Tuesday, April 12, 2022

మంచి మాట...లు (01-04-2022)

సరస్వతీ శ్లోకః
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ ।
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ॥

యా కుందేందు తుషార హార ధవళా, యా శుభ్ర వస్త్రావృతా ।
యా వీణా వరదండ మండిత కరా, యా శ్వేత పద్మాసనా ।
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్-దేవైః సదా పూజితా ।
సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా ।


లక్ష్మీ శ్లోకః
లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం ।
దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం ।
శ్రీమన్మంధ కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం ।
త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం ॥

దుర్గా దేవీ స్తోత్రం
సర్వ స్వరూపే సర్వేశే సర్వ శక్తి సమన్వితే ।
భయేభ్యస్తాహి నో దేవి దుర్గాదేవి నమోస్తుతే ॥

త్రిపురసుందరీ స్తోత్రం
ఓంకార పంజర శుకీం ఉపనిషదుద్యాన కేళి కలకంఠీం ।
ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయేద్గౌరీం ॥

దేవీ శ్లోకః
సర్వ మంగల మాంగల్యే శివే సర్వార్థ సాధికే ।
శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే ॥
ఆత్మీయ బంధుమిత్రులకు శుక్రవారపు శుభోదయ శుభాకాంక్షలు.. లక్ష్మి, సరస్వతి,గాయత్రి, దుర్గా అమ్మవార్ల అనుగ్రహంతో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ...

01-04-2022:-శుక్రవారం
ఈ రోజు AVB మంచి మాట
లు

మనిషికి కావాల్సింది నేర్పు, మనస్సుకు కావాల్సింది ఓర్పు, బాధలలో కావాల్సింది ఓదార్పు, ప్రతి జీవితం కు కావాల్సింది మార్పు.

చదువు మనల్ని వేలిముద్ర నుండి సంతకం వరకు తీసుకొని వెళితే, నేటి సాంకేతికత మనల్ని సంతకం నుండి తిరిగి వేలిముద్ర వైపు తీసుకొని వెళుతుంది.

లక్ష్యం కోసం కనే కలలు కమ్మనివే కానీ చేరుకొనే మార్గంలో ముళ్ళు ఉంటాయి, భయపడి ఆగిపోతే జీవితం ఎడారి, దాటి వెళ్ళగలిగితే జీవితం పూలవనం అవుతుంది.

లోహలల్లో బలమైనది ఇనుము, ఇది అన్నింటిని కట్ చేస్తుంది, ఇనుము కంటే బలమైనది అగ్గి, ఇది ఇనుమును కరిగిస్తుంది, అగ్గి కంటే బలమైనది నీరు, ఇది అగ్గిని ఆర్పివేస్తుంది, నీరు కంటే బలమైనవాడు మనిషి, మనిషి నీటిని తాగేస్తాడు. మనిషి కంటే బలమైనది మరణం, ఇది మనిషి ప్రాణాలనే తీస్తుంది.

జీవితం లో ఏం చేయాలో చెప్పేది రామాయణం. ఏమి చేయకూడదు అని చెప్పేది భారతం. జీవితం ఎలా జీవించాలో తెలిపేది భగవద్గీత.
సేకరణ ✒️AVBసుబ్బారావు 📱9985255805🇮🇳

సేకరణ

No comments:

Post a Comment