నేటి మంచిమాట.
నమ్మకం నడయాడిన నేలపై
నిత్యం అబద్ధాలు వల్లెవేస్తూ
ఊహకు సైతం అంతు చిక్కని
అంతులేని విషాద వ్యథ...
నమ్మకాన్ని అంగడి సరుకులా
అమ్మకానికి పెడితే
మనిషికి మరమనిషికి
మధ్య తేడా ఏముంటుంది?
నమ్మకమనే పదాన్ని
ముత్యాంలా మెరిపిస్తూ
తారాపథంలోకి దూసుకెళ్లేలా చేస్తేనే
ఓ విలువ.. ఓ నిలువ!
ఒక్కసారి నమ్మకం
నలిగిపోయి అలిగిందనుకో!
అబద్ధమనే పైత్యం
పరాకాష్టకు చేరుతుంది...
అబద్ధపు తెరను నిక్కచ్చిగా
తొలగించుకుంటేనే తళుకు తార
నిజం పొరను ఆత్రుతగా
ఆవహించుకుంటేనే ధ్రువ సితార...
మారని మనిషి అంటూ
ఈ లోకంలో ఉండనే ఉండరు
మనిషన్నాకా సహేతుకంగా
మారితేనే జీవితానికి మేలిమి...!
ఉషోదయం తో మానస సరోవరం 👏
సేకరణ
నమ్మకం నడయాడిన నేలపై
నిత్యం అబద్ధాలు వల్లెవేస్తూ
ఊహకు సైతం అంతు చిక్కని
అంతులేని విషాద వ్యథ...
నమ్మకాన్ని అంగడి సరుకులా
అమ్మకానికి పెడితే
మనిషికి మరమనిషికి
మధ్య తేడా ఏముంటుంది?
నమ్మకమనే పదాన్ని
ముత్యాంలా మెరిపిస్తూ
తారాపథంలోకి దూసుకెళ్లేలా చేస్తేనే
ఓ విలువ.. ఓ నిలువ!
ఒక్కసారి నమ్మకం
నలిగిపోయి అలిగిందనుకో!
అబద్ధమనే పైత్యం
పరాకాష్టకు చేరుతుంది...
అబద్ధపు తెరను నిక్కచ్చిగా
తొలగించుకుంటేనే తళుకు తార
నిజం పొరను ఆత్రుతగా
ఆవహించుకుంటేనే ధ్రువ సితార...
మారని మనిషి అంటూ
ఈ లోకంలో ఉండనే ఉండరు
మనిషన్నాకా సహేతుకంగా
మారితేనే జీవితానికి మేలిమి...!
ఉషోదయం తో మానస సరోవరం 👏
సేకరణ
No comments:
Post a Comment