వనితా......
వనితా…అలసిపోవా నువ్వూ
అల్లారు ముద్దుగా పెంచుకున్నారే,
నీ అరికాళ్ళ క్రింద అరచేతులుంచారే,
నీకు కారే కన్నీటికి దోసిలి పట్టారే,
నీ మోముపై నవ్వును చూసి మురిసిపోయారే,
నీ ఎదుగుదల చూసి గర్వ పడ్డారే నీ కన్నవాళ్ళు.
నీ చదువు సంస్కారాలు చూసి ఉప్పొంగిపోయారే,
నీ కార్యదక్షతకి దాసోహం అయ్యారే.
నీ ముగ్ద మనోహర సౌదర్యానికి దాసోహం అంటూ ఒకడొచ్చాడే.
ఇలాంటి ఈడు జోడు ఇలలో లేదంటూ విర్రవీగి పోతిమే…
కాలం వేసే కాటు మొదలాయేనేమో
అరచేతులు కాయలు కాచే,
అరికాళ్ళు పగుళ్ళు వారే.
వేకువ జానము మొదలు
వెట్టి చాకిరి నీ బంధువాయే
పిల్లల పిలుపులు భర్త అరుపులు.
పరుగు పరుగున పనులు ముగించి పయనమయితివే.
ఇంటి బాద్యతలు సగం మొయ్యటానికి.
గూటికి చేరిన వేళ
కులాసాగా వేసే కేక “కాఫీ”
ఇదిగో మొదలు... అదే మొదలు క్షమించు తల్లీ...
కనికరం లేదే ఈ మగ జాతికి.
కనీసం అలిసి పోయి అయినా కనిపించు తల్లీ!
ముగింపే లేని గమ్యానికి, సంసారమనే పడవలో భయలుదేరావ్.
ముంచుకున్నా నువ్వే
చేరుకున్నా నువ్వే
అలిసిపో తల్లీ!
కనీసం అయినా అలసిపో తల్లీ!
⁃ కోటయ్య మొగిలి, ముంబై......✍️
సేకరణ
వనితా…అలసిపోవా నువ్వూ
అల్లారు ముద్దుగా పెంచుకున్నారే,
నీ అరికాళ్ళ క్రింద అరచేతులుంచారే,
నీకు కారే కన్నీటికి దోసిలి పట్టారే,
నీ మోముపై నవ్వును చూసి మురిసిపోయారే,
నీ ఎదుగుదల చూసి గర్వ పడ్డారే నీ కన్నవాళ్ళు.
నీ చదువు సంస్కారాలు చూసి ఉప్పొంగిపోయారే,
నీ కార్యదక్షతకి దాసోహం అయ్యారే.
నీ ముగ్ద మనోహర సౌదర్యానికి దాసోహం అంటూ ఒకడొచ్చాడే.
ఇలాంటి ఈడు జోడు ఇలలో లేదంటూ విర్రవీగి పోతిమే…
కాలం వేసే కాటు మొదలాయేనేమో
అరచేతులు కాయలు కాచే,
అరికాళ్ళు పగుళ్ళు వారే.
వేకువ జానము మొదలు
వెట్టి చాకిరి నీ బంధువాయే
పిల్లల పిలుపులు భర్త అరుపులు.
పరుగు పరుగున పనులు ముగించి పయనమయితివే.
ఇంటి బాద్యతలు సగం మొయ్యటానికి.
గూటికి చేరిన వేళ
కులాసాగా వేసే కేక “కాఫీ”
ఇదిగో మొదలు... అదే మొదలు క్షమించు తల్లీ...
కనికరం లేదే ఈ మగ జాతికి.
కనీసం అలిసి పోయి అయినా కనిపించు తల్లీ!
ముగింపే లేని గమ్యానికి, సంసారమనే పడవలో భయలుదేరావ్.
ముంచుకున్నా నువ్వే
చేరుకున్నా నువ్వే
అలిసిపో తల్లీ!
కనీసం అయినా అలసిపో తల్లీ!
⁃ కోటయ్య మొగిలి, ముంబై......✍️
సేకరణ
No comments:
Post a Comment