Tuesday, May 24, 2022

కమ్యూనికేషన్ కి మాటలే అవసరం లేదు, చేతలద్వారా కూడా చెయ్యవచ్చు.

నేటి ఆణిముత్యాలు.

కమ్యూనికేషన్ కి మాటలే అవసరం లేదు, చేతలద్వారా కూడా చెయ్యవచ్చు.

ఉంది గదా అని, మనం ఊరికే నోరుపారేసుకుంటాం గానీ, నిశ్శబ్దం కూడా ఒక భావవ్యక్తీకరణే.

అమ్మ పళ్ళుపటపటా కొరికి, చూపుడువేలు చూపిందీ అంటే "జాగ్రత్త" అన్నట్టే.

"అబ్బాయి నచ్చాడా" అని పెళ్ళి కూతురుని అడిగితే, కళ్ళు వాల్చి, లోపలికి వెళ్ళిపోతుంది. అంటే, చెప్పక చెప్పినట్టేగా.

భార్యకోపంగా ఉన్నప్పుడు, భర్త కామ్ గా తనపని తాను చేసుకుంటున్నాడంటే "ఎందుకైనా మంచిదని" అర్థం.

ఇలా రకరకాల సందర్భాల్లో మాటలు లేకుండా భావం వ్యక్తీకరించవచ్చు.

ఈపసివాళ్ళ పరిస్థితీ అంతే. ఏదో మాట్లాడాలని ప్రయత్నం. సరిగా రాక, చిరునవ్వుతో, కౌగిలింతతో తమ మనోగతాన్ని చెప్పుకుంటున్నారు.

ఉదాహరణకి, ఈ పోస్టింగే చూడండి. నేనూ మాట్లాడను, మీరూ మాట్లాడారు. కానీ, కమ్యూనికేషన్ పాసయింది.

అదే బెటరు, కాస్త వాయిస్ పొల్యూషన్ తగ్గించినవాళ్ళం అవుతాం.

*శుభోదయం చెప్తూ మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment