Sunday, March 6, 2022

lateral thinking (సజీవ ఉదాహరణ ప్రశాంత్ కిషోర్)

అప్పుడప్పుడు నేను సమూహంలో lateral thinking కావాలి అంటూ ఉండటం మీకు సుపరిచితమే కదా!

దీనికి సజీవ ఉదాహరణ
ప్రశాంత్ కిషోర్ !

అందరికీ ఈ పేరు ఇప్పుడు సుపరిచితమే ! అనేక రాజకీయ పార్టీలు ప్రశాంత్ కిషోర్ ను ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకొన్నాయి ... నియమించుకొంటున్నాయి .. నియమించుకొంటాయి . ఇప్పుడు ఇలాగే మరో వ్యూహకర్త సునీల్ .

వీరి వ్యూహాలు , వాటి వల్ల సమాజానికి జరిగే లాభం ఎంత ?నష్టం ఎంత ? ప్రజాస్వామ్యానికి ఇది మంచి చేస్తుందా? లేక చెడా? ఈ చర్చ వేరు . ఈ పోస్ట్ దాని పై కాదు .

ప్రశాంత కిషోర్ ఆదాయం ఎంత ఉంటుంది ? బహుశా వందల కోట్లు . ఎంత పెద్ద ఉద్యోగం చేస్తే ఇంత సంపాదన . సంపాదనకు మించి పేరు ప్రతిష్టలు . పలుకుబడి ? ఎంత పెద్ద ఉద్యోగం చేస్తే ముఖ్య మంత్రులను నేరుగా కలిసే అవకాశం ఉంటుంది ? ఇక్కడేమో ముఖ్య మంత్రులే ప్రశాంత్ కిషోర్ లాంటి వారి కోసం ఎదురు చూసే స్థితి .

పదేళ్ల క్రితం ఇలాంటి ఒక వృత్తి ఉంటుందని ఎవరైనా ఊహించారా ? ప్రపంచం లో ఏదైనా యూనివర్సిటీ ఇలాంటి కోర్స్ ను డిజైన్ చేసిందా ? లేదు కదా . మరి ప్రశాంత్ కిషోర్ కు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది ?

దీన్నే లాటరల్ థింకింగ్ అంటారు . భిన్న కోణం లో ఆలోచించడం .

మీరు టాక్సీ ఓనర్ కావాలంటే ? లోన్ తీసుకోవాలి . కారు కొనాలి . డ్రైవర్ ను పెట్టుకోవాలి . దానికొక ఆఫీస్ . ఇలా చేస్తే ఎన్ని కారు లకు ఓనర్ అవుతారు ? ఒక్క కారు కూడా కొనకుండా , ఒక్క డ్రైవర్ కు కూడా జీతం ఇవ్వకుండా ప్రపంచం లో అతి పెద్ద కారు రెంటల్ కంపనీస్ వచ్చాయి . ఉబెర్ .. ఓలా.. జస్ట్ ఒక ఐడియా తో.. బిన్నంగా ఆలోచించడం వల్ల .

ఇదే విధంగా రెస్టురెంట్ లు .. ఒక్క బిల్డింగ్ కూడా లేకుండా ఒక్క కుక్ ను కూడా నియమించుకోకుండా ప్రపంచ రెస్టురెంట్ సామ్రాజ్యం .. ఒక్క ఐడియా తో .. జొమాటో .. స్విగ్య్ .

చికెన్ ఫ్రై ఎంత పెద్ద బిజినెస్ ? రోడ్డుపైన ఎక్కడో వైన్ షాప్ ముందు పెట్టుకొంటే .. రోజంతా కస్టపడి పని చేస్తే అయిదు వందల లాభం . కానీ వాడు బిన్నంగా ఆలోచించాడు . ప్రపంచ చికెన్ సామ్రాజ్యం .. అదే KFC.

ఇది ప్రారంభం మాత్రమే . రానున్నది రోబో యుగం .

ఇప్పుడున్న ఉద్యోగాల్లో సగానికి పైగా ఉద్యోగాలను రోబో లు ఎత్తుకొని పోతాయి . ఇప్పటికి మనం ఊహించని ఉద్యోగాలు .. అంటే ఇంకా పేరు పెట్టని ఉద్యోగాలు .. అవకాశాలు వస్తాయి . వాటికి ఫలానా కోర్స్ అంటూ లేదు .

బాబాయ్ హోటల్ ఓనర్ ఏ యూనివర్సిటీ లో హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసాడు ? పుల్లా రెడ్డి గారు ? kfc ఓనర్ ? ప్రశాంత్ కిషోర్ కు ఎన్నికల టక్కు టమారాలు నేర్పిన కాలేజీ ఏది ? ఉబెర్ ఓనర్ చదివిన యూనివర్సిటీ ఏది ?


రానున్నది కొత్త ప్రపంచం . నువ్వు ఎక్కడ చదివావు అనేది కాదు . ఎన్ని మార్కులు వచ్చాయి ? రాంక్ ఎంత అనేది అసలే కాదు . సరి కొత్త గా లోచించగలవా ? నీలో భ్యవిష్యత్తు నైపుణ్యాలు... అంటే... కాగినీటివ్ ఫ్లెక్సిబిలిటీ , లాటరల్ థింకింగ్ , క్రిటికల్ థింకింగ్ , సోషల్ ఇంటలిజెన్స్ , ఎమోషనల్ ఇంటలిజెన్స్, క్రియేటివిటీ లాంటి స్కిల్స్ ఉన్నాయా ? లేవా ? అనేదే ప్రశ్న .

చదువంటే బట్టి కొట్టి మార్కులు సాధించడం కాదు . అది వ్యక్తి జ్ఞాపక శక్తికి పరీక్ష . నీకంటే మిలియన్ రెట్లు ఎక్కువ సమాచారాన్ని నిక్షిప్తం చేసి ప్రాసెస్ చేయగల రోబో లు, కృత్రిమ మేథ ఒక పక్క ఉంటే, జ్ఞాపక శక్తి తో ప్రపంచం లో రాణించాలంటే మూడవ ప్రపంచ యుద్ధాన్ని విల్లంబులతో జయించాలని ప్రయత్నం చేయడం లాంటిది .

ఫ్యూచరిస్టిక్ స్కిల్స్ ఏంటి ? వాటిని బాల్యం నుంచే నేటి తరానికి ఎలా నేర్పాలి ? సృజనాత్మతక అనేది భవిష్యత్తు లోఅతి కీలక నైపుణ్యం అవుతుంది . సృజనాత్మకత పుట్టుకతో రావాలి కదా ? దాన్ని నేర్పడం సాధ్యమా ?...
కాబట్టి , మేధస్సును వాడినవాడు , అసాధారణ ఆలోచనతో సాధించేవాడే భవిష్యత్ నాయకుడు, కాబోయే రాజు!!

సేకరణ

No comments:

Post a Comment