Wednesday, March 23, 2022

"నేను"ను పెంచే కంచెను తీసేయాలంటే !? 🙏శ్రీరమణమహర్షి

🍁"నేను"ను పెంచే కంచెను తీసేయాలంటే !?"🍁

📚✍️ మురళీమోహన్

🙏శ్రీరమణమహర్షి : అంతరంగంలో నేను ఫలానా అన్న భావన, జీవనంలో అనుభవాలతో తాదాత్మ్యత తగ్గించుకుంటూ పోతే మనం మన సహజస్థితిలోనే ఉంటాం. బాహ్యజీవనంలో మనం ఎలాగూ ఇతరుల నుండి విడిగానే ఉంటాం. కానీ అంతరంగంలో ఆ విభజన రాకూడదు. అది ఎలాంటిదంటే పార్కు నిండా మొక్కలు/చెట్లు ఉంటాయి. అందులో ఒకదానికి చుట్టూ కంచె [ఫెన్సింగ్] వేసి ఫలానా వారు నాటిన మొక్క అని రాసిన బోర్డు ఏర్పాటు చేస్తారు. ఆ బోర్డు లేకపోతే అది మిగిలిన మొక్కలతో ఏ రకంగానూ భిన్నంగా ఉండదు. మన మనసులో కూడా మన గురించి అలాంటి కంచె [ఫెన్సింగ్] బోర్డులు రాసి పెట్టుకున్నాం. అవే మనని మన సహజత్వం నుండి విభజించి అశాంతిని కలిగిస్తున్నాయి. మన మనసులో మనం వేసుకున్న కంచె మనసులోని సహజమైన శాంతిని మ్రింగేస్తుంది. అదే 'కంచే చేనుమేయడం' అనే నానుడిలోని తాత్వికమైన అర్థం. మన మనసులోని కంచెను మనం తొలగించుకుంటే మనజీవితం సహజ సుందరంగా సాగుతుంది !

{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం}"
"ఇంద్రియాతీతమైన దైవానుభూతే శాశ్వతంగా నిలిచి ఉంటుంది..!" [అధ్యాయం -103]

🕉🌞🌏🌙🌟🚩

సేకరణ

No comments:

Post a Comment