కర్మయోగం!
-------------------
నిశ్శబ్దానిదేముంది,
అది అణచిన ఆవేశమేగా!
సంభాషణ అంటే ఏమిటి,
అది భాష చేత చేసే సంగ్రామమేగా!!
యుద్ధం ఆయుధాలతో చేసేదే కానఖ్ఖర్లేదు,
అక్షరాలతోనూ అది సాధ్యమే!
వర్షం మేఘాలు కురిసిందే
కానఖ్ఖర్లేదు,
అశ్రువులతోనూ అది సహజమే!!
నీ మార్గాన నీవు నడవలేని అసహాయత వల్లనూ కోపం వస్తుంది!
నీ కోపాన్ని నీవు చూపలేని నిస్సహాయత నుంచీ దుఃఖం వస్తుంది!!
ఆవేశాన్ని అణచిపెడితే
దుఃఖాగ్రహ దగ్ధుడవవుతావు!
అర్థం చేసుకొని అధిగమిస్తే
గౌతమ బుద్ధుడవవుతావు!!
అర్థం చేసుకోవడమే అసలు కీలకం!
ఆచరించడం దానికి పర్యవసానం!!
నువ్వు ధర్మ యోధవు కావాలి!
నువ్వు కర్మ వీరుడవు కావాలి!!
జీవితమే ఒక ధర్మక్షేత్రం!
నువ్వు నరుడివీ,నారాయణుడివి కావాలి!!
నీ నెత్తురే నీ కేతనం!
నీవే రథివీ, సారథివి కావాలి!!
విజయం గమ్యం మాత్రమే కారాదు,
నీ గమనమూ నీకు సంతృప్తినివ్వాలి!
లక్ష్యం ప్రేరణగా నువ్వు బ్రతికితే,
నీకు నువ్వేలే నేతవు!!
విలువలతో బ్రతుకు గడిపితే,
నువ్వేలే విజేతవు!!
----- దండమూడి శ్రీచరణ్
9866188266
సేకరణ
-------------------
నిశ్శబ్దానిదేముంది,
అది అణచిన ఆవేశమేగా!
సంభాషణ అంటే ఏమిటి,
అది భాష చేత చేసే సంగ్రామమేగా!!
యుద్ధం ఆయుధాలతో చేసేదే కానఖ్ఖర్లేదు,
అక్షరాలతోనూ అది సాధ్యమే!
వర్షం మేఘాలు కురిసిందే
కానఖ్ఖర్లేదు,
అశ్రువులతోనూ అది సహజమే!!
నీ మార్గాన నీవు నడవలేని అసహాయత వల్లనూ కోపం వస్తుంది!
నీ కోపాన్ని నీవు చూపలేని నిస్సహాయత నుంచీ దుఃఖం వస్తుంది!!
ఆవేశాన్ని అణచిపెడితే
దుఃఖాగ్రహ దగ్ధుడవవుతావు!
అర్థం చేసుకొని అధిగమిస్తే
గౌతమ బుద్ధుడవవుతావు!!
అర్థం చేసుకోవడమే అసలు కీలకం!
ఆచరించడం దానికి పర్యవసానం!!
నువ్వు ధర్మ యోధవు కావాలి!
నువ్వు కర్మ వీరుడవు కావాలి!!
జీవితమే ఒక ధర్మక్షేత్రం!
నువ్వు నరుడివీ,నారాయణుడివి కావాలి!!
నీ నెత్తురే నీ కేతనం!
నీవే రథివీ, సారథివి కావాలి!!
విజయం గమ్యం మాత్రమే కారాదు,
నీ గమనమూ నీకు సంతృప్తినివ్వాలి!
లక్ష్యం ప్రేరణగా నువ్వు బ్రతికితే,
నీకు నువ్వేలే నేతవు!!
విలువలతో బ్రతుకు గడిపితే,
నువ్వేలే విజేతవు!!
----- దండమూడి శ్రీచరణ్
9866188266
సేకరణ
No comments:
Post a Comment