Friday, March 4, 2022

దేహంపై ఉన్న ధ్యాసను చైతన్యంపై ఎలా నిలపాలి ? Ramana maharshi

💐దేహంపై ఉన్న ధ్యాసను చైతన్యంపై ఎలా నిలపాలి ?"💐
🔹🔸🔹🔸🕉️🔸🔹🔸🔹
"అద్దంలో ప్రతిబింబం చూసుకునేప్పుడు మనకు ఆ అద్దంపై ధ్యాస ఉండదు. అద్దాన్నే చూడాలనుకుంటే అందుకు మన ప్రతిబింబం అడ్డేమీ కాదు. ప్రతిబింబంపై ఉంచిన ధ్యాసను అద్దంపైకి తెచ్చుకుంటే సరిపోతుంది. అలాగే ప్రస్తుతం దేహంపై ఉన్న ధ్యాసను చైతన్యంగా ఉన్న "అసలు నేనెవరు" అనే విచారణలోకి మార్చాలి. కేవలం మంత్రజపం చేస్తూపోతే ఆధ్యాత్మికంగా ప్రయోజనం ఉండదు. మనలో నుండి ఆ జపాన్ని చేసేదెవరో గమనిస్తేనే సత్యం తెలుస్తుంది. అంటే మనసుకు మూలంగా ఉన్న చైతన్యం తెలుస్తుంది. ఇక్కడ గమనించటం అంటే మనసు చేసే మంత్రాన్ని, ఆ మనసే వినేంత శ్రద్ధగా చేయటం అన్నమాట !"

"నేను, దైవం ఒక్కటే అయితే దైవాన్ని విడిగా దర్శించటం ఎలా సాధ్యం అవుతుంది ?"

🍁🍁🔅🔅🕉️🔅🔅🍁🍁

"ప్రధమంగా అసలు నేనెవరో తెలిస్తేనే, దైవం అంటే ఏమిటో తెలిసే అవకాశం ఉంది. భగవంతుని సత్యస్వరూపం మన అనుభవంలోకి వస్తే కోటి పుస్తకాల జ్ఞానం వస్తుంది. " శ్రీరమణమహర్షి " దేవుడు ఉన్నాడని, లేడని చెప్పలేదు. దైవం గురించి అడిగే వారికి "ముందు నిన్ను నువ్వు తెలుసుకో " అని సూచించారు. తెలుసుకున్న వారు కాబట్టే మహర్షి తన శరీరం నుండి పూర్తిగా విడివడి తన స్వస్వరూపం ఏమిటో స్పష్టంగా చూసుకున్నారు. అదే భావనతో జీవితం అంతా సహజ ధ్యానంలో ఉండిపోయారు. వారు అనుభవించిన దివ్యానుభూతిని మనందరికీ పంచేందుకు అనుసరించాల్సిన విచారణామార్గాన్ని అతి సులభంగా బోధించారు. ఆలోచనలతో నిండి వున్న మనసు నిజస్వరూపం తెలుసుకోవటమే విచారణామార్గం !"

🕉️🔱ఓం నమః శివాయ🔱🕉️
🍁🍁🔅🔅🙏🔅🔅🍁🍁

సేకరణ

No comments:

Post a Comment