Tuesday, February 8, 2022

ప్రతి నిత్యం ఆచరించవలిసినవి

 ప్రతి నిత్యం ఆచరించవలిసినవి :- 


నిద్రలేవగానే దైవప్రార్థన చేయుము.

నిత్యానుష్ఠానము ఆచరించుము.

దైవ ప్రార్థన చేసి భుజింపుము.

దైవనామస్మరణతో రోజంతయు గడుపుము.

ఇతరుల తప్పులనెంచకు నీ తప్పులను తెలుసుకొనుము.

పరుండుటకు ముందుగా దైవప్రార్థన చేయుము.

దేవుని పొందుటకిదియే చక్కని మార్గము.


నిత్య సత్యాలు:-


చెట్టు తన పండు తాను తినదు.

నది తన నీరు తాను త్రాగదు. అట్లే 

సత్పురుషులు చేయు, దైవ కార్యములు

లోక కళ్యాణము కొరకే 


విశ్వాసమున్న చోట భక్తియుండును, 

భక్తియున్నచోట పవిత్రతయుండును, 

పవిత్రతయున్నచోట దేవుడుండును,

దేవుడున్నచోట పరమానందముండును. - 



ఏచట మైత్రి యుండునో దానిని వృద్ధి చేయుము

ఎచట విరోధముండునో దానిని తొలగించుము 

ఎచట అపవిత్రత యుండునో దానిని తరిమి వేయుము 

ఎచట దైవత్వముం డునో దానిని స్వీకరించుము



No comments:

Post a Comment