Friday, March 4, 2022

మంచి మాట...లు

ఆత్మీయ బంధు మిత్రులకు గురువారం శుభోదయం శుభాకాంక్షలు 💐🌹🤝 పూజ్య గురుదేవులు ఆదిశంకరులు దత్తాత్రేయుడు రాఘవేంద్రస్వామి వార్ల అనుగ్రహంతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ.. ప్రతి మనిషికి ఎవరో ఒకరు మార్గ నిర్దేశకులు ఉండాలి.. వారే గురువులు.. 🙏
గురు బ్రహ్మ గురు విష్ణువు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః 🙏
గురువారం --: 03-03-2022 :--
ఈ రోజు AVBమంచి మాట...లు
జీవితంలో ఎప్పుడూ అనుకోని సమస్యలే ఎదురవుతూ ఉంటాయి వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవడమే జీవితం దీనిలో గెలువడాలు ఓడిపోవడాలు ఉండవు పాఠాలు అనుభవాలు మాత్రమే ఉంటాయి , మనం అవసరం లేని వారి గురించి ఆలోచించి ప్రయోజనం లేదు వాళ్ళు బంధువులైనా సరే మన విలువ తెలియని వాళ్ళతో ఏం మాట్లాడినా వాళ్ళకు ఏం చేసినా మన విలువ తెలియదు .

ముఖం పై చేదుగా మాట్లాడే వారు ఎప్పుడు మోసం చేయరు భయపడవలసింది తియ్యగా మాట్లాడే వారితోనే మనసులో అసూయ పెంచుకుంటారు సమయం వచ్చినప్పుడు మారిపోతారు అద్దం బలహీన మైనదే కానీ నిజాన్ని చూపడంలో ఎప్పుడూ భయపడదు విజయానికి కొన్ని సార్లు శక్తి కావాలి..మరికొన్ని సార్లు యుక్తి ఉండాలి ఇంకొన్ని సార్లు రెండు వాడాలి కానీ చాలా సార్లు ఈ రెండిటికీ అదృష్టం తోడు కావాలి .

జీవితంలో ఎదురు దెబ్బలు తగలడం మంచిదేనేమో కాలికి దెబ్బ తగిలితే వెళ్లేదారిలో ఎలా నడవాలో తెలుస్తుంది.. అదే మనసుకు దెబ్బ తగలితే ఎటువంటి వారితో ఎలా ఉండాలో నేర్పిస్తుంది . జీవితంలో డబ్బు ఉంటేనే బంధువులు..ప్రేమ.. నమ్మకం వస్తాయి..డబ్బు లేకుంటే మన సొంత వారు కూడా పరాయి వారు అవుతారు డబ్బుంటేనే పరాయి వారు కూడా మన వారు అవుతారు ఇది పచ్చి నిజం !.

సేకరణ ✒️మీ ...AVB సుబ్బారావు

సేకరణ

No comments:

Post a Comment