Tuesday, April 12, 2022

మంచి మాట...లు (25-03-2022)

🔱శుభోదయం🙏
దేవీ శ్లోకః
సర్వ మంగల మాంగల్యే శివే సర్వార్థ సాధికే ।
శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే ॥

ఆత్మీయ బంధుమిత్రులకు శుక్రవారపు శుభోదయ శుభాకాంక్షలు. లక్ష్మి, సరస్వతి, దుర్గ,గాయత్రి అమ్మవార్ల అనుగ్రహముతో మీరు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ 💐🌹

చూడు మిత్రమా!!
పరాయి వాడు పాతిక రూపాయలు తిన్నా పర్వాలేదు కానీ,, అయినవాడు అర్ధ రూపాయి తిన్నా ఒప్పుకోరు ఇదే నేటి సమాజం తీరు,,

ఒకరి గురించి కాని వారిజీవితం గురించి చులకనగా మాట్లాడకు. ముందు నీ గురించి నీ జీవితం గురించి ఆలోచించుకో బతికినంత కాలం బాగుపడుతావు.

మన వెనుక గతం ఉంది దాని నుండి నేర్చుకోవాలి, మన ముందు భవిష్యత్ ఉంది దాని కోసం సిద్ధం కావాలి, కానీ వర్తమానం ఇప్పుడే ఇక్కడే ఉంది దానిలో జీవించాలి.

మనం నిజాయితీ గా ఉండటం కూడా ఒక యుద్ధం లాంటిదే యుద్ధం లో ఒంటరిగా నిలబడటం ఎంత కష్టమో ఈ సమాజం లో మనం నిజాయితీ గా ఉండటం కూడా అంతే కష్టం. అలాంటి యుద్ధం లో గెలిస్తే వచ్చే ఆత్మ సంతృప్తినీ మించింది ఏది లేదు.

సర్వేజనసుఖినోభవంతు .

సేకరణ ✒️AVB సుబ్బారావు 📱9985255805

సేకరణ

No comments:

Post a Comment