Sunday, March 13, 2022

గురువు తన వద్దకు వచ్చిన ఒక వ్యక్తితో దేవుడు ఉన్నాడా?? లేడా? నీవు సిద్దమేనా?

ఒక గురువు తన వద్దకు వచ్చిన ఒక వ్యక్తితో దేవుడు ఉన్నాడా?? లేడా? నీవు సిద్దమేనా?"
అని అడిగాడు. దానికా వ్యక్తి " ఇప్పుడే మిమ్మల్ని గురువుగా స్వీకరిస్తున్నాను. ఇక మీరు ప్రారంబించండి " అని వినయంగా చెప్పాడు.. వెంటనే గురువు వేరొక శిష్యుని పిలచి చెవిలో పంచదార కలిపిన నీరు ఒక గ్లాసుతో తెమ్మని చెప్పాడు శిష్యుడు తెచ్చాడు... ఇపుడు గురువు వచ్చిన వ్యక్తికి మద్య సంభాషన ఇలా...

గురువు : ఈ గ్లాసులో ఏముంది?
శిష్యుడు: మంచి నీరు.
గురువు: సరిగా చూసి చెప్పు కేవలం మంచి నీరేనా?
శిష్యుడు : అవును గురువు గారు కేవలం మంచి నీరే.
గురువు: అయితే ఒకసారి త్రాగి చెప్పు..

శిష్యుడు నీటిని త్రాగాక..

గురువు:- ఇప్పుడు చెప్పు అది ఏ నీరు?
శిష్యుడు: -గురువు గారూ ఇది పంచదార కలిపిన నీరు..
గురువు: -మరి ఇందాక కేవలం మంచినీరే అని చెప్పావు. ఇప్పుడు పంచదార కలిపిన నీరని అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావ్?
శిష్యుడు : -ఎలా అంటే ఇంతకు మునుపు కేవలం నీటిని మాత్రమే చూసి అందులొే కరిగి ఉన్న పంచదార కానరాక అది కేవలం మంచినీరని పొరపడి చెప్పాను. కానీ ఇపుడు నీటిని త్రాగాను.నీటియందలి పంచదార రుచి అనుభవించిన మూలంగా ఇది పంచదార నీరని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను.
గురువు: -అంటే అనుభవ పూర్వకంగా తప్పితే అది పంచదార నీరు అని నీవు తెలుసుకొేలేకపొేయావ్ అంతేనా?
శిష్యుడి: -అవును.
గురువు : -సరే ఇపుడు నువ్వు త్రాగినది పంచదార నీరని ఒప్పుకున్నావు.అయితే అ నీటీలొ పంచదార చూపించు..
శిష్యుడు : -అసాద్యం గురువు గారూ..
గురువు : -ఏం ఎందుకని?
శిష్యుడు:- పంచదార పూర్తిగా నీటితోకలసి పోయి ఉంది. దానిని వేరు చేసి చూపించలేం..
గురువు: -అయితే నీవొచ్చిన పని అయిపోయింది తిరిగి వెళ్లిపో...

శిష్యుడు సరైన సమాదానాలే ఇచ్చాడు కాని విషయం సరిగ్గా అవగాహన చేసుకోలేక పోయాడు. గురువుగారు ఏదో పరీక్ష పెడుతున్నారనుకుని సమాదానాలు చెప్తూపోయాడు.
విషయం వివరించాల్సిందిగా గురువుని కోరాడు....

అపుడు గురువు " చూడునాయనా.. నీవు నీటిని చూసి రుచి చూడకయే ఏవిదంగానైతే కేవలం మంచినీరే అని పొర పాటు పడ్డవో అదేవిదంగా మనుష్యులు కేవలం భాహ్య ప్రపంచాన్ని చూస్తూ వాటి సుఖాల్లో పడి దేవుడు లేనిదానిగా సృష్టిని చూస్తున్నారు. కానీ నీవు నీటిని త్రాగి అందులోని తీపి రుచిని అనుభవ పూర్వకంగా తెలుసుకున్నావు..

అంటే ఎవరైతే తమ ప్రయత్నం ద్వారా దేవుని ఉనికిని తమ అనుభవ పూర్వకంగా తెలుసుకుంటారోవారికి దైవం ఉన్నదనే సత్యం తెలుస్తుంది. పంచదార నీరు త్రాగేవారికి తప్ప మిగతా వారందరికీ అది మంచినీరే.. దానిని త్రాగిన వాడికే దాని రుచి తెలుస్తుంది...

అనుభవించిన వారికే దేవుడున్న సత్యం తెలుస్తుంది. మిగతా వారికి అనుభవం లేక దేవుడు లేడని పలు పుకార్లు పుట్టిస్తారు...

ఇంకా నీవు దేవుడుంటే చూపించమని ప్రశ్నిస్తే , నీవు ఏ విదంగానైతే నీరంతా కరిగి పోయి,నీటితో కలసి పోయి ఉన్న పంచదారను నీటి నుండి వేరు చేసి చూపించలేవో, అదే విదాన ఈ సృష్టంతా నిండి పోయి, సూక్ష్మాతి సుక్ష్మరూపంలో అణువణువూ వ్యాపించియున్న భగవంతుని ప్రత్యేకంగా వేరుచేసి చూపంచలేం...

సృష్టిలోఉండే ప్రతీదీ భగవత్సరూపమే. జీవుని రూపంలో ఉండేది ఆ భగవంతుడే. రూప నామాలు ఎన్నైనా దేవుడు ఒక్కడే. వాడొక్కడే ఈ చరాచర సృష్టినంతటిని భరించి పోషించుచున్నాడు. నీవు నేను ఈ చెట్టూ పుట్టా వాగూ వంకా అన్నీ భగవంతుని రూపాలే. కనుక దేవుని సర్వంతర్యామిగా తెలుసుకుని ప్రపంచ సుఖాల పట్ల వ్యామెహం విడచి దైవంపై ప్రేమ ,విశ్వాసాలు కలిగి ఉండు.వాడే నిన్ను ఉద్దరిస్తాడు." అని చెప్పగా శిష్యుడు ఆనందం అంబరాన్ని తాకింది. తన సందేహం పటాపంచలై పోయింది. గురువు గారికి ప్రణమిల్లి మీరు చెప్పిన విదంగానే నడచుకుంటానని మాటిచ్చి తన స్వస్థానానికి తిరుగు ప్రయాణమయ్యాడు.

ఇది కధలా భావించకండి. ఆత్మ పరిశీలన చేసుకొండి. దేని మూలంగా ఈ జగత్తంతా నడుస్తుందో ఆలోచించండి.
సైన్స్ అనేది కూడా ఒక విదమైన దైవిక సిద్దాంతమే. శక్తిని సృష్టించలేం నశింప జేయలేం అని సైన్స్ చెప్తుంది.మరి సృష్టింపబడని ఆ శక్తి ఎక్కడిది?
ఇంకా మీరు సందేహిస్తే మీ ఇష్టం.

సేకరణ

No comments:

Post a Comment