🚩🌷హనుమాన్ జయంతి🌷🚩
బలవంతుడు, శక్తి సామర్థ్యాలు, ధైర్యవంతుడు, ఆపాయ్యత, నిజాయితీ, నిజమైన భక్తికి నిదర్శనం జై హనుమాన్. ముఖ్యంగా హనుమాన్ గురించి ఆలోచించగానే ముందుగా గుర్తొచ్చేది ఆయన బలం. నేడు చైత్ర పూర్ణిమ హనుమాన్ జయంతి సందర్భంగా ఆ ఆంజనేయ స్వామి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. హనుమంతుడు పుట్టినరోజుని హనుమాన్ జయంతిగా జరుపుకుంటాం.
హనుమంతుని తండ్రి పేరు కేసరి.
అంజన ఆ కేసరి యొక్క భార్య.
అంజన యొక్క కుమారుడు ఆంజనేయుడు.
ఈయన వాయుదేవుని వర ప్రభావమున జన్మించాడు.
మనలో ఉత్తేజాన్ని నింపే ఆంజనేయుడి గొప్ప లక్షణాలు
రామాయణం, మహాభారతంలోనే కాకుండా హనుమంతుడు వివిధ కథల్లో ప్రస్తావించారు. ఈ కథల ఆధారంగా హనుమంతుడు అంటే.. చాలా సాహసోపతమైన దైవంగా మనకు అర్థమవుతుంది. అయితే హనుమంతుడి, బలం, ధైర్య సాహసాలు, అమితమైన భక్తి మాత్రమే కాదు.. ఆంజనేయస్వామి గురించి మీకు తెలియని, మీరు గతంలో ఎప్పుడు వినని ఆసక్తికర విషయాలు మీకు పరిచయం చేయబోతున్నాం..
రాముడిపై హనుమంతుడి విజయం
యయాతిని చంపాలని.. విశ్వామిత్రుడిని రాముడు ఆదేశించాడు. అప్పుడు యయాతి హనుమంతుడిని సహాయం కోరాడు. అప్పుడు హనుమంతుడు తాను ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా రక్షిస్తానని యయాతికి వాగ్ధానం చేశాడు. అయితే ఈ సంగ్రామంలో హనుమంతుడు ఎలాంటి ఆయుధం ఉపయోగించలేదు. కేవలం రామనామం జపిస్తూ కూర్చున్నాడు. రామబాణాలు హనుమంతుడి దగ్గరకు వచ్చినా.. అవి ఎలాంటి హాని చేయలేదు. అలా హనుమంతుడు రాముడిపై విజయం సాధించాడు.
హనుమంతుడి ఆకలి
సీతను కలవడానికి హనుమంతుడు వాల్మీకి ఆశ్రమానికి వెళ్లినప్పుడు తానకు సీతమ్మ వండిన ఆహారం తినాలనే కోరిక ఉందని చెప్పాడు. అప్పుడు సీతాదేవి రకరకాల వంటకాలను వండి హనుమంతుడికి వడ్డించింది. కానీ.. హనుమంతుడికి ఆకలి మాత్రం తగ్గలేదు.. ఆశ్రమంలో ఉన్న సరుకులన్నీ అయిపోవచ్చాయి. అప్పుడు సీతాదేవి రాముడిని ప్రార్థించగా.. రాముడు తులసీదళం వడ్డించడం వల్ల.. హనుమంతుడి ఆకలి తగ్గుతుందని చెప్పగా.. హనుమంతుడి ఆకలి తీరింది.
పంచముఖి ఆంజనేయుడు
హనుమంతుడి వివిధ రూపాల్లో.. పంచముఖిగా దర్శనమిస్తాడు. రావనాసురుడి సోదరుడైన అహిరావన్ ను రాముడు, లక్ష్మణుడు అపహరిస్తారు. అహిరావన్ ని సంహరించడానికి ఒకే ఒక మార్గం ఉంది. అది 5 దీపాలు, 5 మార్గాల్లో తీసుకెళ్లాలి. అప్పుడు హనుమంతుడు తన రూపంతో పాటు, నరసింహ, గరుడ, వరాహ, హయగ్రీవుడిగా 5 మార్గాల్లో వెళ్లాడు.
దేవుళ్ల అనుగ్రహం
హనుమ పొందిన వరాలు:
శిశువుగా ఉన్నప్పుడే, ఆకలి కలిగియున్నప్పుడు,
సూర్యుని ఫలమనుకొని, పొందుటకు ఎగురడం,
సూర్యనివద్డ హనుమను చూచి రాహువు ఇంద్రునికి ఫిర్యాదు,
ఇంద్రుడు వచ్చి వజ్రాయుధ ప్రయోగం,
ఆంజనేయుని దౌడ(హనుమ)కు తగిలి నిర్జీవుడై పడిపోవడం జరిగింది.
అదిచూసి, వాయుదేవుడు సకల జీవరాశి నుంచి బయటకు వచ్చి సమ్మె చేశాడు.
అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలతో వచ్చి, ఆంజనేయుని పునర్జీవితుని చేశాడు.
వాయువుకి సంతోషం కలిగించడానికీ, భవిష్యత్తులో దేవతల గొప్పకార్యాన్ని మారుతి నిర్వహించడానికీ, దేవతలందఱినీ మారుతికి వరాలిమ్మన్నాడు.
1. ఇంద్రుడు:
బంగారు పద్మహారమునిచ్చి, హనుమ అని నామమిడి, తన వజ్రాయుధము వలన ఏ హానీ కలుగదన్నాడు.
2. సూర్యుడు:
తన తేజస్సులో నూఱోవంతు ఇస్తున్నాననీ,
శైశవ దశనించీ విద్యార్జన స్థితి రాగానే, సకల శాస్త్ర జ్ఞానాన్నీ కలిగిస్తాననీ,
తద్వారా వాక్చతురుడు కాగలడనీ,
శాస్త్రజ్ఞానమందు హనుమతో సరితూగగలవాడు మరొకడుండడనీ అన్నాడు.
3. వరుణుడు:
తన పాశము వలనగానీ, జలములవలనగానీ,
లక్షలకొలది సంవత్రరాల వరకూ మృత్యుభయం ఉండకుండా వరమిచ్చాడు.
4. యముడు:
తన దండము వలన మృత్యువు కలగదనీ,
ఎల్లప్పుడూ ఆరోగ్యభాగ్యాలతో వర్ధిల్లుతాడనీ,
యుద్ధమునందు విషాదగ్రస్తుడు కాడనీ మారుతికి వరాలొసగాడు.
5. కుబేరుడు:
సమరమునందు తన గద ఆంజనేయునికి ఎట్టి ఆపదను కలిగించదన్నాడు.
6. శంకరుడు:
తన వలన గానీ, శూల పాశుపతాస్త్రాది తన ఆయుధాల వలనగానీ హనుమ వధ్యుడు కాడని వరమనుగ్రహించాడు.
7. విశ్వకర్మ:
తాను నిర్మించిన దివ్యశస్త్రములలో ఏ ఒక్కటైననూ రణమందు వధింపజాలదనీ, చిరంజీవి అవుతాడనీ హనుమకి వరాలిచ్చాడు.
8. బ్రహ్మ:
ఏ బ్రహ్మదండంచేతనూ వధ్యుడు కాడనీ,
దీర్ఘాయువనీ మారుతికి వరాలిచ్చి,
వాయుదేవునితో మారుతిని గూర్చి శత్రువులను గడగడలాడించగలడనీ, మిత్రులకు అభయప్రదాత అవుతాడనీ, యుద్ధంలో శత్రువులకు అజేయుడై వర్ధిల్లుతాడనీ, కోరుకొన్న రూపాలను పొందగలడనీ, ఇష్టానుసారంగా అంతటా – వేగంగానూ, నెమ్మదిగానూ సంచరింపగలడనీ, చిరస్థిరకీర్తితో వర్ధిల్లగలడనీ, యుద్ధమునందు అతడొనర్చే వీరోచిత సాహసాద్భుతకృత్యాలన్నీ రావణ సంహారానికి కారకాలవుతూ, అవి రామునకు ప్రియము గూర్చుననీ, లోకాలకు రోమాంచమునూ సంతోషాన్నీ కలిగిస్తాయనీ పేర్కొన్నాడు.
ఆ విధంగా సకల వరాలూ పొందిన శిశువైన మారుతిని అంజనాదేవి వద్దకు తీసుకువచ్చి, ఆమెకు అప్పగించి, వరాలగూర్చి వివరించి వెళ్ళాడు వాయుదేవుడు.
జాంబవంతుడు హనుమ శక్తిని పొగిడి సముద్రలంఘనం చేయించాడు.
:పంచభూతాలు
ఆంజనేయస్వామికి పంచభూతాల అనుగ్రహం కూడా ఉంది. వరుణుడు నీటితో రక్షిస్తానని, అగ్ని దేవుడు ఎప్పటికీ.. అగ్నికి ఆహుతికావని, సూర్యడు అతిపెద్ద, అతి చిన్న రూపాల్లో మారే శక్తిని, వాయు దేవుడు ఎక్కువ వేగంతో వెళ్లగలిగే శక్తిసామర్థ్యాలను, యముడు ఆరోగ్యవంతమైన జీవితం, అలాగే తన యమపాశం నుంచి విముక్తిని ప్రసాదిస్తాడు. అంటే తన ద్వారా హనుమాన్ కి మరణం ఉండదని అనుగ్రహిస్తాడు.
భీముడితో సంబంధం
భీముడి సోదరుడిగా హనుమంతుడిని చెబుతారు. వీళ్లద్దరికి తండ్రి ఒక్కరే వాయు దేవుడు.
కురుక్షేత్ర యుద్ధంలో
మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధంలో తనతో పాటు హనుమంతుడు ఉన్నాడని.. అర్జునుడు చెబుతాడు. చివరికి తాను తీసుకొచ్చిన జెండాలో హనుమంతుడు ఉన్నాడని వివరిస్తాడు. యుద్ధం తర్వాత హనుమంతుడు తన నిజరూపంలోకి వస్తాడు. హనుమంతుడు కిందకు దిగగానే అర్జునుడి వాహనం కాలిపోతుంది. అంటే.. ఎప్పుడో కాలిపోవాల్సిన వాహనాన్ని హనుమంతుడే రక్షించాడని.. కృష్ణుడు వివరిస్తాడు.
హనుమంతుడి అవతారాలు
హనుమంతుడిని రకరకాల రూపాలు, అవతారాల్లో చూసినట్టు..గురువు చెబుతారు. 13వ శతాబ్ధంలో మాధవాచార్యుడిగా, 16 వ శతాబ్ధంలో తులసీదాస్ గా, 17వ శతాబ్దంలో సమర్త్ రామదాసుగా, 17వ శతాబ్ధంలోనే రాఘవేంద్రస్వామిగా, 20వ శతాబ్ధంలో స్వామి రామదాస్ గా కనిపించాడని చెబుతారు.
శాశ్వత స్థానం
హనుమంతుడు ఏడుగురు చిరంజీవుల్లో ఒకరు. అంటే తర్వాత సత్యయుగం వరకు జీవించి ఉంటారని అర్థం. సీతా దేవి ఇచ్చిన ముత్యాల హారాన్ని హనుమంతుడు స్వీకరించలేదు. రాముడు లేని ఎలాంటి వస్తువుని తాను తీసుకోనని సీతకు చెప్పాడు. అదే సమయంలో.. తనలో ఎప్పుడూ రాముడు అమరంగా ఉంటాడని.. తన గుండె చీల్చి చూపిస్తాడు.
హనుమంతుడి పాదాలు తాకడానికి మహిళలు దూరం
హనుమాన్ జయంతి రోజు భక్తులు సింధూరం రాసుకుని.. హనుమంతుడి ఆలయాలు దర్శిస్తారు. కోతులకు అరటిపండ్లు తినిపించి.. ఆ రోజంతా ఉపవాసం ఉంటారు. హనుమంతుడు బాల బ్రహ్మచారి. కాబట్టి.. హనుమంతుడిని మహిళలు పూజించవచ్చు. కానీ.. ఆయన విగ్రహాన్ని తాకడానికి వీలులేదు
హనుమజ్జయంతి జీవితంలో ఒక్కమారు చేసినట్లైతే వంశమంతా తరించిపోతుందన్నారు. జయంతి చేసేరోజు గృహస్థు భోజనం చేయకుండా ఉండకూడదు. ఒకపూట భోజనం చేసి తీరాలి. యతి పురుషులు ఈరోజు భోజనం చేయకూడదు. పూర్ణ ఉపవాసం చేయాలి. హనుమజ్జయంతి చేసే గృహస్థు యొక్క భార్య జీవితంలో ఒక్కహనుమజ్జయంతినాడైనా సరే గురువింద పూసలతో ఉపాసన అని ఒకటున్నది.భర్త పూజ అంతా అయిన పిదప భార్య స్వచ్ఛమైన ఆవునేతిని తీసుకువచ్చి అప్పాలను సాయంకాలం వరకు వేయించాలి. అనగా సాయంకాలం వరకు ఎన్ని చేయగలిగితే అన్ని అని..మాడ్చమని కాదు. ఒకేగోత్రంతో ఉన్న కుటుంబాలలో ఉన్న తోడికోడళ్ళు అందరూ కలిసి హనుమజ్జయంతి చేస్తారు. హనుమ అంత త్వరగా ప్రీతిచెందే మహాపురుషుడు మరొకరుండరు. ఈ అప్పాలను సాయంకాలం సీతారామచంద్రులకు, హనుమకు, పరివారమునకు మంత్రంతో స్వాగతం పలికి నివేదన చేసి సీతారామచంద్రులయందు అపారభక్తికలిగిన వాడు, హనుమను ఉపాసన చేస్తున్నటువంటి వ్యక్తి హనుమజ్జయంతినాడు మీకు తారసపడితే వారి ఇంటికి వెళ్ళేటటువంటి చనువు మీకున్నా వారు మీఇంటికి వచ్చేటటువంటి అనుగ్రహం వారికున్నా ఒక విషయం చేత మీ జన్మ పండుతుంది అన్నారు. అటువంటి పరమభక్తుడైన వ్యక్తితో పరిచయం ఉంటే సూర్యాస్తమయం అయ్యే లోపల ఐదు ఆకులు కానీ, పండ్లు కానీ, అప్పములు కానీ తీసుకెళ్ళి వారికిస్తే వారు ఆ రోజు తీసుకొని ఒక్కపండుముక్క ఆయన నోటిలో వేసుకున్నా మీజన్మ తరించిపోయినట్లే. హనుమజ్జయంతికి అయిదు అంకెతో అంత అనుబంధం. ఒకేజాతికి చెందిన అయిదు ఫలాలను ఇవాళ్టి రోజున సీతారామచంద్ర ప్రభువుయొక్క పాదములయందు అపారమైన భక్తి కలిగినటువంటి వారు, హనుమను సేవించేటటువంటి వాడు, అటువంటి వారి ఇళ్ళకు వెళ్ళగలిగిన చనువు మీకుంటే (నిత్యము, నైమిక్తికము అని రెండు రకాల తిథులుంటాయి. సంధ్యావందనాదులు రోజూ చేస్తూ ఉంటారు.నైమిక్తికము అంటే ప్రత్యేక తిథులు వీటియందు కొన్ని ప్రత్యేకమైన పనులుంటాయి. అవి చేస్తే జన్మ తరిస్తుంది. అవి సులభ మార్గములు.)వారు పుచ్చుకుంటే మీజన్మ తరించిపోయినట్లే. ఎందుకంటే అది సాక్షాత్ హనుమయొక్క స్వీకారమే. ఇలా చెప్పింది పరాశర సంహిత. అయిదంకె మీద పండు, అయిదంకె మీద ఆకు, అయిదంకె మీద నేతి అప్పములు, ఆలయంలో అర్చన చేసేవాళ్ళు, సీతారామచంద్రులను నమ్ముకున్నభక్తులకు ఇవ్వండి. అలా ఇస్తే మీరు తరిస్తారు. హనుమ ఆవాహన ఎక్కడ తొందరగా జరుగుతుందంటే అరటి చెట్లు బాగా కట్టి అరటి గెలలు బాగా వంగి ఉండేటట్లుగా అలంకారం చేసి అప్పుడు హనుమజ్జయంతి చేయాలి. హనుమ తొందరగా ప్రసన్నులైపోవాలంటే అరటితోటలోకి వెళ్ళి హనుమయంత్రం కానీ హనుమ బొమ్మ కానీ హనుమ అని వ్రాసి కానీ అక్కడ పెట్టి మీరు కానీ ఉపాసన చేశారా ప్రత్యక్షమైనటువంటి స్వరూపంతో స్వామి వచ్చి తీసుకొని తీరుతారు అని అభయమిచ్చింది పరాశర సంహిత. అన్నింటికన్నా ఆయన తొందరగా ప్రీతి చెందేది అరటిపండు వల్ల. కదళి పూజ అని ప్రత్యేకమైన పూజ ఆయనకి. అలా చేస్తే ఏదో ఒక రూపంతో మీకు కంటికి కనపడే రూపంతో రాకపోవచ్చు. కానీ ఏదో ఒక రూపంతో ఆయన వచ్చి తీసుకొని వెళ్ళి తీరుతారు. తొందరగా ప్రసన్నుడై వస్తే వానరరూపంలో వస్తారు. తప్పకుండా అరటిపండ్లు నివేదన చేయాలి. పరమ ప్రసన్నుడౌతాడు స్వామి. ఈ రోజు తప్పకుండా దేవాలయంలో హనుమ దర్శనం చేసుకోవాలి. హనుమ గురించి తప్పకుండా నాలుగు మాటలు వినాలి. ఎవరికి హనుమ అనుగ్రహం కలగాలని హనుమ భావిస్తున్నారో వారు మాత్రమే వింటారు.
హనుమద్వ్రతము మార్గశీర్ష మాసంలో శుక్లపక్షంలో వచ్చే త్రయోదశి నాడు హనుమద్వ్రతం చేస్తారు. దీనికి కూడా కల్పమేదైనా ఉందా? కల్పం ఉంటే అది వైదికము అని గుర్తు. ఋషులు నిర్దేశించిన పద్ధతిలో జరిగిన దానిని కల్పము అంటారు. సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారనుకోండి కల్పోక్త ప్రకారేణ అంటారు. అంటే కల్పము ఎలా చెప్పిందో అలా చేయాలి. దానికి ఒక పద్ధతిని ఋషులు నిర్ణయించి పెట్టారు. అంటే అది ఖచ్చితంగా మీకు ఫలితాన్నిచ్చేస్తుంది. హనుమద్వ్రతమునకు కల్పము ఉన్నది.
బుద్ధిబలం … బాహుబలం … యోగబలం … గ్రహబలం … దైవబలం సొంతం చేసుకున్నవాడిగా హనుమంతుడు కనిపిస్తుంటాడు. శివాంశ సంభూతుడిగా చెప్పబడుతోన్న హనుమంతుడు, శ్రీమన్నారాయణుడి అవతారమైన రాముడిని తన హృదయంలో బంధించాడు. అందువల్లనే హనుమంతుడిని సేవిస్తే, శివకేశవులను పూజించిన ఫలితం దక్కుతుందని అంటారు.
హనుమంతుడి వాహనంగా ‘ఒంటే
ఇక హనుమంతుడు సూర్యభగవానుడి చెంత శాస్త్రవిజ్ఞానాన్ని సంపాదించుకోవడమే కాకుండా, ఆయన కూతురు సువర్చలను వివాహం చేసుకున్నాడు. అందువలన గ్రహాలు ఆయనపై దుష్ప్రభావాలు చూపించలేవు. ఈ కారణంగానే గ్రహపీడితులు హనుమంతుడిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తూ వుంటారు. అలాంటి హనుమంతుడి జయంతిని ఉత్తరాదికి చెందినవాళ్లు ‘చైత్రపౌర్ణమి’ రోజున నిర్వహిస్తూ వుండగా, ‘వైశాఖ బహుళ దశమి’ రోజున దక్షిణాదివాళ్లు జరుపుతుంటారు.
ఈ రోజున హనుమంతుడి ఆలయాలన్నీ కూడా భక్తుల సందడితో కళకళలాడుతూ కనిపిస్తూ వుంటాయి. ఈ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించాలి. పూజామందిరాన్ని శుభ్రపరిచి హనుమంతుడి చిత్రపటాన్ని పూలమాలికలతో అలంకరించాలి. హనుమంతుడి వెండి విగ్రహాన్ని పంచామృతాలతో అభిషేకించాలి. స్వామివారిని అంకిత భావంతో సిందూరంతోను … తమలపాకులతోను పూజించాలి.
హనుమంతుడికి వడలు అంటే ఎంతో ఇష్టం … వడమాల తెచ్చినవారిపట్ల ఆయన మరింత వాత్సల్యాన్ని ప్రదర్శిస్తాడట. ఇక ఈ కాలంలో లభించే రుచికరమైన మామిడి పండ్లను … బెల్లంతో తయారుచేసిన పొంగలిని ఆయనకి నైవేద్యంగా సమర్పించాలి. ఆ తరువాత దగ్గరలో గల హనుమంతుడి ఆలయానికి వెళ్లి ఆయనకి ప్రదక్షిణలు చేయాలి.
హనుమజ్జయంతి రోజు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో హనుమాన్‌ను ఆలయంలో దర్శించుకుని, ఎర్రటి ప్రమిదల్లో జిల్లేడు వత్తులు, నువ్వులనూనెతో దీపమెలిగించే వారికి ఆయుర్దాయం, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.
స్వామికి ప్రీతి పాత్రమైన పువ్వులు:
తమలపాకుల దండ:…….
ఒక కధ ప్రకారం, అశోక వనంలో ఉన్న సీతమ్మవారికి, హనుమంతుడు రాములవారి సందేశము చెప్పినప్పుడు, అమ్మవారు ఆనందంతో హనుమంతునికి తమలపాకుల దండ వేసారట, దగ్గరలో పువ్వులు కనిపించక! అందుకే స్వామికి తమలపాకుల దండ అంటే ప్రీతి అని చెప్తారు.
మల్లెలు:……………
గురువారాలు స్వామికి మల్లెలతో పూజ చెయ్యడం చాల శ్రేష్టం.
పారిజాతాలు:………..
స్వామికి పరిమళభరితమైన పువ్వులంటే చాల ప్రీతి. అందుకే పారిజాతంపూలతో పూజ చేస్తారు.
తులసి:………….
తులసి రాములవారికి ప్రీతిపాత్రమైనది, అందుకే హనుమంతునికికూడా ఇష్టమైనది కలువలు: ……………..
కలువ పువ్వులు కూడా శ్రీరాములవారికి యెంతో ఇష్టమైన పూలు. భరతుని ఉన్న ఒక్క కోవెల ఇరింజలకుడ, కేరళలో అతనికి కలువ పూల మాల వెయ్యడం సాంప్రదాయం. శ్రీరాములవారికి హనుమంతుడంటే భరతుడు మీద ఉన్నంత వాత్సల్యం ఉండడం చేత, హనుమత్ స్వామికి కూడా కలువ మాల వేస్తారు.
స్వామివారి సన్నిధిలో కాసేపు కూర్చుని ‘హనుమాన్ చాలీసా’ చదువుకోవాలి … సుందరకాండ పారాయణం చేసుకోవాలి. ఈ విధంగా హనుమంతుడి జయంతి రోజున ఆయనకి సంతోషాన్ని … సంతృప్తిని కలిగించడం వలన ఆయురారోగ్యాలు … అష్టైశ్వర్యాలు కలుగుతాయి
సర్వ కార్య సిద్ధికి:
జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః!
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభి పాలితః!!
దాసోహం కోసలేంద్రస్య రామ స్యాక్లిష్ట కర్మణః!
హనుమాన్ శతృ సైన్యానాం నిహంతా మారుతాత్మజః!!
న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్!
శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః!!
అర్ధయిత్వా పురీం లంకామభివాద్య చ మైధిలీం!
సమృద్ధార్దో గమిష్యామి మిషతాం సర్వరక్షసామ్!!
శ్రీరామరామ రామేతి రమేరామే మనోరమే
సహస్రనామ తత్‌తుల్యం రామనామ వరాననే
మనం కూడా స్వామిని స్తుతిస్తే సకల శుభాలూ కలిగిస్తాడు.
హనుమజ్జయంతి అయిన ఈరోజు ప్రత్యేకంగా సకల శాస్త్ర పారంగతుడూ, సర్వశక్తిమంతుడూ అయిన హనుమని సేవిద్దాం. మన జీవిత లక్ష్యాలు నెరవేర్చుకొందాం.
జై శ్రీరామ్ జై జై శ్రీరామ్
జై హనుమాన్ జై జై హనుమాన్
సేకరణ

No comments:
Post a Comment