బాంధవ్యం - భగవంతుడు...!!
ఆన్ని రకాల అనారోగ్యాలకు మూలకారణం మనస్సు. మనస్సులో దుఖం ఎక్కువైతే హృదయ రోగం వస్తుంది...
దుఃఖం ఎందుకు వస్తుందో ముందుగా తెలుసుకోవాలి, మానవుడు తనకు ఎందుకు అనారోగ్యం వస్తుందో తెలుసుకోవాలి.
అప్పుడు అతనికి ఎందుకు/ఎలా బ్రతకాలో తెలుస్తుంది..మానవులందరూ కూడా అంటుంటారు.. నేను నా భార్య కోసం బ్రతుకుతున్నాను.. భర్త కోసం బ్రతుకుతున్నాను.. పిల్లల కోసం బ్రతుకుతున్నాను అంటారు.
కాని నీవు.. నీకోసం బ్రతకాలి, నిన్ను ఈ భూమిపైకి మానవుడులా పంపి.. బ్రతకడానికి ప్రాణం పోసిన ఆ భగవంతునిపై అమితమైన ప్రేమను పెంచుకుని ఆ పరమేశ్వరునిలో మమేకమవ్వడానికి బ్రతకాలి...
అనిత్యమైన బంధాలలో చిక్కుకుని భార్యను.. భర్తను.. పిల్లలను అమితంగా ప్రేమిస్తూ.. మరలా వారు.. నన్ను పట్టించుకోవడం లేదు.. నేను ఏవిధంగానైతే వారిని నేను ప్రేమించానో.. ఆ విధంగా నన్ను వారు ప్రేమించడంలేదు అని బాధ పడిపోతే ఏమి వస్తుంది.. పిల్లలు నా మాట వినడం లేదు.. నేను ఎంతో అల్లారు ముద్దగా పెంచాను ఈ రోజు నన్ను పట్టించుకొనడం లేదు అని వాపోతూ ఉంటే నీకు ఏమి వస్తుంది..
నీ హృదయంలో వేదన పెరుగుతుంది, నీ గుండెలో వత్తిడి పెరుగుతుంది, నీకు గుండె పోటు వస్తుంది...
అందరూ కూడా.. నేను నా భార్యను అమితంగా ప్రేమించాను.
కాని నన్ను అర్ధం చేసుకువడంలేదు. అందుకే నేను రోదిస్తున్నాను.. నా భర్తను అమితంగా ప్రేమిస్తున్నాను.. కాని నన్ను బాగా చూసుకువడం లేదు.
నా పిల్లలను అమితంగా ప్రేమించాను కాని నన్ను అర్థం చేసుకోవడం లేదు, నా మాట వినడం లేదు, నన్ను గౌరవంగా చూడడం లేదు, ఒక తండ్రికి/తల్లికి ఇవ్వవలసి ప్రేమను ఇవ్వడంలేదు.
పెళ్ళి చేసుకున్నాకా నా బిడ్డ నామాట వినడం లేదు, భార్యతో వెళ్ళిపోయాడు, నన్ను ఒంటరివాడిని (లేదా) ఒంటరి దానిని చేసేసాడు అని రకరకాలుగా భాధలు చెపుతుంటారు.
ఈ బాధల వల్లనే హృదయ రోగం వస్తుంది.
అంతేకాదు వృత్తిలో ఇంకా ఎదగడం లేదు అని.. వ్యాపారంలో ఇంకా ఎక్కువుగా లాభాలు రావడం లేదు అని.. ఉద్యోగంలో ఇంకా ప్రమోషన్ రావడం లేదు అని.. ఇలా కారణాలు రకరకాలుగా ఉంటాయి.
కారణాలు ఎమైనా కూడా.. ఒక విషయం గుర్తు పెట్టుకోండి.. ఎప్పుడూ కూడా.. నిత్యమైన భగవంతుని ప్రేమించండి.. నిత్యమైన భగవంతుని సేవించండి..
నిత్యమైన భగవంతుని నామం స్మరించండి.. భగవంతుడుని చేరడానికి నిరంతర ధ్యానము.. ఆధ్యాత్మిక చింతనే పరిష్కారం...
సేకరణ. మానస సరోవరం 👏
సేకరణ

No comments:
Post a Comment