Thursday, March 17, 2022

మనల్ని మనమే మార్చుకోవాలి

మనల్ని మనమే మార్చుకోవాలి

1. గంభీరంగా నిలబడడం కూర్చోవడం నడవడం నేర్చుకోండి
తలవంచుకుని నడవకండి
ధైర్యంగా మాట్లాడండి
ఎదుటివ్యక్తి కళ్ళను చూసి తడబడడం మానుకోండి

2 .నిరాశ పడేలా ఎప్పుడూ ఆలోచన చేయకండి
Always positive thinking

3. చిరునవ్వును ఎప్పుడూ చెదరనివ్వకండి మనసులో ఏ బాధ ఉన్నప్పటికీ

4.దేనికి బయపడకండి
మనల్ని మించి ఏ చెడు జరగదని గట్టిగ నమ్మండి

5. ఇంకొకరితో మనల్ని పోల్చుకుని ఎప్పుడూ మిమ్మల్ని మీరే కించపరుచుకోకండి
ఎవరి స్థాయి వారికి గొప్ప

6. రోజుకు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడండి

నా పైన నాకు నమ్మకం ఉంది
నేను సాధించగలను
నేను అమితంగా అందరిని ప్రేమించగలను
నావల్ల అవుతుంది
నేను చేయగలను అని నమ్మకమైన మాటలు మీకు మీరే చెప్పుకోండి

7. మిమ్మల్ని మీరు అభునందించుకోండి
సరైన సమయానికి ఇచ్చిన పని ముగించాను
ఈరోజు అందరికి మంచి విషయాలు చెప్పాను ఇలా

8. జీవితం అంటేనే ఒక పోరాటం
పోరాడి గెలుపు సాధిస్తాను

9. మంచి స్నేహితుల బృందాన్ని ఎంచుకోండి

10. అసూయ భయం నిరాశ పొగరు అన్నింటిని మరిచిపోండి

ఇవి చాలు మనల్ని మనం మలుచుకోడానికి
మంచి వ్యక్తిగా ఎదగడానికి
ధైర్యంగా బతకడానికి

ప్రతిరోజు ఒక్కసారైనా ఇవి చదువుతూ రండి
ఒకేసారి మారక పోయినా మెల్లమెల్లగా మారడానికి ప్రయత్నిద్దాం.

మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment