మితాహారం
అదీ ఒక్కపూట మాత్రమే చెయ్యాలి.......
100 కి 10 మాటలే మాట్లాడాలి....అధికంగా
మౌనంగా ఉండాలి....క్రమం తప్పకుండా ధ్యానం
చెయ్యాలి...స్వాధ్యాయం,సత్సంగం పాటించాలి......instrumental సంగీతం బాగా వింటుండాలి....ప్రాచీన హిందూ దేశంలో, ఈ పద్ధతులు బాగుగా ప్రాచుర్యంలో ఉండేవి. ఇప్పుడు కూడా అక్కడక్కడ ఈ పద్ధతులు హిందూ దేశంలో పాటించబడుతున్నాయి.
.....🙏🙏🙏🙏🔺🔺🔺🔺

సేకరణ

No comments:

Post a Comment