Tuesday, April 26, 2022

నేటి జీవిత సత్యం. మైండ్ సెట్ మార్చు కుంటే...

నేటి జీవిత సత్యం.

మైండ్ సెట్ మార్చు కుంటే..."విజయం మీదే. మీ జన్మ చరితార్థం.

మీరు ఎలా ఆలోచిస్తే అలానే తయారవుతారు "యద్భావం తద్భవతి"

మీ మనసులో దేని పైన సంపూర్ణ విశ్వాసం, నమ్మకం ఉంటుందో మీరు దానినే పొందుతారు

"మీ గురించి మీరే మను కుంటున్నారో ఇతరులు కూడా మీ గురించి అలాగే అను కుంటారు".

'నేను పిరికివాడిని', 'నేను అసమర్థుడను' అనుకునే వారు ఏ పనీ చేయలేరు.

నేను భగవంతుని బిడ్డని, తండ్రి శివ పరమాత్మ సర్వ శక్తివంతునీ సంతానాన్ని, 'నేను ధైర్యవంతుణ్ణి, సమర్థుడను, ఏది ఏమైనా అనుకున్నది చేస్తాను' అని అనుకున్న వారు ధైర్యంగా, సమర్ధవంతంగా ముందుకు దూకి విజయం సాధిస్తారు అని అంటారు! తండ్రి శివ పరమాత్మ

భగవంతుడు అంటారు శివ భగవాన్ వాచ! మీరు ధైర్యంగా నా మార్గంలో ఒక్క అడుగు వేసి చూడండి మీకు వెయ్యిరెట్లు సహాయం చేసి, వెయ్యి అడుగులు ముందుకు తీసుకెళ్తాను అని తండ్రి శివ పరమాత్మ ప్రతి ఆత్మకు ఇచ్చినటు వంటి జన్మ సిద్ధ అధికారం

"దేనికైనా కాలం, ఖర్మ కలిసి రావాలి, పరిస్థితులు బాగా లే నప్పుడు ఏ పని చేసినా ఫలితం శూన్యం" అని అనుకునే వారు కొందరుంటారు. వారు మంచి కాలం కోసం ఎదురు చూస్తూ ఉంటారు.

కానీ, వారు తమ ఆలోచనను మార్చుకో గలిగితే, కావాల్సి నంత మంచి కాలం ఆ క్షణంలో కల్పించు కోవచ్చు. అలా మార్చుకున్న వారు చరిత్రలో చాలా మంది ఉన్నారు.

ఈ ప్రపంచంలో అసాధ్యాలు అంటూ ఏవీలేవు. తండ్రి శివ పరమాత్మ ని జతగా చేసుకుని, మైండ్ సెట్ మార్చు కుంటే అన్నీ సుసాధ్యాలే.

ఉదాహరణకు ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్స్టీన్ జీవితం...

ఐన్స్టీన్ నీ తన టీచర్ నీకు మంద బుద్ధి నీకు చదువు రాదు అని స్కూల్ నుంచి పంపించేశారు

కానీ ఐన్స్టీన్ తన ఆత్మ విశ్వాసం కోల్పో కుండా, పట్టు వదల కుండా ఎన్నో విషయాలపై సాధన, పరిశోధన చేసి ప్రపంచ ప్రఖ్యాత శాస్త్ర వేత్త అయ్యి ఈ భూ ప్రపంచానికి ఆధునిక శాస్త్ర పరిజ్ఞానాన్ని ఇచ్చి ఎంతో మేలు చేశారు

నాకు సహాయం చేయని వారందరికీ కృతజ్ఞతలు ఎందు కంటే మీ వల్ల నా జీవితంలో నేను ఎలా నడవాలో నేర్చు కున్నాను అని అన్నారు ఐన్స్టీన్

ఒక్క వ్యక్తి తన ఆలోచన మార్చు కుని విజయం సాధించ గలిగితే, అతన్ని స్ఫూర్తిగా తీసుకుని వందలాది మంది ఆ దారిలో రాగలరు.

ఆ ఒక్క వ్యక్తి మీరే ఎందుకు కాకూడదు? కావొచ్చు... మైండ్ సెట్ మార్చు కుంటే!

"విజయం మీ జన్మ సిద్ధ అధికారం"*

శుభోదయం తో మానస సరోవరం 👏

_

సేకరణ

No comments:

Post a Comment