Thursday, March 10, 2022

మనసు మాటల ముత్యాలు

🌹మనసు మాటల ముత్యాలు🌹

🌹 కత్తిని ఎంత ప్రేమతో పట్టుకున్నా
దానికి నరకడమే తెలుసు.
కొన్ని బంధాలు కూడా
మనము ఎంత ప్రేమగా చూసినా
వారికి ఇబ్బందులు పెట్టడమే
తెలుసు.....!!

🌹 అవసరం లేని వారి గురించి
ఆలోచించి ప్రయోజనం లేదు
వాళ్ళు బంధువులైనా..స్నేహితులైనా..
ఎవరైనా సరే.....
మన విలువ తెలియని వాళ్ళతో
ఏం మాట్లాడినా..వాళ్ళకు ఏం చేసినా
మన విలువ తెలియదు....!!

🌹 నవ్వడం, నవ్వించడం
అలవాటైతే
జీవితంలోని ఒడుదొడుకులు
నిన్నేమీ చెయ్యలేవు.

🌹 జీవితాన్ని సంతోషంగా
జీవించాలి అనుకుంటే
రెండే రెండు మార్గాలు
నిన్ను వెతుక్కుంటూ ఏది వచ్చినా
TAKE CARE...
నిన్ను వదలి ఏది వెళ్ళినా
DON'T CARE....!!

🌹 నీ తప్పు నీతో చెప్పేవాడు
స్నేహితుడు.....
నీ తప్పు ఎదుటి వాళ్ళతో
చెప్పేవాడు మిత్రునిలా కనిపించే
నీ అనుకూల శత్రువు....!!

🌹 చీకటి అయితే చంద్రుడు రాజు
తెల్లారితే సూర్యుడు రాజు....
ఒక్కరోజే ఒకరిది కానప్పుడు
అన్ని రోజులు మనవే ఎలా అవుతాయి ?
మనది కాని రోజు మౌనంగా ఉండాలి
మనదైన రోజు వినయంగా ఉండాలి

ఉషోదయం చెప్తూ మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment