Saturday, April 16, 2022

మన సంపాదన ఎంతవరకు?

మన సంపాదన ఎంతవరకు?


జీవితంలో విజయం సాధించడం అంటే....
బాగా బాగా డబ్బు సంపాదించడం,
ఎక్కువమంది గుర్తించడం.
హోదా, పలుకుబడి కలిగి ఉండడం...మొll
అనుకుంటారు.

ఇంకా ఇంకా ఇంకా సంపాదించాలి సంపాదించాలి. ఫ్లాట్, ఇల్లు, నగలు, భూమి ఇలా కొంటూ పోతూనే ఉన్నారు కదా.

కావాలంటే మీ చుట్టూ ఉండే బంధువులను స్నేహితులను పరిశీలించండి మీకు తెలిసిపోతుంది. ఎంత సంపాదించాలి? ఎంత సంపాదించి ఇక సంపాదన గురించి ఆపవచ్చు అనే విషయం ఎవరికీ అయినా తెలుసా? ఎవరైనా అలా ఆపేశారా? నాకు తెలిసి మీకు ఎవరు కన్పించకపోవచ్చు.

సరే అన్ని చేసి బాగా సంపాదించారు, ఇంకా సంపాదిస్తున్నారు, మరి మీ పిల్లలు ఎం చేయాలి? వాళ్ళు కూడా సంపాదించాలా? వాళ్ళు కూడా మీ లాగ బాగా కష్టపడి/ఇష్టపడి సంపాదించాలా?
మీకు అవును అనే అనిపించవచ్చు కాని పిల్లలకు అలా అనిపించదు కదా.

మీ పిల్లలు పుట్టడమే పెద్ద పెద్ద బంగ్లాలో పుడతారు, ఎసి గదుల్లో నిదురపోతారు, ఎసి బస్సుల్లో స్కూలుకు పోతారు, విమాన ప్రయాణాలు చేస్తారు, ఖరీదు అయిన కార్లలో తిరుగుతారు, ఇవన్నీ చూసిన, చేసిన తరువాత వాళ్లకు జీవితంలో ఇంకే చేయాలి అనుకుంటారు?
"ఎంజాయ్ చేయాలి" అనుకుంటారు.

ఇంకేముంది చేయటానికి? అప్పటికే ఆ పిల్లలు ఫలానా ఆయన పిల్లలు అనే పేరు ప్రఖ్యాతులు, సెలబ్రెటీ హోదా వచ్చి ఉంటుంది. అప్పటికే కావలసినంత సంపద ఉంటుంది, మరి వాళ్ళు జీవితంలో ఏం చేయాలి? ఏం చేయటానికి అయినా మోటివేషన్ ఏంటి? ఏమీ లేదు, మరి సిగరెట్లు, మద్యం, పబ్బులు, క్లబ్బులు, గర్ల్/బాయ్ ఫ్రెండ్స్ తో డేటింగ్స్ లాంటివి కూడా ఒక దశలో వాళ్లకు కిక్ ఇవ్వవు. మరి మిగిలింది డ్రగ్స్! మాములు మనుషులకు ప్రపంచంలో దొరకనిది, ఖరీదు అయినవి ఏంటి అంటే.. డ్రగ్స్. అందుకే బాగా రిచ్ కిడ్స్ కొందరు డ్రగ్స్ కు అలవాటు అవుతారు.

ఎవరికైనా మోటివేషన్ అవసరం! అది లేనప్పుడు ఎవరైనా సరైన దారిని ఎంచుకోలేరు.

ఒక కుటుంబానికి సరిపోయినంత సంపద కలిగిన తరువాత అయినా, అధికంగా సంపాదించడం అనే ఆలోచన విరమించుకోండి.

సంపాదన అనేది పిల్లలకు మేలు చేయదు, పిల్లలకు మేలు చేసేది వాళ్ళు పెరిగే మంచి వాతావరణం, మంచి ఆహారం, మంచి విద్య, మంచి ఇరుగు పొరుగు, మంచి పాఠశాల ఇవే మేలు చేస్తాయి. అధిక సంపాదన అనేది మనిషి తృప్తిని హరిస్తుంది. తృప్తి అనేది మనిషికి ధైర్యాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. ఆలోచించండి మరి!
🤔💵💶🤑

సేకరణ

No comments:

Post a Comment