ప్రియమైన ఆత్మీయ ఆత్మ బంధువులారా! ఈరోజు ఒక మధురమైన తీపికబురును
మీతో పంచుకోవాలనిపిస్తుంది.
ఈరోజు మా జీవితంలో మరపురాని మధురమైన రోజు. అదే 50వ మా వివాహ స్వర్ణోత్సవ రోజు.
మన జీవితాలలో ఏర్పడే అనేక బంధాలలో ముఖ్యమైనది వివాహ బంధం. ఒక జంట 50 సంవత్సరాలు సమిష్టి జీవితాన్ని పూర్తి చేసుకోవటం చాలా అరుదు. అలాంటి అరుదైన అదృష్టం మా దంపతులకు దక్కటం ఎంతో పరమానందాన్ని కలిగిస్తుంది. ఈ 50 సంవత్సరాల జీవితాన్ని వెనక్కి తిరిగి చూస్తే అది నిన్నటిలా ఉంది. మా ఈ వైవాహిక జీవితంలో భార్యాభర్తల అనుబంధాల్ని గురించి మేము తెలుసుకున్న సత్యాలను మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది
అమ్మ లేకుంటే మనకు జన్మ లేదు భార్య లేకుంటే ఆ జన్మకు అర్థం లేదు.
భార్యాభర్తల అనుబంధం కంటికి చేతికి ఉండే సంబంధంలా ఉండాలి. చేతికి దెబ్బ తగిలితే కన్ను ఏడుస్తుంది, కన్ను ఏడుస్తుంటే చేయి తుడుస్తుంది.
భర్తకి భార్య బలం కావాలి బలహీనత కాకూడదు. భార్యకి భర్త భరోసా కావాలి భారం కాకూడదు. భార్యాభర్తల అనుబంధం అన్యోన్యం కావాలి, అయోమయం కాకూడదు.
పాలించేవాడు భర్త అయితే లాలించేది భార్య. అందించేవాడు భర్త అయితే ఆదరించేది భార్య. పేరు తెచ్చే వాడు భర్త అయితే ఆ పేరుని నిలబెట్టేది భార్య. నవ్వించేవాడు భర్త అయితే ఆ నవ్వును చిరకాలం నిలిపేది భార్య. ప్రేమించేవాడు భర్త అయితే ఆ ప్రేమకు స్పందించేది భార్య.
భార్య అంటే భారాన్ని పెంచేది కాదు బాధ్యతను పంచుకునేది. భర్త అంటే భరించేవాడు కాదు భారం అనుకోకుండా ఉండేవాడు.
గొడవ పడకుండా ఉండే బంధం కన్నా ఎంత గొడవపడినా విడిపోకుండా ఉండే బంధం దొరకటం ఒక గొప్పవరం.
ఇలాంటి వైవాహిక బంథంలో ఎన్నో అనుభవాలను ఆచరించి అనుభవించి మీ అందరితో షేర్ చేసుకోవడం ఎంతో పరమానందంగా ఉంది.
మీ రమణి, రామిరెడ్డి దంపతులు 👏

No comments:
Post a Comment