Thursday, April 28, 2022

నేటి జీవిత సత్యం. స్త్రీ మూర్తి...!! గొప్పతనం

నేటి జీవిత సత్యం.
స్త్రీ మూర్తి...!!గొప్పతనం గురించి తెలుసుకుందాం.


తెలిసి తెలియని వయసులో అమ్మ తలవెంట్రుక.. తినే వాటిలో వస్తే.. తల వెంట్రుక వచ్చిందని… అమ్మపై గట్టిగా అరిచే వాడిని, చిరాకు పడేవాడిని!

కొంతకాలానికి నా వయసుతో పాటు ఆలోచన కూడా మారింది.

తన రక్తం పంచుకుని పుట్టిన నేను నా పుట్టుకకి కారణం అయిన తనని, చిన్న తల వెంట్రుక .. తినే వాటిలో వచ్చిందని "కోప్పడటం" సరైనది కాదు అనుకున్నాను.

అప్పటినుండి ఇప్పటి వరకూ ఎన్ని సార్లు తినే వాటిలో "తల వెంట్రుక" కనిపించినా తీసి పక్కన పడేసి తింటాను.

కారణం : -

వాళ్ళు అలా అయిపోవడానికి కారణమే మనం,
వాళ్ళ ఆరోగ్య సమస్యలకి కారణం మనం,

వాళ్ల నడుం నొప్పులకు, కాళ్ళ నొప్పులకు, ఆయాసానికి, తలపోట్లకు, కారణం మనం.

అలాంటప్పుడు.... తల వెంట్రుక వచ్చిందని, కూరలో ఉప్పు లేదని, కారం లేదని, రుచిగా లేదని, సరిగా ఉడకలేదని, ఇలాంటి మాటలు అనడం కరక్ట్ కాదు .

ఎందుకంటే వాళ్ళు మనకి చేసిన వాటితో పోలిస్తే మనం వాళ్ళకి చేస్తున్నది చాలా తక్కువ.

వాళ్ళ జీవితకాలం మొత్తం మనకోసం మాత్రమే కష్టపడ్డారు. కష్టపడుతూనే ఉన్నారు.

వాళ్ళ కష్టానికి విలువ ఇవ్వకపోయినా పర్వాలేదు, పొగడకపోయినా పర్వాలేదు, కానీ చిరాకు పడకండి, కోపడకండి, విసుక్కోకండి, అసహ్యంగా మాట్లాడకండి.

తిన్నావా అని అడగకపోయినా పర్వాలేదు గానీ.... మనకోసం వండి పెట్టిన వాటికి పేర్లు పెట్టకండి. భగవంతుడు మిమ్మల్ని క్షమించడు.

పైన చెప్పినవన్నీ కూడా మనకోసం రోజంతా కష్టపడే తల్లికి, భార్యకు ప్రతి స్త్రీ మూర్తికి వర్తిస్తుంది.

తల్లి నడక నేర్పిస్తే....
భార్య ఆ నడకను జీవితాంతం నడిపిస్తుంది.

ఒకరు ఎక్కువ కాదు. ఇంకొకరు తక్కువా కాదు.
మగాడి జీవితంలో "తల్లి" "భార్య" ఇద్దరూ రెండు కళ్ళతో సమానం.

బంధాలు దూరం అయ్యాక అలా ఉంటే బాగుండేది, ఇలా ఉంటే బాగుండేది అని బాధ పడేకంటే ఉన్నప్పుడే జాగ్రత్తగా బాధ్యతగా చూసుకోవడం మంచిది...✍️

సేకరణ. మానస సరోవరం 👏

No comments:

Post a Comment