Tuesday, March 22, 2022

నేటి మంచిమాటలు

నేటి మంచిమాటలు

ఎవరినని ప్రశ్నించుకోకు ?
ప్రాణమే ప్రణవంగా ప్రార్థించు !!
ఎక్కడ ఉన్నానని విచారించకు ?
దేహమే దేవాలయంగా దర్శించు !!

ఏమి చేస్తున్నానని ఆలోచించకు ?
చిత్తమే చిదానందంగా చరించు !!
ఏమి అవుతానని బాధపడకు ?
శరీరమే శివత్వంగా శోధించు !!


కష్టం వచ్చిందని ఆపకు నీ పయనం
సుఖం ఉన్నదని ఆపకు నీ గమనం
రెండింటినీ సమన్వయం చేయి
ఆత్మవిశ్వాసంతో అడుగులు వేయి
ఉన్నత శిఖరా రోహణం చేయి
కష్టాలే వచ్చాయని కృంగితే
రాలిన ఆకు చోట కొత్త చిగురు వస్తుందా
ఉలి తాకని చోట కొత్త రూపంగా మారుతుందా
అందుకే అలుపు సొలుపు లొచ్చిన
ముళ్ల బాట పట్టినా ఆపకు జీవన రణం!!.

మన ఉద్యోగం, మన హోదా, మన అధికారం, మన పరపతి,మన డబ్బులు కొద్దికాలం మాత్రమే మనతో ఉంటాయి..ఎదో ఒక రోజు మన శరీరం కూడా మన మాట వినటం మానేస్తుంది..ఆ రోజు నావి అనుక్కున్నవేవి అక్కరకు రావు.. వచ్చేది మన మంచితనం మాత్రమే.. అందుకే తప్పనిసరిగా 4గురు నైనా మంచితనం తో సంపాదించుకుందాం...

సంతోషం అనేది డబ్బులోనే ఉంటే ధనవంతుడు మాత్రమే నవ్వగలగాలి..
ఇతరులు నవ్వటానికి లేదు కదా.. మరి ధనవంతులు కానీ వారు నవ్వటం లేదా బతకటం లేదా ఆలోచించండి.

శుభోదయం తో మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment