Friday, March 18, 2022

విఠల పంచపదులు లింగాష్టకం

విఠల పంచపదులు
లింగాష్టకం

బ్రహ్మ మురారి పూజించినది
సురులందరూ అర్చించినది
నిర్మలభాసితం శోభితమైనది
జన్మజ దుఃఖ వినాశకరమైనది
సదాశివ లింగానికి ప్రాణామం విఠల!

దేవ మునులు అర్చించినది
ప్రవరులందరు పూజించినది
కరుణించి కామం దహించేది
రావణ దర్పమునణిచి వేసేది
సదాశివ లింగానికి ప్రాణామం విఠల!

సర్వ సుగంధ లేపితమైనది
బుద్ధి వివర్ధన కారణమైనది
సమస్త సిద్ధ వందితమైనది
సురాసుర పూజితమైనది
సదాశివ లింగానికి ప్రాణామం విఠల!

కనకముచే శోభితమైనది
మహామణి భూషితమైనది
ఫణిపతి పరివేష్టితమైనది
దక్షయజ్ఞం నాశమొర్చినది
సదాశివ లింగానికి ప్రాణామం విఠల!

కుంకుమతో సులేపితమైనది
చందనముతో లేపితమైనది
పంకజహారంతో శోభితమైనది
సంచిత పాప వినాశకరమైనది
సదాశివ లింగానికి ప్రాణామం విఠల!

దేవగణార్చిత సేవితమయినది
భావము భక్తి యుక్తమయినది
కోటి దినకర రాజితమయినది
ప్రభాకర విరాజితమయినది
సదాశివ లింగానికి ప్రాణామం విఠల!

అష్టదళ పరివేష్టితమైనది
సముద్భవ కారణమైనది
సర్వ జగత్ కారణమైనది
అష్టదరిద్ర్య వినాశకరమైనది
సదాశివ లింగానికి ప్రాణామం విఠల!

సురగురువులచే పూజించబడినది
సురవరులచే సదా పూజితమైనది
సురవన పుష్ప సదార్చితమైనది
పరమపదానికి పరమాత్మికమైనది
సదాశివ లింగానికి ప్రాణామం విఠల!

లింగాష్టకము పుణ్యప్రదాయకము
శివసన్నిధానంలో చేయాలి పఠనము
పొందెదరు భక్తులందరు శివ లోకము
శివునితో సహా పొందెదరు మోదము
శివ శివోహం శివ శివోహం శివం విఠల!

కాటేగారు పాండురంగ విఠల్

సేకరణ

No comments:

Post a Comment