నేటి మంచిమాట.
సత్యం మనదారి అయితే సంపద సరిపోయేంతగా మన వెనకే వస్తుంది. ఇది సృష్టి ధర్మం.ఇక ధర్మం అంటే చేయాల్సింది చేయడమే. అలా జీవించడం అలవాటు చేసుకుంటే దుఃఖం రమ్మన్నా రాదు.అసలు మనకు ఎంత దుఃఖం వుంటే అంత అజ్ఞానంలో వున్నట్టు.ఎంత ఆనందంగా వుంటే అంత సుజ్ఞానిగా భావించాలి.మరి నేడు మన సమాజంలో ఎందరు ఎలా వున్నారో వుంటున్నారో ఎవరికి వారే విశ్లేషణ చేసుకుందాం.
మనిషి అంతిమ లక్ష్యం ఆత్మజ్ఞానం పొందటమే అయినపుడు మనం ఎలా వుండాలి ఎలా వుంటున్నాం ఏం చేయాలి ఏం చేస్తున్నాం, ఏం తినాలి ఏం తింటున్నాం. ఏ ఒక్కరైనా సంపూర్ణంగా సంతృప్తిగా ఉన్నామని చెప్పగలరా చెప్పండి. అలా చెప్పగలిగితే ఇన్ని ఆస్పత్రులు ఇందరు డాక్టర్లు అవసరమా ఈ రోజు.మనిషి మారాడా లేదా అని కాదు. మనం మారామా లేదా? మారితే మధురం లేదా నేనిలాగే వుంటా ఇవే తింటా అంటే ఎవరేమి చేయగలరు. మారితే పోయేదేముంది. అనారోగ్యం తప్ప కనుచూపు మేర మరేమీ కనిపించడం లేదు.
తనెవరో తను తెలుసుకో కుండా ఎవరో ఎవరెవరో ఏమో ఏమిటో ఎందుకో అంటూ అనవసర పనులు ఆలోచనలు చేస్తూ ఎంతో విలువైన సమయం వృదా చేస్తూ చివరికి జీవితం ముగిస్తున్నారు. కారణం కొంత అజ్ఞానం మరికొంత అమాయకత్వం ఇంకొంత ఆందోళన. అవగాహన సంతృప్తి లేకపోవడమే. కాస్త నెమ్మదిగా వుండి ప్రశాంతత అలవాటు చేసుకుని రూపాయి ఖర్చు లేకుండా రోజూ శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తూ ఒక 40 రోజుల తరవాత తనని తాను బేరీజు వేసుకుంటే ఆశ్చర్య పడే విధంగా వుంటుంది తన జీవితం.ప్రయత్నిస్తే పోయేదేముంది అనారోగ్యం తప్ప. ఇందుకు శ్వాస మీద ధ్యాస ధ్యానం శాకాహారం తప్ప మరేముంది.
ఉషోదయం తో మానస సరోవరం 👏
సేకరణ

No comments:
Post a Comment