అనుబంధాల దారం!
➖➖➖✍️
సంబంధాల దారాలను సంరక్షించేది ఏది?
ఒక స్వర్ణకారుడి మరణంతో, అతని కుటుంబం తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. తినడానికి సరిపడా డబ్బు కూడా వారి వద్ద లేదు. ఒకరోజు అతని భార్య తన కొడుక్కి నీలమణిహారాన్ని ఇచ్చి - "నాయనా, దీన్ని మీ మామయ్య దుకాణానికి తీసుకెళ్లు, ఈ హారాన్ని అమ్మి, మనకు కొంత డబ్బు ఇవ్వమని మీ మామయ్యకు చెప్పు", అని అంది.
కొడుకు ఆ హారాన్ని తీసుకుని మేనమామ దుకాణానికి చేరుకున్నాడు.
మేనమామ ఆ హారాన్ని క్షుణ్ణంగా చూసి - "నాయనా, ప్రస్తుతం మార్కెట్ బాగా మందంగా ఉందని అమ్మకు చెప్పు. కొంత కాలం తర్వాత అమ్మితే మంచి ధర వస్తుంది", అని కొంత డబ్బు ఇచ్చి, "రేపటి నుండి వచ్చి నాతో పాటు దుకాణంలో కూర్చో" అని చెప్పాడు.
మరుసటి రోజు నుండి, ఆ కుర్రవాడు ప్రతిరోజూ దుకాణానికి వెళ్లడం మొదలుపెట్టాడు, అక్కడ వజ్రాలను, రత్నాలను ఎలా పరీక్షించాలో నేర్చుకోవడం ప్రారంభించాడు.
త్వరలోనే, అతను వజ్రాల నాణ్యతను పరీక్షించడంలో అనుభవశాలి అయ్యాడు. ప్రజలు తమ వజ్రాలను పరీక్షించుకోవడానికి సుదూర ప్రాంతాల నుండి రావడం ప్రారంభించారు.
ఒకరోజు మేనమామ, ‘‘అమ్మ హారాన్ని ఇప్పుడు తీసుకుని రా… ఇప్పుడు మార్కెట్ బాగుందని చెప్పు, నీకు మంచి ధర వస్తుంది’’, అన్నాడు.
తల్లి వద్ద నుండి హారాన్ని తీసుకుని ఆ యువకుడు స్వయంగా పరీక్షించగా అది నకిలీదని తేలింది. మేనమామ అంత గొప్ప అనుభవశాలి అయ్యి కూడా, వారికి ఈ విషయం ఎందుకు తెలియజేయలేదని ఆశ్చర్యపోయాడు.
వాడు హారాన్ని ఇంట్లోనే వదిలేసి తిరిగి దుకాణానికి వచ్చాడు
మేనమామ, “హారం తీసుకురాలేదా?” అని అడిగాడు.
"మామయ్యా, ఈ హారం కృత్రిమమైనది, నిజమైనది కాదు .... మీరు ఈ విషయం నా నుండి ఎందుకు దాచారు?" అని అడిగాడు.
దానికి అతని మేనమామ, “నువ్వు నాకు హారం తెచ్చిన వెంటనే అది కృత్రిమమైనది అని చెబితే, నువ్వు కష్టాల్లో ఉన్నందువల్లనే నేను నిన్ను మోసం చేస్తున్నాను అని అనుకునేవాడివి".
”ఈ రోజు నీకు నీకుగా జ్ఞానం ఉంది గనుక, హారం నిజంగా నకిలీదని నీకు ఖచ్చితంగా తెలిసింది. ఆ సమయంలో, నిజం మాట్లాడటం కంటే సంబంధాలను జాగ్రత్తగా చూసుకోవడం నాకు చాలా ముఖ్యమనిపించింది", అని చెప్పాడు.
నిజం ఏమిటంటే, జ్ఞానం లేనప్పుడు, మనం ఆలోచించేది , ఈ ప్రపంచంలో చూసేది, తెలుసుకున్న ప్రతిదీ తప్పే. దీని కారణంగా, మన సంబంధాలు అపార్థాలకు గురవుతాయి, అది విభేదాలకు దారి తీస్తుంది, మన జీవితబంధాలు విడిపోవడం ప్రారంభమవుతాయి.
మన సంబంధాలు ఒక అదృశ్య దారం ద్వారా ముడిపడి ఉన్నాయి. ప్రేమ, విశ్వాసం,నమ్మకం ద్వారా అది సంరక్షించబడుతుంది.
ఒక చిన్నపాటి ఒత్తిడి వల్ల లేదా అపార్ధం వల్ల సంబంధాలలో ఎవరి పక్షాన్ని వదలకండి,అపార్థం చేసుకోకండి ...
వ్యక్తులను మీ స్వంతం చేసుకోవడానికి ఒక జీవితకాలం పడుతుంది.చెడగొట్టుకోవడానికి ఎంతో సమయమక్కరలేదు.
. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
సేకరణ

No comments:
Post a Comment