Tuesday, May 24, 2022

దేవుడు ఎక్కడో ఉండడు భగవంతుడి స్థానం మన మనస్సు.

శుభోదయం మిత్రులారా!!

దేవుడు ఎక్కడో ఉండడు భగవంతుడి స్థానం మన మనస్సు. దేవుడు కొలువై ఉన్న ఆలయాన్ని ఎంత పవిత్రంగా ఉంచుతామో, మనసనే మందిరాన్ని కూడా అంతే పవిత్రంగా ఉంచాలి. కానీ మనం ఏం చేస్తున్నాము? ఈర్ష,అసూయ,ద్వేషం, కుళ్లు,కుతంత్రం,వైరం, వీటన్నింటినీ మోసుకొని తిరుగుతూ వ్యాపింప చేస్తున్నాము. ఇప్పుడు చెప్పండి ఇటువంటి దుర్గంధ పూరితమైన వాతావరణంలో దైవం ఎలా కొలువై ఉండటం అసంభవం కదా! అందుకే నాది నాది అని తపించే వాళ్లకీ ఏదీ మిగలదు. నిజానికి ఏది నీది? అశాశ్వతమైన ఈ జీవితంలోని ప్రతిక్షణం ఏది నీది కాదు! ఈ నిమిషం నీతో ఉన్న వారు మరు నిమిషంలో నీతో ఉండరు. రాబోయే గంటలో మీ జీవితం ఏ మలుపు తిరుగుతుందో నీకు తెలియదు కనిపించే నీ బంధువులు నీ పగ, ప్రతీకారాలు రాగద్వేషాలు అన్నీ అశాశ్వతమే! మరి మనం పుట్టింది ఎందుకు? వీటన్నిటికీ అతీతమైన శాశ్వతమైన దైవాన్ని తెలుసుకునేందుకు మనం పుట్టింది. అమృతమయమైన దైవ ప్రేమను అనుభూతి చెందడానికి. కానీ నేను నాది అనే మాయ పొర మనకు దైవానికి మధ్య అడ్డుతెర ఆ తెర తొలగించి ఒక్క సారి కనిపించే అందరిలో, అన్నింటిలో దైవం కొలువై ఉన్నాడనే నిజాన్ని దర్శించ గలిగితే ఇక మీ జీవితం ధన్యం.

శుభోదయం తో మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment